CM Jagan mohan reddy : ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏం చెప్పింది… ఆ పాదయాత్రపై ఎవరూ మాట్లాడొద్దు… అందరికీ ఆదేశాలు వచ్చాయి… లోకేష్ పాదయాత్రపై ఊహించని నిర్ణయం…!

0
130

CM Jagan Mohan reddy : పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన నాయకులకు మన దేశంలో కొదవ లేదు. అయితే ఏపీలో పాదయాత్ర అనగానే రాజశేఖర్ రెడ్డి గుర్తొస్తారు. ఆ తరువాత ఆయన కూతురు షర్మిల అన్న జగన్ జైలులో ఉన్నపుడు ఓదార్పు యాత్ర అంటూ చేసారు. ఆపైన జగన్ కూడా పాదయాత్ర, ఓదార్పు యాత్ర చేసి జనంలోకి వెళ్లారు. ఇక తెలుగు దేశం అధినేత చంద్రబాబు కూడా పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు. ఒకవైపు ఇండియా మొత్తం రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నా పెద్దగా ఎక్కడా హైప్ లేదు. ఇక ప్రస్తుతం ఏపీలో మరోసారి పాదయాత్ర నడుస్తోంది. ఈ సారి జగన్, చంద్ర బాబు కాదు.. చంద్రబాబు తనయుడు నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నాడు. అయితే ఈ పాదయాత్ర గురించి పెద్దగా చర్చ లేదు, మీడియా కవరేజ్ లేదు. ఇక సీఎం జగన్ కు ఇంటలిజెన్స్ రిపోర్ట్ రావడంతో లోకేష్ పాదయాత్ర మీద అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.

ఎవరూ మాట్లాడొద్దు…

లోకేష్ పాదయాత్ర మొదటి రోజు తారకరత్నకు గుండెపోటు రావడంతో ఆ రోజు మొత్తం తారక రత్న గురించి మీడియాలో కథనాలు వచ్చాయి. ఇక ఓ నాలుగు రోజులు అదే సాగగా ఆ తరువాత అసంతృప్త వైసీపీ లీడర్స్ ప్రెస్ మీట్ హైలైట్ అయింది. నిజానికి టీడీపీ అనుకూల మీడియాలో కూడా పాదయాత్ర గురించి పెద్దగా కవరేజ్ లేదు. ఇక సీఎం జగన్ కి ఇంటలిజెన్స్ రిపోర్ట్ లో కూడా లోకేష్ పాదయాత్ర ను జనాలు సీరియస్ గా తీసుకోలేదనే వచ్చిందట.

అంతేకాక జనాలు కూడా లోకేష్ పాదయాత్రకు పలుచగా ఉన్నట్లు తేలింది. దీంతో జగన్ కూడా తన ఎమ్మెల్యేలకు పార్టీ లీడర్లకు లోకేష్ పాదయాత్ర గురించి గైడన్స్ ఇచ్చారట. ఎవరూ లోకేష్ పాదయాత్ర గురించి మాట్లాడొద్దని చెప్పారట. అనుకూల మీడియాలోనే కథనాలు రానపుడు మనం లోకేష్ ను విమర్శించి మరీ ఎందుకు హైలైట్ చేయాలి అని జగన్ సూచించారట. లోకేష్ ఎలా విమర్శించినా ఎవరూ పట్టించుకోవద్దు, కౌంటర్ ఇచ్చి మనమే హైప్ లోకేష్ ఇవ్వద్దు అని డిసైడ్ అయ్యారట జగన్.