Danush: కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి వారిలో నటుడు ధనుష్ ఒకరు. హీరోగా ఎన్నో విభిన్న కథ చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్న ధనుష్ 2004వ సంవత్సరంలో సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ ను వివాహం చేసుకొని రజనీకాంత్ కు అల్లుడు అయ్యారు. ఇలా రజినీకాంత్ కి ధనుష్ అల్లుడు మాత్రమే కాకుండా పెద్ద అభిమాని అనే విషయం మనకు తెలిసిందే. ఇక ధనుష్ ఐశ్వర్య వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా కొనసాగుతున్న సమయంలోనే వీరిద్దరు గత ఏడాది విడాకులు తీసుకుని విడిపోయారు.

ఈ విధంగా ఐశ్వర్య, ధనుష్ ఇద్దరు కూడా విడాకులు తీసుకొని విడిపోయినప్పటికీ రజనీకాంత్ గారి పట్ల తనకు ఉన్నటువంటి అభిమానం ఏమాత్రం తగ్గదని పలు సందర్భాలలో ధనుష్ తెలియజేశారు.అయితే సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే ఆయన సినిమాలు అంటే ఈయనకు ఎంత ఇష్టమో తాజాగా మరోసారి రుజువు చేసుకున్నారు.ఇక నేడు రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలకు ముందు ఈ సినిమా గురించి సోషల్ మీడియా వేదికగా స్పందించిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

Danush: బంధం వీడిన అభిమానం వీడలేదు…
జైలర్ సినిమా నేడు విడుదల కానున్న నేపథ్యంలో ఈయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఇట్స్ జైలర్ వీక్ అంటూ చేసినటువంటి ట్వీట్ వైరల్ అవుతుంది. దీన్ని బట్టి చూస్తుంటే జైలర్ సినిమా కోసం ధనుష్ ఎంతగా ఎదురుచూస్తున్నారో తెలుస్తుంది. ఈ ట్వీట్ చూసినటువంటి కొందరు అభిమానులు ధనుష్ తన మాజీ మామ సినిమా పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.తన భార్యకు విడాకులు ఇచ్చినప్పటికీ రజినీకాంత్ పట్ల ఉన్నటువంటి అభిమానం ఎప్పటికీ తగ్గదని మరోసారి ధనుష్ నిరూపించుకున్నారు.
It’s JAILER week 😁😁😁
— Dhanush (@dhanushkraja) August 7, 2023