టాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు, నిర్మాతలు అరెస్ట్ కావడం ఫిలింనగర్ లో హాట్ టాపిక్ గా మారింది. డిగ్రీ కాలేజీ అనే సినిమా చేస్తున్న డైరెక్టర్ నరసింహ నంది, నిర్మాత శ్రీనివాస్ వీరిద్దరిని బుధవారం ఎస్.ఆర్.నగర్ పోలీసులు అరెస్ట్ చేసారు. హైదరాబాద్, మైత్రీవనంలోని ఈ సినిమాకు సంబంధిన అస్లీల పోస్టర్లు అంటించారనే కారణంతో వీరిద్దరిని అరెస్ట్ చేసినట్టు ప్రాధమిక సమాచారం. అస్లీల పోస్టర్లను అంటించడంపై మైత్రీవనంలోని సీనియర్ సిటిజన్స్ కొద్దిమంది వారి వ్యతిరేకతను తెలియజేస్తూ ఎస్.ఆర్.నగర్ పోలీస్టేషన్లో పిర్యాదు చేయడం జరిగింది. వీరినుంచి కంప్లైంట్ అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి సదరు “డిగ్రీ కాలేజ్” సినిమా దర్శక నిర్మాతలను అరెస్ట్ చేసారు. శ్రీలక్ష్మి నరసింహ సినిమా పతాకంపై కధానాయకుడిగా వరుణ్, కథానాయికగా దివ్యారావ్ కలిసి నటిస్తున్న చిత్రం “డిగ్రీ కాలేజ్”. ఈ చిత్రాన్ని టీనేజ్ ప్రేమ నేపథ్యంలో తీశారు. ఈ చిత్రానికి దర్శకుడు నరసింహ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ప్రసాద్ లాబ్స్ లో ఇటీవలే ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరుపుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 7వ తేదీన విడుదలకానుంది. ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య, నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కళ్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ మొదలుగు ప్రముఖులు హాజరయ్యారు.

ఆ సందర్భంగా విడుదల చేసిన ట్రైలర్ పై ఫిలింనగర్లో పెద్ద చర్చ జరుగుతోంది. ట్రైలర్ లో ఉన్న అస్లీల సన్నివేశాలను కొంతమంది బాహాటంగానే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. క్లాస్ రూమ్ లో జరిగియే రొమాన్స్ సన్నివేశాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇవేం సినిమాలని దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ చిత్రంలోని అస్లీల సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో సినిమా విడుదలను అడ్డుకుంటామని తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. అయితే కుర్రకారుని టార్గెట్ చేసి చేసిన ఈ ట్రైలర్ విడుదల చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ తరహా సినిమాలు చేయడం ఈ డైరెక్టర్ కి కొత్తేమీకాదు, ఇది వరకు కూడా హైస్కూల్, కమలతో నా ప్రయాణం, లజ్జ వంటి చిత్రాలను తెరకెక్కించిన నరసింహ నంది తాజాగా అయన సినిమాకి వస్తున్నా ఈ వ్యతిరేకతని పెద్దగా పట్టించుకోవడం లేదు. తాజాగా ఈ ట్రైలర్ మరియు పోస్టర్లను చూసిన వారికీ చిర్రెత్తుకొచ్చిందట వెంటనే దీనిపై పోలీస్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం. పోలీసులు చిత్ర నిర్మాత మరియు దర్శకులను అరెస్ట్ చేయడం జరిగింది. ఇంతగా వ్యతిరేకిస్తున్న ఈ సినిమా సీన్స్ ని దర్శక నిర్మాతలు తొలగిస్తారో లేదో చూడాలి. ఈ సినిమాలో ఉన్న అస్లీల సన్నివేశాలను పూర్తిగా తొలగించాలని, లేని పక్షంలో సినిమా విడుదలకు అడ్డుకుంటామని ఇప్పటికే ప్రకటించారు.

ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ మీకోసం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here