Director Krishnavamsi : మురారి సినిమాలో మహేష్ బాబుకి ఆడవాళ్ల పట్టుచీరలతో షర్ట్స్ కుట్టించాను…మహేష్ ఏంటి సార్ ఇది అని గొడవ చేసేవాడు : డైరెక్టర్ కృష్ణవంశీ

0
94

Director Krishnavamsi : సున్నిత అంశాలతో భావోద్వేగాన్ని చూపిస్తూ సినిమాల్లో సహజంగా అనుబంధాలను చూపించే దర్శకుడు తెలుగులో కృష్ణ వంశీ అని చెప్పొచ్చు. ఆయన తీసిన సింధూరం, ఖడ్గం వంటి సినిమాలు మొదలు నిన్నేపెళ్లాడతా, మురారి వంటి సినిమాల వరకు అన్ని ప్రేక్షకులను కట్టిపడేసాయి. అలాంటి కృష్ణ వంశీ చాలా కాలంగా మెగా ఫోన్ కి దూరంగా ఉంటున్నాడు. వరుస ప్లాప్స్ తో సతమతమవుతున్న సమయంలో రంగమార్థండ అనే సినిమాతో మరోసారి వచ్చారు. ఇక తన కెరీర్ కి సంబంధించిన అనేక విషయాలను ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పంచుకున్నారు.

మహేష్ షర్ట్స్ అన్ని పట్టుచీరలతో కుట్టించా…

మురారి సినిమా కుటుంబ కథ చిత్రంగా వచ్చి మంచి హిట్ అందుకుంది. ఆ సినిమాలో మహేష్ బాబు శ్రీ కృష్ణుడి లక్షణాలతో ఉండేలాగా డైరెక్టర్ క్యారెక్టర్ డిజైన్ చేసుకున్నాడు. ఇక మహేష్ పెద్ద వదిన పిల్లలు లేకుండా తన కొడుకు లాగ మరిదిని చూడటం యశోద కృష్ణుల లాగా వాళ్లిద్దరిని చూయించాడు దర్శకుడు.

సినిమాలో ఆడవాళ్ళ మధ్యలోనే ఎక్కువగా మహేష్ సీన్స్ ఉంటాయని శ్రీ కృషుడు అనగానే అమ్మాయిలు చుట్టూ ఉంటారు అందుకే మహేష్ కి ఈ సినిమాలో పట్టు చీరలతో షర్ట్స్ కుట్టించాము. బాందిని,పట్టు ఇలా కొన్నిచీరలతో కుట్టించాను. మహేష్ అవి చూసి ఏంటి సర్ ఇది అని గొడవ చేసేవాడు అంటూ కృష్ణ వంశీ తెలిపారు .