రామ్ గోపాల్ వర్మ మైండ్ గేమ్ ఎలా ఆడతారో మీకు తెలుసా..?

0
213

కాంట్రవర్సి కి కేరాఫ్ అడ్రస్ రాంగోపాల్ వర్మ అన్న విషయం సోషల్ మీడియా ను ఫాలో అవుతున్న ప్రతి నెటిజన్ కు తెలుసు. డిఫరెంట్ మెంటాలిటీ. నెగిటివ్ థింకింగ్, స్ట్రైట్ ఫార్వర్డ్ నెస్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్. వెరైటీ ఆటిట్యూడ్, అంతకుమించి గట్స్ వర్మ సొంతం.

నాటి శివ సినిమా నుండి నేటి పవర్ స్టార్ సినిమా వరకు దాదాపుగా కాంట్రవర్సి లేని సందర్భాలు చాలా తక్కువ సొసైటీకి భిన్నంగా ఆలోచించే వ్యక్తి వర్మ. ఆ రోజుల్లో ఆయన కరాటే అభ్యాసం,సినిమాలు చూడడం,ఇంగ్లీష్ నావెల్స్ చదవడం ఎదురైన మనుషుల మనస్తత్వాలను అధ్యయనం చేయడం లాంటివి చేసేవాడు.

తన కాలేజీ డేస్ గురించి చెప్పకుండా వర్మ గురించి చెప్పడం చాలా కష్టం. వర్మ చదివిన విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో గ్యాంగ్ వార్స్ ఉండేవి. కాలేజీ రోజుల్లో వర్మ ఫిజికల్ గా హైట్,వెయిట్ తక్కువగా ఉండేవాడు. వర్మ ఏ సమస్య వచ్చినా గ్యాంగ్ వార్స్ తో ఎప్పుడు ప్రత్యక్షంగా ఫైట్ చేసేవాడు కాదు.రాంగోపాల్ వర్మ ఎప్పుడూ తన చుట్టూ ఆరుగురు వ్యక్తులతో రెగ్యులర్ గా తిరుగుతుండేవాడు. తనను ఎవరైనా ఏమైనా అంటే అతని చుట్టూ ఉన్న ఆరుగురు ఎటాక్ చేస్తారేమో అనే భావనను ఎదుటి గ్యాంగ్ లో కల్పించేవాడు. వర్మతో ఉన్న ఆరుగురిలో ఎవరో ఒకరు తనపై ఎటాక్ చేస్తే మిగతా అయిదుగురు ఆ వ్యక్తి పై దాడి చేస్తారన్న భయాన్ని వీరి మధ్య కల్పించేవాడు. తనకి ఫిజికల్ స్ట్రెంత్ లేకపోవడం వలన ఈ తరహా మైండ్ గేమ్ తో కాలేజీలో ఆత్మరక్షణ పొందేవాడు.

కాలేజీ చదువు అయిపోవడంతో తాతగారు సివిల్ ఇంజనీర్ కావడంతో కృష్ణ ఒబేరాయ్ లో సైట్ ఇంజనీర్ గా పెట్టారు. కానీ వర్మ దృష్టి ఎప్పుడూ సినిమాలపైనే ఉండేది. అలా అమీర్ పేటలో లో ఒక వీడియో లైబ్రరీ నడుపుతూ తన షాపుకు‌ వచ్చిన యార్లగడ్డ సురేంద్ర ద్వారా అక్కినేని వెంకట్ అపాయింట్మెంట్ సంపాదించ గలిగాడు. కానీ వర్మ కు దర్శకుడిగా ఎలాంటి అనుభవం లేదని వారు చెప్పడంతో ఒకటి, రెండు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాడు. అక్కడ ఎక్కువ కాలం ఉండలేదు. తాను అనుకున్న కథను అక్కినేని వెంకట్ కు చెప్పి ఆ కథ నాగేశ్వర రావు గారు బాగుంద అన్నారని చెప్పి, అదే కథను నాగార్జునకు చెప్పి తనకు సినిమా అనుభవం ఏమీ లేకున్నా మొత్తానికి ఆ ముగ్గురిని తన మైండ్ గేమ్ తో ఒప్పించగలిగారు. అలా ఎట్టకేలకు చిట్టచివరికి పట్టాలెక్కి తెలుగు చలనచిత్ర చరిత్ర గతిని మార్చిన చిత్రం శివ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here