Director Relangi Narasimharao : పాలకొల్లు కి చెందిన రేలంగి నరసింహారావు గారు దాదాపుగా తెలుగులో డెబ్భై సినిమాలు తీశారు. ఎక్కువగా రాజేంద్ర ప్రసాద్ హీరోగా సినిమాలు చేసిన ఆయన సినిమా ప్రయాణంలోని విశేషాలను తాజాగా ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తెలుగే కాకుండా కన్నడలో కూడా సినిమాలను డైరెక్ట్ చేసారు నరసింహారావు. ఇక ఆయన సుమన్, రేవతి, కిన్నెరలను తెలుగు తెరకు పరిచయం చేసారు.ఇక రేలంగి గారు రాజేంద్ర ప్రసాద్ గారు హీరోగా ఎక్కువ సినిమాలను తీశారు. హాస్య ప్రధాన సినిమాలను తీసే ఈయన ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం, సంసారం, సుందరి సుబ్బారావు, చిన్నోడు పెద్దొడు, ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్ వంటి ఎన్నో హిట్ చిత్రాలను తీసారు. ఇక రాజేంద్ర ప్రసాద్ గారితో దాదాపు ముప్పై సినిమాలను చేసారు రేలంగి. వారిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం సినిమా మంచి హిట్ . ఇక ఆ సినిమా అనుభవాలను తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పంచుకున్నారు రేలంగి గారు.

దివ్యావాణి అత్తతో అలాంటి పనులు చేయించింది….
జంధ్యాల గారి అహన పెళ్ళంటా సినిమా చూసాక ఒక పిసినారి పాత్ర నుండి కథ అల్లుకుని హాస్యం పుట్టించి హిట్ కొట్టిన విధానం చూసి పిసినారి కాన్సెప్ట్ తో సీనిమా తీయాలనీ డిసైడ్ అయ్యారట రేలంగి. అలా మొదలయినా ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం సినిమాలో కొన్ని సన్నివేశాలు బాగా కంటతడి పెట్టిస్తాయి అంటూ చెప్పారు.

సినిమాలో రాజేంద్ర ప్రసాద్ తల్లి అయినా అన్నపూర్ణమ్మ విడిపోయిన కొడుకు కోడలిని కలపడానికి కోడలి వద్దకు పనిమనిషిగా వెళ్తుంది నిజానికి పక్కింటి ఆమెగా పెడితే కనెక్టివిటీ ఎక్కువగా ఉండదని అలా పనిమనిషి గా ఆమె వెళ్లేలా కథలో రాసుకున్నట్లు తెలిపారు. అది కూడ ఒక తమిళ సినిమా భానుచందర్ రజనీకాంత్ సినిమాలో అలాంటి ఒక క్యారెక్టర్ ను తీసుకుని ట్రై చేశామని కోడలు అత్తను చెప్పులు కుట్టించుకు రమ్మని చెప్పడం, కాళ్ళు పట్టించుకోవడం వంటివి చాలా ఎమోషనల్ సీన్స్ అలానే దివ్యవానికి నిజం తెలిసాక అత్తగారితో ఇలాంటి పనులు చేసానని బాధ పడటం అన్ని హార్ట్ టచింగ్ గా అనిపిస్తాయని రేలంగి తెలిపారు.