దర్శకుడు తేజ గురించి మన అందరికి తెలిసిందే. అయన చిన్న వయసులోనే తల్లిని కోల్పోయి ఇంట్లో నుండి పారిపోయి చెన్నైలో ఎన్నో కష్టాలకు ఓర్చుకొని ఈ స్థాయికి వచ్చారు. తన పిల్లలకు సైతం తనకు ఎలాంటి ఆస్తులు ఇవ్వనని వాళ్ళంతట వాళ్ళే వారికీ ఎం కావాలో వారే సంపాదించుకోవాలని చెప్తుంటారు. తేజ కి భార్య శ్రీవల్లి అలాగే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొడుకు అమితవ్ తేజ కూతురు ఐలా తేజ.. కూతురు ప్రస్తుతం అమెరికాలో చదువుతుండగా కొడుకు అమితవ్ మాత్రం హీరోగా రెడీ అవుతున్నాడు. 1995 లో బాంబే లో అమితవ్ జన్మించాడు. ఆ సమయంలో రామ్ గోపాల్ వర్మ దగ్గర మరియు పెద్ద పెద్ద బ్యానెర్లు కి సినిమాటోగ్రఫేర్ గా పని చేస్తూ చాల బిజీ గా ఉన్నాడు తేజ. ఆ తర్వాత హైదేరాబద్ లో ఒక షూటింగ్ టైం లో రామోజీ రావ్ కళ్ళల్లో పడి చిత్రం సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం సంపాదించాడు. ఈ చిత్రం 2000 ల సంవత్సరం లో విడుదల అయ్యి ఘన విజయం సాదించింది.

సినిమాతో దర్శకుడిగా తేజ కి డెబ్యూ కాగా చైల్డ్ ఆర్టిస్ట్ గా అమితవ్ కి కూడా డెబ్యూ ఫిలిం అనే చెప్పాలి అంతే కాదు ఉదయ్ కిరణ్ కి సైతం ఈ సినిమా సినీ జీవితం ఇచ్చింది. ఇక అమితవ్ కి రెండేళ్ల వయసులో జూబ్లీహిల్స్ కి షిఫ్ట్ అయ్యాడు తేజ. okardige ఇంటర్నేషనల్ స్కూల్ అఫ్ హైదరాబాద్ లో చదువుకున్న అమితోవ్ బాక్సింగ్ పై కూడా మంచి పట్టు సాధించాడు. ఇక ఒక వైపు చదువు కొనసాగిస్తూనే కృష్ణ వంశి దర్శకత్వం లో వచ్చిన గోవిందుడు అందరివాడేలే సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేసాడు. దీనికన్నా ముందు మహేష్ బాబు నటించిన నిజం సినిమాకు వాయిస్ ఓవర్ కూడా ఇచ్చాడు అమితోవ్.. ఈ సినిమా తేజ దర్శకత్వం లోనే వచ్చింది.

ఇక తనకు సినిమాలపై ఇంట్రెస్ట్ ఉండటం తో కాలిఫోర్నియా లో ఫిలిం అండ్ టెలివిజన్ ప్రొడక్షన్ ప్రోగ్రాం లో గ్రాడ్యుయేషన్ చేయడానికి జాయిన్ అయ్యాడు. కానీ మొదటి సెమిస్టరు తర్వాత డ్రాప్ అవుట్ అయ్యి నటనలో శిక్షణ పొందటం కోసం న్యూ యార్క్ కి షిఫ్ట్ అయ్యాడు అక్కడ lee starsberg థియేటర్ అండ్ ఫిలిం ఇన్సిటిట్యూట్ లో శిక్షణ తీసుకున్నాడు. మొన్నీ మధ్యనే ఒక షార్ట్ ఫిలిం కూడా దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం మోషన్ పిక్చర్ ఎక్సిబిషన్ కంపెనీ కి, జయం మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ కి అలాగే చిత్రం మూవీస్ సంస్థ కి సీఈఓ గా వ్యవహరిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి దర్శకుడి తేజ కొడుకు తో సినిమా చేయబోతున్నట్టు అనౌన్స్ చేసాడు కానీ అది ఏ కారణాల చేతనో పట్టాలెక్కలేదు. మంచి స్టోరీ దొరికి అనుకున్నట్టుగా సినిమా మొదలైతే తవ్రలోనే తేజ కొడుకు అమితోవ్ ని హీరోగా మనం చూడవచ్చు.

అమితవ్ తేజ & ఐలా తేజ ఫొటోస్ మీకోసం

అమితవ్ తేజ
ఐలా తేజ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here