హాట్ యాంకర్ అనసూయ ఎంత సంపాదిస్తుందో తెలుసా.?!

0
441

ఈTvలో ప్రసారమయ్యే ‘జబర్దస్త్’ ఖతర్నాక్ కామెడీ షో ద్వారా పిచ్చ పాపులారిటీని సంపాదించి తన కెరియర్‌కు బంగారు బాట వేసుకుంటూ ఆ షో ద్వారానే స్టార్ యాంకర్ స్థాయికి ఎదిగి, రంగస్థలం లాంటి చిత్రాలలో కుడా నటించే అవకాశాలను పొంది ప్రస్తుతం హీరోయిన్ స్థాయికి  ఎదిగింది హాట్ యాంకర్ అనసూయ.

ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతున్న టైంలో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ తన ఫ్యాన్స్ తో మాట్లాడుతుంటుంది మన రంగమ్మత్త. పెళ్లై ఇద్దరు పిల్లలకు తల్లైన తర్వాత కూడా ఇప్పటికీ హాట్ షోలతో ప్రేక్షకుల మతులు చెడగొడుతుంది అనసూయ. ఈమె అందానికి చాలా మంది ఫ్యాన్స్ ఫిదా అయిపోయారంటే అతిశయోక్తి కాదేమో.! చాలామంది సినిమా కధానాయికల కెరీర్ పెళ్లి తర్వాత క్లోజ్ అయిపోయిందని భావిస్తుంటారు. కానీ అనసూయ మాత్రం ఇందుకు భిన్నంగా పెళ్లి తర్వాతే అసలైన ఇన్నింగ్స్ ను మొదలు పెట్టింది. పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఇప్పటికీ పర్ఫెక్ట్ ఫిగర్ మెయింటేన్ చేస్తూ హీరోయిన్లకు తాను ఏమాత్రం తక్కువ కాదని నిరూపిస్తుంది. ఇక అసలు విషయానికొస్తే..

ఇప్పుడు అనసూయ మనీ ప్లానింగ్ విధానం చూసి తోటి యాంకర్స్ అంతా షాక్ అవుతున్నారు. హీరోయిన్లకు పోటీగా అనసూయ కూడా రెండు చేతులా సంపాదిస్తుందనే గాసిప్స్ సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి. టాలీవుడ్ లో ప్రస్తుతం మంచి ఫామ్ లో వున్న యాంకర్స్ సంపాదనా వివరాలను అంచనా వేస్తే.. నెం.1 స్ధానం లో సుమ ఉంది. ఆమె తర్వాత నెం.2 స్ధానం అనసూయదేనని చెప్పవచ్చు. తోటి యాంకర్స్ కూడా అసూయ పడే రేంజ్ లో అనసూయ సంపాదన ఉందని టాలీవుడ్ సమాచారం. అనసూయ ప్రస్తుతం జీ తెలుగులో లోకల్ గ్యాంగ్స్.. జెమినీ Tvలో తల్లా పెళ్లామా.. అలాగే మా టీవీలో కూడా ఒక షో చేస్తుంది. వీటితో పాటు చేతిలో 2,3 సినిమా ఆఫర్లు కూడా ఉన్నాయి. ఈ లెక్కన ఈమె ఆస్తి కోట్లలోనే ఉంటుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ మధ్యే ఐటి రైడ్స్ కూడా జరిగాయని పబ్లిక్ టాక్.. అయితే ఇలాంటివన్నీ ఒట్టి పుకార్లేనని, వీటిల్లో ఏదీ నిజం లేదని కొట్టిపారేసింది అనసూయ. ఇవన్నీ నిజంగా పుకార్లే అయితే కోటికి పైగా విలువ చేసే ఆడి కార్ అను దగ్గర ఎందుకుంది.

దాంతోపాటే జూబ్లీహిల్స్‌ లో దాదాపు 5 కోట్ల విలువ చేసే ఇల్లు ఎలా వచ్చిందనేది నెటిజన్ల సందేహం. ఏదేమైనా, ఎంత సంపాదించినా చాలా సింప్లిసిటీ మెయింటేన్ చేయడం అనసూయ గొప్పతనం. తక్కువలో తక్కువగా సంవత్సరానికి 2 కోట్లకు పైగానే అనసూయ సంపాదిస్తున్నట్లు టాలీవుడ్ టాక్. యాంకరింగ్ ద్వారా 20 లక్షల వరకు సంపాదిస్తుంది. యాంకరింగ్ తో పాటు మధ్యమధ్యలో స్పెషల్ షోలు, ఈవెంట్స్.. సినిమాలు ఇలా అన్నీ లెక్కేసుకున్నా కోటీశ్వరుల జాబితాలో అనసూయ పేరు తప్పకుండా వుంటుందన్నది జగమెరిగిన సత్యం. క్రేజ్ ఉన్నపుడే కదా నాలుగు రాళ్లు వెనకేసుకోవాలన్నది అనసూయ జీవిత సిద్ధాంతం అని ఇప్పటికైనా రంగమ్మత్త ఫ్యాన్స్ తెలుసుకుంటే చాలు.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here