Featured
Chiranjeevi: కేవలం 29 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చిరంజీవి మూవీ.. ఆ మూవీ ఏదో మీకు తెలుసా?
Published
4 weeks agoon
By
lakshanaChiranjeevi: తెలుగు సినీ ప్రేక్షకులకు మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఇన్నేళ్ల తన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో అవార్డులను రివార్డులను కూడా అందుకున్నారు. అలాగే ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో పాటు ఫ్లాప్ సినిమాలను కూడా ఎదుర్కొన్నారు చిరంజీవి. కోట్లాది ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్నారు. ఆరు పదుల వయసులోనూ వరుసగా సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు చిరంజీవి.
అంతేకాకుండా ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటించడంతోపాటు ఈ తరం హీరోలకు గట్టి పోటీని కూడా ఇస్తున్నారు. సినిమా హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు మెగాస్టార్. ఇకపోతే మామూలుగా సినిమాలు పూర్తవడానికి కొన్నిసార్లు నెలలు కొన్నిసార్లు సంవత్సరాలు కూడా పడుతూ ఉంటుంది. కానీ చిరంజీవి కెరియర్ లో మాత్రం ఒక సినిమా కేవలం 29 రోజుల్లోనే అనగా నెల రోజులు కూడా కాకుండానే షూటింగ్ పూర్తి చేసుకుందట. మరి ఇంతకీ ఆ సినిమా ఏది? అదేలా సాధ్యమైంది అన్న వివరాల్లోకి వెళితే.. నిజానికి అప్పట్లో ఒక్కో సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వడానికి 150 నుంచి 200 రోజుల సమయం పట్టేది.
అలాంటి రోజుల్లో 80 దశకంలో ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాను 29 రోజుల్లో చిత్రీకరించి డైరెక్టర్ కోడి రామకృష్ణ అందరి చేత ఔరా అనిపించారు. గొల్లపూడి మారుతీరావు డైలాగ్స్ అందించిన ఈ సినిమాలో చిరంజీవి, మాధవి జంటగా నటించారట. పూర్ణిమ, గొల్లపూడి మారుతీరావు, సంగీత, పి. ఎల్. నారాయణ, అన్నపూర్ణ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కె.రాఘవ ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాను నిర్మించగా.. జె.వి.రాఘవులు సంగీతం అందించారు. 1982లో రిలీజ్ అయిన ఈ సినిమా యావరేజ్ టాక్ తో మొదలై సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.
మూవీ షూటింగ్ అంతా అక్కడే..
8 కేంద్రాలలో 50 రోజులు, రెండు కేంద్రాల్లో 100 రోజుల రన్ సాధించింది. ఆపై షిఫ్ట్ లతో ఉదయం ఆటలు ఆడుతూ 517 రోజుల రన్ ను కంప్లీట్ చేసుకుంది. కోడి రామకృష్ణ కు దర్శకుడిగా అదే మొదటి చిత్రం కావడం విశేషం. అదేవిధంగా గొల్లపూడి మారుతి రావు మాటల రచయిత నుంచి ఈ సినిమాతోనే నటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. కాగా ఈ మూవీలోని ఎక్కువ భాగం షూటింగ్ పాలకొల్లు పరిసరాల్లోనే జరిగింది. అలాగే క్లైమాక్స్ ని చిరంజీవి ఇంట్లోనే కాకుండా అంతర్వేదిపాలెంలో చిత్రీకరించారు. రూ. 3.20 లక్షల బడ్జెట్ తో 29 రోజుల్లో పూర్తి చేయబడిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
You may like
Featured
Jani Master: జానీ మాస్టర్ కి బిగ్ షాక్… అవార్డు వెనక్కి తీసుకోవాలటూ ఆదేశాలు?
Published
9 hours agoon
6 October 2024By
lakshanaJani Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇటీవల అత్యాచార కేసులో భాగంగా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అరెస్ట్ అయిన ఈయన మద్యంతర బెయిల్ మీద బయటకు వచ్చారు. ఈయన తన అసిస్టెంట్ పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు తనని అరెస్టు చేశారు.
ఇలా రిమాండ్ లో ఉన్నటువంటి ఈయన పోలీసు విచారణలో పలు విషయాలను తెలిపారు. ఇకపోతే ఇటీవల జానీ మాస్టర్ కి కోర్టు మద్యంతర బెయిల్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్ ఆరో తేదీ నుంచి పదవ తేదీ వరకు ఈయనకు బెయిల్ ఇస్తున్నట్టు కోర్ట్ వెల్లడించారు.
ఈ విధంగా జానీ మాస్టర్ బయటకు వస్తున్నారని సంబరపడేలోపు ఈయనకి ఊహించని షాక్ తగిలింది. జానీ మాస్టర్ పై ఆరోపణలు రావడానికి కంటే ముందుగా ఈయన 70వ జాతీయ అవార్డు ప్రకటనలో భాగంగా ఉత్తమ కొరియోగ్రాఫర్ గా నేషనల్ అవార్డుకు ఎంపికైన సంగతి తెలిసిందే. ఇలా జానీ మాస్టర్ నేషనల్ అవార్డు అందుకోవడం ఇది రెండోసారి.
అవార్డు వెనక్కి…
ఇలా నేషనల్ అవార్డుకు ఎంపికైన తరువాత ఈయన పట్ల లైంగిక ఆరోపణల కేసు నమోదు కావడంతో జాతీయ అవార్డు సమితి ఈ అవార్డును వెనక్కి తీసుకోబోతున్నారు.మాస్టర్ పై ఫోక్సో కేసు నమోదు కావడంతో కమిటీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఇలా జానీ మాస్టర్ కు జాతీయ అవార్డు వచ్చిందని సంతోష పడిన అభిమానులకు ఈ విషయం తెలియగానే ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఈ విషయంపై జానీ మాస్టర్ స్పందన ఎలా ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది.
Featured
Balakrishna: కొండా సురేఖ కామెంట్స్ పై స్పందించని బాలయ్య బాబు.. కారణం అదేనా!
Published
1 day agoon
5 October 2024By
lakshanaBalakrishna: తెలంగాణ మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌పై టాలీవుడ్ ఒక్కసారిగా భగ్గుమంది. ఆమె చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అవి కాస్త టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అక్కినేని కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ విషయం తెలిసిందే. దాంతో ఇప్పటి వరకు ఆమె చేసిన వ్యాఖ్యలపై చాలామంది సెలబ్రిటీలు స్పందించారు. అంతేకాదు తమ సోషల్ మీడియా వేదికగా కొండా సురేఖపై విమర్శలు చేస్తూ ట్వీట్లు, పోస్టులు పెట్టారు. ఒకరకంగా చెప్పాలంటే అక్కినేని నాగార్జునకు తమ నైతిక మద్దతు ప్రకటించి తాము ఉన్నామని భరోసాను ఇచ్చారు.
అయితే ఒక స్టార్ హీరో మాత్రం అసలు స్పందించలేదు. ఇప్పుడా స్టార్ హీరో ఎందుకు రియాక్ట్ కాలేదన్న దానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఆ హీరో మరెవరో కాదు బాలయ్య బాబు. నాగార్జున కుటుంబం మీద కొండా సురేఖ చేసిన కామెంట్స్‌పై బాలకృష్ణ రియాక్ట్ కాలేదు. అయితే ఆయన పాత విషయాలను మరచిపోలేదా, అందుకే స్పందించలేదన్న చర్చ జరుగుతోంది. అయితే అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా బాలకృష్ణ పెద్ద ప్రెస్ నోటే ఇచ్చారు. మరి ఇప్పుడు ఎందుకు బాలయ్య సైలెంట్ గా ఉన్నారంటూ టాలీవుడ్‌లో చర్చ నడుస్తోంది.
కారణాలు అవే అంటూ..
అయితే బాలయ్య బాబు రియాక్ట్ కాకపోవడానికి రెండు కారణాలు ఉండవచ్చనీ టాక్ వినిపిస్తోంది. ఒకటి తన అక్క నారా భువనేశ్వరిపై వైసీపీ వాళ్ళు కామెంట్స్ చేస్తే నాగార్జున కనీసం స్పందించలేదని బాలకృష్ణ మనసులో పెట్టుకుని ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది. అంతేకాదు నాగార్జున వైసీపీకి మద్దతు దారుడని, బాలయ్య టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు మాత్రం బిజీలో ఉండి మర్చిపోయి ఉంటారన్న వాదన వినిపిస్తున్నారు. కారణం ఏదైనా అందరి మద్దతు దొరికిన నాగార్జునకు,బాలయ్య మద్దతు లభించకపోవడం మాత్రం చర్చనీయాంశం అవుతోంది. మరి నిదానంగా అయినా బాలయ్య బాబు ఈ విషయంపై స్పందిస్తారేమో చూడాలి మరి.
Featured
Devara 2: దేవర2 గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన తారక్.. షూటింగ్ అయ్యిందంటూ!
Published
1 day agoon
5 October 2024By
lakshanaDevara 2: కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన తాజా చిత్రం దేవర. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఇటీవలే విడుదలై మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఒకేసారి గ్రాండ్గా విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లోనూ మంచి సక్సెస్ టాక్ ను తెచ్చుకుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది. ఇప్పుడు వరకు ఈ సినిమా 400 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఇప్పుడు మరిన్ని కలెక్షన్లను సాధిస్తోంది దేవర సినిమా. ప్రస్తుతం దేవర సినిమా లాభాల బాట పట్టింది. దసరా హాలిడేస్ కూడా ఉండటంతో 500 కోట్ల టార్గెట్ పెట్టుకుంది దేవర.
తాజాగా దేవర మూవీ యూనిట్ సక్సెస్ మీట్ కూడా చేసుకున్నారు. ఈ సినిమా విడుదల అవ్వడంతో అభిమానులు దేవర 2 గురించి చర్చించుకుంటున్నారు. సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో ఏమో అని మాట్లాడుకుంటున్నారు. ఇకపోతే దేవర రిలీజ్ సమయంలో ఎన్టీఆర్ అమెరికాకు వెళ్లి అక్కడ ప్రమోషన్స్ చేసిన సంగతి తెలిసిందే. బియాండ్ ఫెస్ట్ లో పాల్గొనడం, అక్కడి మీడియాకు పలు ఇంటర్వ్యూలు ఇవ్వడం చేసారు. హాలీవుడ్ లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ దేవర పార్ట్ 2 గురించి, కొరటాల శివ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఈ మేరకు ఎన్టీఆర్ మాట్లాడుతూ.. దేవర రిజల్ట్ బాగుంది. పార్ట్ 2 కూడా ఉంటుంది.
మేజర్ సీన్స్ అయిపోయాయి..
ఆల్రెడీ కథ సిద్దమైపోయింది. దాన్ని ఇంకా బాగా రాసుకోవాలి. దేవర పార్ట్ 2లో ఒక రెండు మేజర్ సీన్స్ కూడా షూటింగ్ అయిపోయింది. డైరెక్టర్ కొరటాల శివకు మొత్తం అన్ని వదిలేసి ఒక నెల రోజులు రెస్ట్ తీసుకో, హాలిడేకు వెళ్ళు అని చెప్పాను. ఆ తర్వాత వచ్చి మళ్ళీ దేవర 2 మీద వర్క్ చేయమని చెప్పాను. దేవర 2 పార్ట్ 1 కంటే ఇంకా పెద్దగా గొప్పగా అంటుంది అని తెలిపారు తారక్. ఇక ఈ సందర్భంగా తారక్ చేసిన వ్యాఖ్యలను మరోసారి వైరల్ చేస్తున్నారు అభిమానులు. ఇక తారక్ మాటలను బట్టి చూస్తే కొరడాల శివ నెక్స్ట్ సినిమా దేవర2 అని తెలుస్తోంది. పార్ట్2 పూర్తి అయిన తర్వాతనే తదుపరి సినిమాకు వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమా పూర్తవ్వగానే దేవర 2 షూట్ మొదలుపెడతాడని సమాచారం.
Jani Master: జానీ మాస్టర్ కి బిగ్ షాక్… అవార్డు వెనక్కి తీసుకోవాలటూ ఆదేశాలు?
Balakrishna: కొండా సురేఖ కామెంట్స్ పై స్పందించని బాలయ్య బాబు.. కారణం అదేనా!
Devara 2: దేవర2 గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన తారక్.. షూటింగ్ అయ్యిందంటూ!
Thaman: పవన్ ఓజీ సినిమాపై అలాంటి ట్వీట్ చేసిన తమన్.. బిగ్గెస్ట్ సినిమా అవుతుందంటూ!
Prakash Raj: టాలీవుడ్ లో నా ఫేవరెట్ హీరో అతనే.. ప్రకాష్ రాజ్ కామెంట్స్ వైరల్!
Nithya Menon: నిత్యామీనన్ మలయాళీ అమ్మాయి కాదా… తన అసలు పేరు అదేనా?
Abhay Naveen: బిగ్ బాస్ ను అందుకే తిట్టాను… అసలు కారణం బయటపెట్టిన అభయ్ నవీన్!
Manikanta: అలా మాట్లాడటం సరికాదు.. మణికంఠ భార్యకు మద్దతుగా నిలిచిన సోదరి!
Soundarya: సౌందర్య చనిపోతుందని ఆ వ్యక్తికి ముందే తెలుసా… ఆమె మరణంలో కుట్ర జరిగిందా?
Vadde Naveen: ఈ టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో వడ్డే నవీన్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు… ఎలా ఉన్నాడో తెలుసా?
Trending
- Featured4 weeks ago
Nithya Menon: నిత్యామీనన్ మలయాళీ అమ్మాయి కాదా… తన అసలు పేరు అదేనా?
- Featured2 weeks ago
Abhay Naveen: బిగ్ బాస్ ను అందుకే తిట్టాను… అసలు కారణం బయటపెట్టిన అభయ్ నవీన్!
- Featured3 weeks ago
Manikanta: అలా మాట్లాడటం సరికాదు.. మణికంఠ భార్యకు మద్దతుగా నిలిచిన సోదరి!
- Featured4 weeks ago
Soundarya: సౌందర్య చనిపోతుందని ఆ వ్యక్తికి ముందే తెలుసా… ఆమె మరణంలో కుట్ర జరిగిందా?
- Featured4 weeks ago
Vadde Naveen: ఈ టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో వడ్డే నవీన్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు… ఎలా ఉన్నాడో తెలుసా?
- Featured4 weeks ago
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తో హీరోయిన్ గా నటించాలని ఉంది.. సీనియర్ నటి కామెంట్స్ వైరల్!
- Featured4 weeks ago
Actress Rohini: కమిటీ సిద్ధం చేసాము…వేధింపుల గురించి మీడియా ముందు మాట్లాడొద్దు: రోహిణి
- Featured5 days ago
Samantha: నిన్ను ఎవరు మ్యాచ్ చేయలేరు.. మెగా హీరో పై సమంత కామెంట్స్!