ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెటర్ ఎవరో తెలుసా ?

టీం ఇండియాలో అత్యంత ధనవంతుడైన క్రికెట్ ఆటగాడు ఎవరు అని అడిగితే టక్కున చెప్పే పేరు ఒకటి మాజి కెప్టెన్ మహింద్రసింగ్ ధోని, రెండు ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లి. కానీ వీరిద్దరి కంటే సంపన్న క్రికెటర్ మరొకరు ఉన్నారు. అయనే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్.

టీం ఇండియా క్రికెటర్లు వార్హిక వేతనాన్ని మరియు స్పాన్సర్షిప్ లు, ఎండార్స్మెంట్ల రూపంలో భారీగానే సంపాదిస్తున్నారు. వీరిలో టాప్ 5 క్రికెటర్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్

ఈ మాజీ ఇండియన్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అత్యంత సంపన్న క్రికెటర్ గా వెలుగొందుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ స్పాన్సర్షిప్ లు, ఎండార్స్మెంట్ ల రూపంలో ఇప్పటికీ సంపాదిస్తూనే ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ మొత్తం ఆస్తి రూ.1090 కోట్లు.

మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని

మిస్టర్ కూల్ కెప్టెన్ ధోని ప్రపంచ క్రికెటర్లలో రెండవ సంపన్న క్రికెటర్ గా కొనసాగుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కు ధోని రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ అయన ఐపిఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. మహేంద్ర సింగ్ ధోని ఆస్తి మొత్తం రూ.767 కోట్లు.

కెప్టెన్ విరాట్ కోహ్లి

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రపంచ క్రికెటర్లలో మూడవ సంపన్న క్రికెటర్ గా కొనసాగుతున్నాడు. బిసిసిఐ నుంచి వచ్చే వార్షిక వేతనంతో పాటూ సొంత ఫ్యాషన్ బ్రాండ్స్ రాన్, వన్8 (పూమా తో భాగస్వామ్యం) ఉన్నాయి. అంతేకాదు సుమారు 20 కి పైగా బ్రాండ్లకు అయన ప్రచారకర్తగా ఉన్నాడు. వీటితో పాటూ ఇపిఎల్ లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. ఇందుకు గాను ఏడాదికి 17కోట్లు అందుకుంటున్నాడు. విరాట్ కోహ్లి ఆస్తి మొత్తంరూ. 638 కోట్లు.

వీరేంద్ర సెహ్వాగ్

రూ.277 కోట్లతో మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ నాలుగవ స్తానంలో నిలిచారు. వీరేంద్ర సెహ్వాగ్ క్రికెట్ ఆడే అన్నిరోజులూ.. ‘బంతిని చూడటం.. బాదడం’ అనే ఫార్మాలాని సింపుల్‌గా ఫాలో అయిపోయాడు. 

యువరాజ్ సింగ్

రూ.245 కోట్లతో మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ఈ సంపన్న క్రికెటర్ల జాబితాలో ఐదవస్తానంలో నిలిచారు. 2011 వన్డే ప్రపంచ కప్ భారత్ గెలవడంలో ప్రధాన పాత్ర పోషించిన యువరాజ్.. ఆల్ రౌండ్ ప్రదర్శనతో భారతీయుల హృదయాల్లో చిరస్థాయి గా నిలిచి పోయాడు.