Connect with us

Featured

మన టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ ఏం చదువుకున్నారో తెలుసా.?!

Published

on

సినిమావాళ్ళంటేనే చాలా మందికి చదువుపై శ్రద్ధ లేనివాళ్ళే సినిమా రంగంలోకి వస్తారనే చిన్న అపోహ ఒకటి ఉండి పోయింది. అయితే సినిమా తారలలో చాలామంది హీరోయిన్స్ మంచి మంచి చదువులే చదువుకుని నటనపై ఉన్న ఆసక్తితో సినీరంగంలోకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు.

అందులోనూ ప్రస్తుతతరం కధానాయికలైతే చదువు తర్వాతే ఏదైనా.. అనే కాన్ఫెప్ట్ లో మంచిగా చదువుకుని ఆ తర్వాత వాళ్ళ యొక్క యాంబిషన్స్ ని పూర్తిచేసుకుంటున్నారు. ఆవిధంగా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ గా రాణిస్తున్న మన కధానాయికలు ఎవరెవరు ఏమి చదువుకున్నారో మీరే చదివి తెలుసుకోండి..

నయనతార నవంబరు 18, 1984లో బెంగళూరులో జన్మించింది. తల్లిదండ్రులు కురియన్ కొడియట్టు, ఒమన్ కురియన్. మలయాళీ సిరియన్ క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన నయన్ విద్యాభ్యాసం వివిధ రాష్ట్రాల్లో జరిగింది. ఎక్కువగా మాత్రం నార్త్‌లో జరిగింది. నయన్ సినిమా కెరీర్ ప్రారంభించకముందు ఆమె మార్ధోమా కాలేజ్‌లో బీ.ఏ. పూర్తి చేసారు.

మంగుళూరులో జన్మించిన అనుష్క బెంగళూరులో విద్యాభ్యాసం చేసింది. కార్మెల్ కళాశాలలో కంప్యూటర్ అప్లికేషన్స్‌ లో మాస్టర్ డిగ్రీ చేసింది. BCA చదివినా.. చిన్నతనం నుంచి యోగాపై ఆసక్తితో అనుష్క యోగ శిక్షకురాలిగా పనిచేసింది. యోగాలో శిక్షణ పొంది శిక్షకురాలిగా పనిచేస్తున్న టైంలో అనుకోకుండా సినిమాల్లో ఛాన్స్ వచ్చింది. 2005లో సూపర్ సినిమాతో అవకాశం దక్కించుకొని మంచి విజయం అందుకుంది అనుష్క.

సమంత చిన్నప్పటి నుండే చాలా చురుకుగా ఉండేది. ఆమె సెయింట్ స్టీవెన్స్ మెట్రిక్యూలేషన్ స్కూలు, చెన్నై హోలీ ఏంజెల్స్, ఆంగ్లో ఇండియన్ సెకండరీ స్కూళ్లలో చదువుకుంది. ఆ తర్వాత చెన్నైలోని స్టెల్లా మేరీ కాలేజీ నుండి డిగ్రీ పట్టా పొందింది. చదువుకునే టైంలోనే ఆమె డ్యాన్స్ లు చేయడం, అందరితో సరదాగా కలిసి ఉండటం చేసేది. సమంత డిగ్రీ చదువుకునే టైంలోనే చెన్నైలోని నాయుడు హాల్లో మోడల్ గా పని చేసింది. అంతకుముందు ఆర్థిక కష్టాలను అధిగమించేందుకు చిన్న చిన్న ఉద్యోగాలను కూడా చేసింది. సరిగ్గా ఆ టైంలో ఆమెకు ప్రముఖ సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ రవి వర్మన్ మొదటిసారిగా సినిమాల్లో ఛాన్స్ ఇచ్చారు. అప్పుడే ఈ అందాల భామ సినీ రంగంలోకి అడుగు పెట్టింది.

మిల్కీ బ్యూటీ తమన్నా ముంబయిలో మానెక్‌జీ కూపర్ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌ స్కూల్‌లో చదివిన తమన్నా ఆ తర్వాత ఆర్ట్స్ లో డిగ్రీ పట్టా పొందింది. 2005 లో ఓ హిందీ చిత్రం ద్వారా నటిగా పరిచయమైంది. ‘శ్రీ’ చిత్రంలో మంచు మనోజ్ సరసన హీరోయిన్ గా నటించి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది తమన్నా.

త్రిష చెన్నై లోని చర్చ్ పార్క్ దగ్గర ఉన్న సైకిక్ హాట్ పాఠశాలలో మెట్రిక్యులేషన్ పూర్తి చేసింది. ఆ తర్వాత చెన్నైలోని మహిళా కళాశాలలో బీబీఏ పూర్తి చేసింది. 1999లో వచ్చిన ‘జోడీ’ చిత్రంలో ఒక చిన్న పాత్రలో కనిపించిన త్రిష ‘ఆరు’ చిత్రంతో నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది.

కాజల్ అగర్వాల్ కేవలం అద్భుతమైన నటి మాత్రమే కాదు అద్భుతమైన విద్యార్ధిని కూడా కాజల్ జైహింద్ కాలేజ్ లో ప్రీ యూనివర్సిటీ ఎడ్యుకేషనల్ పూర్తి చేసింది. ఆ తర్వాత కేఏసీ కళాశాలలో మాస్ మీడియాలో మార్కెటింగ్ విభాగంలో పట్టా కూడా పొందింది కాజల్. ‘లక్ష్మీ కల్యాణం’ చిత్రం ద్వారా హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది

కన్నడ సినిమా ‘గిల్లి’తో పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్ దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకోవాలనే శ్రమిస్తుంది. రకుల్ ఢిల్లీలోని ఆర్ మీ పబ్లిక్ స్కూల్ లో చదివింది. ఆ తర్వాత జీసస్ & మేరీ కాలేజీ‌లో బ్యాచిలర్ డిగ్రీ పట్టా పొందింది. ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో గణిత విద్యను అభ్యసించింది. ‘కెరటం’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది రకుల్.

యూనివర్శిల్ నటుడు కమల్ హాసన్ కూతురుగా వెండి తెరకు పరిచయమైన శ్రుతీహాసన్ తనదైన నటనతో మంచి గుర్తింపును సంపాదించుకుంది. చెన్నైలోని లేడీ ఆండాల్ వెంకట సుబ్బారావు స్కూల్ లో చదివింది శృతి. ఆ తర్వాత ముంబయిలోని ఓ ప్రముఖ కాలేజీలో సైకాలజీ డిగ్రీ పూర్తి చేసింది. ‘అనగనగా ఓ ధీరుడు’ చిత్రం ద్వారా హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రుతీహాసన్ కేవలం నటి మాత్రమే కాదు.. ఆమె ఒక గాయని కూడా.!

కర్ణాటకలో MMK కాలేజీలో M.Com చదివింది పూజా హెగ్డే. పూజ ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు చదువుపై దృష్టి సారిస్తున్నది. త్వరలో ఉన్నత విద్యాభ్యాసం కోసం ఆమె విదేశాలకు పయనమవుతున్నట్లు తెలిసింది. తాజాగా ప్రభాస్ తో నటిస్తున్న చిత్రం తర్వాత సినిమాలకు స్వల్ప విరామం ప్రకటించి చదువుపై దృష్టి సారించాలని ఆమె నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఆంథ్రోపాలజీలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్ చేయనున్నట్లు సమాచారం. త్వరలో పూజా హెగ్డే కొన్నాళ్ళ పాటు బుక్స్‌తో కుస్తీ పట్టేందుకు సిద్ధమవుతున్నట్లు ఆమె ఫ్రెండ్స్ చెబుతున్నారు.

కేవలం 22 ఏళ్లకే తెలుగులో స్టార్ హీరోయిన్ స్టేటస్ కొట్టేసిన రష్మిక 1996 ఏప్రియల్ 5న కర్ణాటకలోని విరాజ్ పేటలో మదన్ మందాన, సుమనా మదన దంపతులకు పుట్టింది. ఈమెకు ఓ సోదరుడు, ఓ చెల్లి ఉన్నారు. సోదరుడు ధర్మ వైజాగ్ సన్ ఇనిస్టిట్యూట్ లో ఈజీ బీఎస్సీ చదువుతుండగా, చెల్లెలు షిమా 5వ తరగతి చదువుతోంది. రష్మిక కూర్ పబ్లిక్ స్కూల్ లో ప్రాధమిక విద్యాభ్యాసం పూర్తి చేసి, మైసూర్ లో ప్రీ యూనివర్సిటీ కోర్సు పూర్తి చేసిన రష్మిక మందన్నా సైకాలజీలో డిగ్రీ చేసింది. ఎం ఎస్ రామయ్య ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఇంగ్లీషు లిటరేచర్ లో గ్రాడ్యుయేషన్ చేసింది. కాలేజ్ డేస్ లోనే 1,2 యాడ్స్ లో నటించిన ఈమె తన బాయ్ ఫ్రెండ్ రక్షిత్ శెట్టితో కల్సి ‘కిరికిపార్టి’ చిత్రంతో తొలిసారి వెండితెరపై మెరిసింది. ఈ మూవీ సాధించిన అనూహ్య విజయంతో ఈ అమ్మడి పేరు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది

నిధి అగర్వాల్ హైదరాబాద్‌లో పుట్టి బెంగళూర్ లో పెరిగింది. స్వతహాగా హిందీ మాట్లాడే మార్వారీ కుటుంబంలో జన్మించిన ఆమె హిందీ అర్థం చేసుకోవడంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ మాట్లాడగలదు. ఆమె విద్యాబ్యాసం విద్యశిల్ప్ అకాడమీ, విద్యా నికేతన్ పాఠశాలలో జరిగింది.
బెంగళూరుకు చెందిన క్రైస్ట్ యూనివర్సిటీ నుంచి బిజినెస్ మేనెజ్‌మెంట్‌లో డిగ్రీ పూర్తి చేసింది ఇస్మార్ట్ పోరి నిధి అగర్వాల్.

మంగళూరులో సైన్స్ అండ్ ఇన్‌ఫర్మేషన్‌లో డిగ్రీ పూర్తి చేసిన ఇస్మార్ట్ పోరి నభా నటేష్ ఆ తర్వాత వెండితెరపై తన నటనతో అందాల ఆరబోతతో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే.!

Advertisement
Continue Reading
Advertisement

Featured

Pitapuram: అందరి ఆసక్తి పిఠాపురం పైనే.. గెలుపు ఎవరిది.. సర్వేలు ఏం చెబుతున్నాయి?

Published

on

Pitapuram: ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి అయితే ఎన్నికల హడావిడి మొదలైనప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా అందరి చూపు పిఠాపురం నియోజకవర్గం పైనే ఉంది. ఈ నియోజకవర్గంలో ఎవరి జెండా ఎగురుతుందన్న విషయంపై ఎంతో ఆసక్తి నెలకొంది. ఇలా పిఠాపురం పైన ఇంత ఆసక్తి రావడానికి కారణం అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడమే కారణమని చెప్పాలి.

గత ఎన్నికలలో భీమవరం గాజువాకలో పోటీ చేసి ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ ఈసారి మాత్రం కాపులు అధికంగా ఉన్నటువంటి నియోజకవర్గం పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారు ఈ క్రమంలోనే ఈయనకు పోటీగా వైసిపి పార్టీ నుంచి వంగా గీత ఎన్నికల బరిలోకి దిగారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే అయినప్పటికీ ఎవరు గెలుస్తారో అన్న విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

ఇప్పటికే ఎన్నో చానల్స్ వారు ప్రజా సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో భాగంగా ఎక్కువ శాతం పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశాలే ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది. వంగా గీత కూడా అదే సామాజిక వర్గానికి చెందిన మహిళ అంతేకాకుండా ప్రస్తుతం కాకినాడ ఎంపీగా కూడా ఈమె కొనసాగుతున్నారు. ఇలాంటి తరుణంలో వంగా గీత కాకుండా పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమని తెలుస్తోంది.

Advertisement

జనసేనదే విజయమా..
ఇకపోతే వంగా గీత 2009వ సంవత్సరంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎన్నికల బరిలో దిగి పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలుపొందారు అయితే అప్పట్లో ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చిన పిఠాపురానికి చేయాల్సినటువంటి న్యాయం చేయలేకపోయారని అందుకే ఈసారి పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలుపుతున్నామంటూ చాలామంది ప్రజలు పవన్ కళ్యాణ్ గెలుపుకు కృషి చేస్తున్నారంటూ పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి చూడాలి మరి పిఠాపురంలో ఏ జెండా ఎగురుతుంది వంగా గీత పవన్ కళ్యాణ్ కి ఎలా పోటీగా నిలబడతారు అనేది తెలియాల్సి ఉంది.

Advertisement
Continue Reading

Featured

AP politics: పొత్తు ధర్మాన్ని పాటించకపోతే కఠిన చర్యలు తప్పవు.. పవన్ స్ట్రాంగ్ వార్నింగ్!

Published

on

AP politics: రేపు ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో వైఎస్ఆర్సిపి పార్టీ ఎలాంటి పొత్తు లేకుండా ఎన్నికల బరిలోకి దిగిపోతుంది కానీ తెలుగుదేశం పార్టీతో జనసేన బిజెపి పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగబోతున్న సంగతి తెలిసిందే ఇలా కూటమిగా ఏర్పడి ఎన్నికలలో గెలిచి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని ముందుకు నడిపించాలని ధ్యేయంగా ఎన్నికల బరిలోకి దిగబోతున్నట్లు వెల్లడించారు.

ఇలా ఈ మూడు పార్టీల కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి దిగుతున్నటువంటి తరుణంలో కొన్ని నియోజకవర్గాలలో పార్టీల కోసం ఎంతో కష్టపడినటువంటి వారికి సీట్లు రాకపోవడంతో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలోనే జనసేనలోనూ కూడా అభ్యర్థులు అలకలు మొదలుపెట్టారు. ఇటీవల బీజేపీ తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయవాడ వెస్ట్ సీటు జనసేన పార్టీకే కేటాయిస్తారని, పార్టీ తరపున తనకే సీటు వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న పోతిన మహేష్ ఈ సీటు బీజేపీకి వెళ్లిపోవడంతో చాలా అసంతృప్తికి గురయ్యారు.

ఇలా బిజెపికి సేటు కేటాయించడంతో మహేష్ ఏకంగా జనసేన పార్టీ కార్యాలయం ముందు రెండు గంటల పాటు కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఇక ఈయనని పవన్ కళ్యాణ్ పిలిపించుకొని తనని బుజ్జగించే ప్రయత్నం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు పదవి తప్పకుండా ఇస్తామని చెప్పిన మహేష్ మాత్రం తనకు టికెట్ కావాలని కోరారు.

Advertisement

పొత్తు ధర్మాన్ని పాటించండి..
ఇలా అభ్యర్థులు సహకరించకపోవడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రెస్ నోట్ విడుదల చేశారు.పొత్తు ధర్మాన్ని పాటిద్దామని కూటమిని గెలిపిద్దామంటూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రెస్‌నోట్‌ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కోసమే కూటమి ఏర్పాటు చేశామని ప్రస్తావించారు. ఆ పొత్తు ధర్మాన్ని పాటించకపోతే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.

Advertisement
Continue Reading

Featured

AP Politics: షర్మిల సునీతపై జగన్ ఘాటు వ్యాఖ్యలు.. హంతకులకే మద్దతంటూ?

Published

on

AP Politics: ఏపీ ఎన్నికలు త్వరలోనే జరగబోతున్నటువంటి తరుణంలో ఎన్నికల హడావిడి మొదలైంది. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ నుంచి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర ప్రారంభించారు. ఈ బస్సు యాత్రలో భాగంగా ప్రొద్దుటూరులో బహిరంగ సభ నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే.

ఈ సభలో తన బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య గురించి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనగా మారాయి. మా చిన్నాన్న వివేకానంద రెడ్డి గారిని చంపింది ఎవరో రాష్ట్ర తెలుసనీ, తన చెల్లెలు షర్మిల సునీతను కూడా తమ రాజకీయాలలో పావులుగా వాడుకున్నారని తెలిపారు.

నా చెల్లెమ్మలు ఇద్దరూ కూడా హంతకులకే మద్దతు తెలుపుతున్నారని జగన్ మండిపడ్డారు. చెల్లెమ్మలు చిన్నాన్నను చంపిన వారితో చేతులు కలపగా నేను మాత్రం ప్రజల పక్షమే ఉంటానని జగన్ తెలిపారు. ఇలాంటి హంతకులతో అవినీతిపరులతో యుద్ధం చేయడానికి ఈ అర్జునుడు సిద్ధం మీరు సిద్ధమేనా అంటూ ఈ కార్యక్రమంలో జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి.

Advertisement

కూటమి అంటే కుట్రలు..
వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబు నాయుడికి 45 ఏళ్ల అనుభవం ఉందని చెప్పారు. ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి చంపి, ఆయన విగ్రహాలకు పూలమాలలు వేశారని అన్నారు. కూటమి అంటే కుట్రలు కుతంత్రాలని జగన్ తెలిపారు. తమ జెండా మాత్రం మరో జెండాతో జతకట్టలేదని చెప్పారు. కేంద్రం నుంచి ఓ పార్టీని తెచ్చుకున్నారని అన్నారు. ఇటీవల చోటుచేసుకున్న డ్రగ్స్‌ కేసు వెనుక చంద్రబాబు వదిన గారి చుట్టం ఉన్నారంటూ డ్రగ్స్ వ్యవహారంపై కూడా జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!