1994లో విశ్వసుందరిగా నిలిచిన సుస్మితా సేన్‌ 1996 నుండి 2015 మధ్యలో వెండితెరపై ఓ వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే. సుస్మితా సేన్ 2017 సంవత్సరం నుంచి రొహమన్ షాల్ అనే ఈ యంగ్ మోడలింగ్ స్టార్ తో డేటింగ్ చేస్తోంది. సో.. సుస్మితా ఇన్నాళ్లకు పెళ్లి చేసుకోబోతోందా? అంటే అవుననే చెబుతున్నారు బాలీవుడ్ ప్రముఖులు.

వివరాల్లోకి వెళ్తే.. మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ హీరోయిన్ సుస్మితా సేన్‌ ప్రేమకధ సోషల్ మీడియాలో యువతరం గుండెల్ని షేక్ చేసేస్తోంది. లేట్ వయస్సులో ఈ హాట్ లవ్ ఏమిటబ్బా.? అంటూ నెటిజన్లు కామెంట్స్ షేర్ చేస్తున్నారు. 43 ఏళ్ల అందాల ముద్దుగుమ్మ సుస్మితా సేన్‌ తన కన్నా 15 సంవత్సరాలు చిన్నవాడైన యంగ్ మోడలింగ్ స్టార్ రోహ్మాన్‌ షాల్‌ తో గత కొంతకాలంగా గాఢమైన ప్రేమలో మునిగి తేలుతూ.. ప్రపంచ వ్యాప్తంగా తమ ప్రేమ ముచ్చట్లు తెలిసేలా సోషల్ మీడియాలో సుస్మిత సందడి చేస్తుంది.

సుస్మితా సేన్‌, రోహ్మాన్‌ షాల్‌ జంట ప్రస్తుతం విహార యాత్రలో హాపీగా ఉన్నారు. తమ హ్యాపీ లవ్ సీన్స్ ఫొటోలను సుస్మిత తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ తో పంచుకుంది. సముద్రంపై పెద్ద బోట్‌లో ప్రయాణిస్తూ తన ప్రియుడి ఒడిలో ఏమి హాయిలే ఊహలా అంటూ ఖుషీ చేస్తున్న ఫొటోలు కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిన్నాయి. బికినీ ధరించి, దానిపైన ఓ పొడవాటి గౌన్‌ వేసుకోని రోహ్మాన్‌ ఒడిలో రొమాంటిక్‌ యాంగిల్‌ లో వాలి ఉన్న సుస్మిత ఫోటోలు చూస్తుంటే ప్రేమ మైకంలో మునిగిన వాళ్ళంతా అంతేలే అనిపిస్తుంది.

సుస్మితా సేన్‌, రోహ్మాన్‌ షాల్‌ హాట్‌ హాట్‌ ఫోజులు నెట్లో బాగా వైరల్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరి పెళ్లి గురించి నెటిజన్లు చర్చించుకుంటున్నారు. పిల్లలపై మమకారంతో రాణీ, అలీషా అనే ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుంది. వచ్చే ఏడాదిలో జరగనున్న సుస్మితా పెళ్ళికి రాణీ, అలీషాలు కూడా సుముఖంగానే ఉన్నారని, అన్నీ కుదిరితే సుస్మిత పెళ్ళి వచ్చే ఏడాదిలో ఉండొచ్చు’’ అని ఆమె ఫ్రెండ్స్ చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here