కొడుకు మందుల కోసం 300 కిమీలు సైకిల్ తొక్కిన తండ్రి..?

కన్న పిల్లల కోసం తమ తల్లిదండ్రులు ఎంతటి సాహసానికైనా ఒడిగడతారు.తమ బిడ్డల ప్రాణాలకు ముప్పు వాటిల్లితే తమ ప్రాణాలను సైతం అడ్డువేసి తమ బిడ్డలను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తారు. అచ్చం ఇలాంటి ప్రయత్నమే కన్నపేగు చేసింది. తన కొడుకు అనారోగ్యంతో బాధ పడుతున్న క్రమంలోతన కొడుకు మందుల కోసం ఏకంగా 300 కిలోమీటర్ల దూరం సైకిల్ పై ప్రయాణం చేసి మందులు తీసుకు వచ్చిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే….

బన్నూరు సమపీంలోని గనిగానకొప్పల్ గ్రామంలో నివసిస్తున్న ఓ వ్యక్తి నిర్మాణ సంస్థలో కూలి పనులు చేసుకుంటున్న తన కుమారుడు ఆరోగ్యం చూసుకునేవాడు. ఈ క్రమంలోనే అతడికి తన గ్రామం నుంచి సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్ (NIMHANS) వైద్యులు గత పదేళ్లుగా అతడి చికిత్స అందిస్తున్నారు.

ఈ క్రమంలోనే ప్రతి రెండు నెలలకు ఒకసారి ఆస్పత్రికి వెళ్లి తన కొడుకుకు మందులు తీసుకువచ్చే వాడు. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ పరిస్థితులు తలెత్తడంతో మందులు తీసుకురావడానికి ఎంతో ఇబ్బంది కలిగింది.ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితులలో తన కొడుకు మందులు వాడకపోతే ఎంతో ప్రమాదం కలుగుతుందని వైద్యులు సూచించడంతో ఎలాగైనా తన కొడుకు ప్రాణాలను నిలబెట్టుకోవాలని ఆ తండ్రి ఏకంగా సైకిల్ పై తన ప్రయాణాన్ని మొదలు పెట్టాడు.

ఈ క్రమంలోనే మే 23న సైకిల్ పై గనిగానకొప్పల్ గ్రామం నుంచి బయలుదేరిన ఆ వ్యక్తి మే 26న తిరిగి గ్రామానికి చేరుకున్నారు.సుమారు రానుపోను మూడు వందల కిలోమీటర్లు సైకిల్ పై ప్రయాణించి తన కొడుకు కావలసిన మందులను తీసుకువచ్చాడు.

ఈ క్రమంలోనే సదరు వ్యక్తి మాట్లాడుతూ…18 సంవత్సరాలు పూర్తి అయ్యేవరకు తన కొడుకుకు మందులు ఇవ్వాలని..మందులు ఆపేస్తే తన కొడుకు మూర్ఛ వ్యాధితో మరణించే అవకాశాలు ఉన్నాయని డాక్టర్లు చెప్పడంతో ఈ విధంగా సైకిల్ మీదే అక్కడికి చేరుకొని తన కొడుకు కావలసిన మందులను తీసుకొచ్చానని, ఈ విషయం తెలిసిన ఆస్పత్రి యాజమాన్యం తనకు వెయ్యి రూపాయలు ఇచ్చి పంపినట్లు ఆ తండ్రి తెలిపారు.