దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను మే 3 వరకు పొడిగిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించడంతో.. దేశంలోని వివిధ రంగాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే రైల్వే శాఖ తమ సేవలను మే 3 వరకు రద్దు చేస్తూ ప్రకటన విడుదల చేసింది. అదే క్రమంలో ఇప్పుడు విమాన రాకపోకలపై కూడా మే 3 అర్ధరాత్రి 11.59 వరకు నిషేదించారు. ఇది దేశీయ మరియు అంతర్జాతీయ విమాన సర్వీసులకు వర్తిస్తుందని తెలిపింది. దీనిప్రకారం మే 3 వరకు దేశంలోని విమానాలు టేకాఫ్ అవ్వవు మరియు అదే విధంగా ఏ విమానాలు దేశంలో ల్యాండ్ అవ్వవు. ఇది దేశీయ మరియు అంతర్జాతీయ విమాన సర్విసులకు కూడా వర్తిస్తుంది.

అయితే ఈ నేపథ్యంలో అమెరికా, యూఏఈ లోని భారతీయ విద్యార్థులు ఇండియా రావాలని ప్రయత్నిస్తున్న వారికీ కేంద్ర పౌర విమానయాన శాఖ తీసుకున్న నిర్ణయం వారి అసలా మీద నీళ్లు చలిందనే చెప్పుకోవాలి. వారంతా ఇండియా రావాలంటే మే 3 వరకు వెయిట్ చేయాల్సిందే. మే 3 తరువాత కూడా పరిస్థితిని బట్టి కేంద్రం నిర్ణయించనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here