ప్రస్తుతం మనదేశంలో కరోనా సెకండ్ వేవ్ పంజా విసురుతోంది. తగ్గినట్టే తగ్గి మళ్ళీ పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఇందులో సేలేబ్రేటీలకు కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా మాజీ ప్రధాని హెచ్ డి దేవగౌడ, అయన సతీమణి ఇద్దరూ కరోనా వైరస్ బారిన పడ్డారు.

ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. “నాకు, నా భార్య చెన్నమ్మ కు కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం మేమిద్దరం సెల్ఫ్ ఐసోలేషన్ లో వున్నాము. గత కొద్ది రోజులుగా మమ్మల్ని కలిసిన వారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలి. పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు ఆందోళనకు గురికావద్దు” అంటూ ట్వీట్ చేసారు. ఈ దంపతులు ఇద్దరూ కరోనా మహామ్మరి నుండి త్వరగా కోలుకోవాలని కోరుకుందాం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here