Galodu cinema actor Ravi Reddy : సుడిగాలి సుధీర్ ఒక సీన్ కోసం ఎన్ని టేకులు తీసుకున్నాడంటే… షూటింగ్ లో ఎలా ఉంటాడంటే… సినిమాకు ఎన్ని కోట్లు లాభాలు వచ్చాయి..!

Galodu cinema actor Ravi Reddy : జబర్దస్త్ నుండి కామెడియన్ గా బాగా ఫేమస్ అయిన సుడిగాలి సుధీర్ ఆల్రడీ సినిమాల్లో హీరోగా చేస్తున్నాడు. అయితే ఇప్పటివరకు చేసిన సినిమాలు ఆశించినంతగా హిట్ కాలేదు. తాజాగా సుడిగాలి సుధీర్, సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమా టీంతో మరోసారి చేసిన సినిమా గాలోడు. ఇక ఈ సినిమా ఇటీవల విడుదల అయి మంచి స్పందన అందుకుంది. హిట్ టాక్ తో నడిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ తండ్రి పాత్రలో నటించిన రవి రెడ్డి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సినిమా విశేషాలను అలాగే సుధీర్ గురించి మాట్లాడాడు.

సినిమాకు అన్ని కోట్లు లాభాలు వచ్చాయి…

గాలోడు సినిమాలో హీరోయిన్ ఫాదర్ గా నటించిన రవి రెడ్డి గారు అంతకుముందు సాఫ్ట్ వేర్ సుధీర్ లో కూడా ఒక రోల్ లో నటించారు. ఇప్పటి వరకు ముప్పైకి పైగా సినిమాల్లో నటించిన ఆయన సాయి ధరమ్ తేజ్ ఇంటెలిజెంట్ లాంటి సినిమాల్లో నటించాడు. ఇక సుధీర్ గురించి మాట్లాడుతూ షూటింగ్ లో చాలా ఫ్రెండ్లీ గా ఉంటాడని అందరితో మాట్లాడుతూ హీరో అన్న గర్వం అసలు లేదంటూ చెప్పాడు.

ఇక ఈ సినిమాకు డిఓపి గా రామ్ ప్రసాద్ గారు కావడం వల్ల ఆయన ప్రతి విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటారు. సీన్స్ ఎక్కువ టేకులు తీసుకోలేదు అంటూ చెప్పారు. ఇక సుధీర్ మంచి నటుడు సింగల్ టేక్ యాక్టర్ అంటూ చెప్పారు. ఇక సినిమా బడ్జెట్ 8 కోట్లు కాగా అంతకు మించి వసూళ్లు వచ్చాయని ఇంకో వారం థియేటర్స్ లో ఉండి ఉంటే ఇంకా లాభాలు వచ్చేవని కాకపోతే కొత్త సినిమాలు రిలీజ్ అవడం వల్ల సినిమా చాలా థియేటర్లలో తీసేశారని రవిరెడ్డి ‘గాలోడు’ మూవీ విశేషాలను పంచుకున్నారు.