Hero Ashwin Babu : శివశంకర్ మాస్టర్ చనిపోయినపుడు ఎవరూ లేరు… మేము ముగ్గురం డాక్టర్సే…: హీరో అశ్విన్ బాబు

0
132

Hero Ashwin Babu : ఓంకార్ బుల్లితెర అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. ఆయన షోస్ తో కంటే కూడా ఆ షోస్ లో ఉండే ఎమోషన్స్, గొడవలతోనే బాగా ఫేమస్. ఆట, మాయా ద్వీపం, జీనియస్, తాజాగా సిక్స్త్ సెన్స్ ఇలా ప్రోగ్రాం ఏదైనా హైప్ మాత్రం ఓంకార్ షోలో ఎక్కువుటుంది. ఇక ఓంకార్ గారు మొదట జెమినీ మ్యూజిక్ లో యాంకర్ గా పనిచేసేవారు. ఆపైన షోస్ చేస్తూ పేరు తెచ్చుకున్నారు. ఇక తమ్ముడు అశ్విన్ బాబును హీరోగా పెట్టి సినిమాలను కూడా తీశారు. ‘రాజు గారి గది’ సినిమా హిట్ కూడా అయింది. ఇక తాజాగా ‘హిడింబ’ అనే సినిమాతో అశ్విన్ బాబు వస్తుండగా ఇంటర్వ్యూలో తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను పంచుకున్నారు.

శివ శంకర్ మాస్టర్ చనిపోయినపుడు పాడె మోసాం…

ఆట డాన్స్ షో అప్పటి నుండి శివ శంకర్ మాస్టర్ అలాగే సుందరం మాస్టర్ తో మంచి అనుబంధం ఉందంటూ చెప్పిన అశ్విన్ బాబు మా కుటుంబంలో ఒకరిగా వాళ్ళు ఉండేవాళ్ళని చెప్పారు. శివ శంకర్ మాస్టర్ అంటే మా కుటుంబమే అనుకునేవాళ్ళం, అందుకే అన్నయ్య రాజు గారి గది సినిమా చేసినపుడు ఆయనకోసం ఒక క్యారెక్టర్ డిజైన్ చేసారు.

ఇక కరోనా సమయంలో శివ శంకర్ మాస్టర్ మరణించినపుడు ఆయన్ను చూడటానికి వెళ్లి వచ్చేద్దామని బయలుదేరుతుంటే ఆయన పాడె మోయడానికి ఎవరూ లేరని చూసి బాధేసింది. ఇక నేను మా అన్న తమ్ముడు ముగ్గురం పాడె మోసాం. ఆయన మాతో మోయించుకోవాలని అనుకున్నారేమో అనిపించింది అంటూ అశ్విన్ ఎమోషనల్ అయ్యారు.