Hero Sai Dharam Tej : మెగాస్టార్ కుటుంబం నుండి వచ్చిన హీరోలలో మెగా అల్లుడు సాయి ధరమ్ తేజ్ ది డిఫరెంట్ స్టైల్ అనొచ్చు. మామ చిరంజీవి లాగానే వేసే డాన్సులో గ్రేస్ ఉంటుంది ఈ మెగా మేనల్లుడికి. సినీ పరిశ్రమలో అడుగు పెట్టి తనకంటూ సొంత గుర్తింపుతో దూసుకెళ్తున్నాడు సాయి ధరమ్ తేజ్. ఇంతలోనే ఎవరూ ఊహించని పరిణామం సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్, ముందు చిన్నదే అనుకున్నా తర్వాత అది ఎంత పెద్ద ప్రమాదం అనేది అందరికీ అర్థమైంది. ఆ ప్రమాదం తర్వాత దాదాపు 45 రోజుల పాటు ఎవరికీ కనిపించకుండా ఉన్న సాయి ధరమ్ తేజ్ మళ్ళీ హీరోగా మన ముందుకు వస్తాడా అని అందరూ అనుకున్నా చివరకు మళ్ళీ హీరోగా సినిమాలను చేస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తాజాగా తాను నటించిన ‘విరూపాక్ష’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న సాయి తన నెక్స్ట్ సినిమాలు అలాగే పెళ్లి గురించి మాట్లాడారు.
పెళ్ళెప్పుడంటే… ఆ హీరోయిన్ తో ప్రేమలో పడ్డాను…
సాయి ధరమ్ తేజ్ పెళ్లి అంటూ ఆక్సిడెంట్ తరువాత బాగా పుకార్లు వినిపించాయి. అయితే వాటి గురించి సాయి ధరమ్ తేజ్ క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో తన పెళ్లి వార్తలు ఎపుడైతే ఆగిపోతాయో అపుడు తాను పెళ్లి చేసుకుంటాను అంటూ సరదాగా చెప్పాడు సాయి. తాను ఇటీవల ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తే నా పెళ్లి మీద వచ్చిన గాసిప్స్ ఫోన్లో చూపించి ఏమీ లేకుండానే పెళ్లి గాసిప్స్ వస్తాయా అని వెళ్ళిపోయింది అంటూ చెప్పారు. నా ప్రతి లవ్ స్టోరీ నేను పవన్ మామయ్యతో షేర్ చేసుకుంటాను, తనతో చాలా ఫ్రెండ్లీ గా ఉంటాను అంటూ చెప్పారు.
ఇక తన లవ్ స్టోరీల గురించి మాట్లాడుతూ డిగ్రీలో ఉన్నపుడు ఒక అమ్మాయిని చాలా ఇష్టపడ్డానని, మంచి స్నేహితురాలు అయితే తాను డిగ్రీ అయిపోగానే పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లి కూడా దగ్గరుండి చేశాను అంతకు మించి ఏమీ చేయలేని వయసు కదా అందుకే అంటూ చెప్పారు. ఇక ఆ బ్రేక్ అప్ నుండి బయట పడ్డాక మళ్ళీ తిక్క సినిమా చేసేటపుడు హీరోయిన్ లారిస్సా బోనేసి ను ఇష్టపడ్డాను. షూటింగ్ టైములోనే నాకు నువ్వంటే ఇష్టం డేట్ కి వెళదామా అని అడిగితే సారీ సాయి నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పేసింది. అందుకే ప్రస్తుతం సోలో లైఫే సో బెటరు సినిమాలో లాగా ప్రస్తుతం సింగిల్ గానే ఉన్నా, ఆ సినిమాలో లాగా హీరోయిన్ రావడానికి టైం పడుతుంది అంటూ చెప్పారు.
ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…
దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…
జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…
ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…
ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…
విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…