Featured

Hero Suman : జైలు జీవితం గడిపోచ్చిన తర్వాత కూడా.. హీరో సుమన్ ను పిలిచి పిల్లనిచ్చిన టాలీవుడ్ దిగ్గజం ఎవరో తెలుసా ?

Hero Suman : సినిమా ఇండస్ట్రీలో ప్రవేశించాలంటే ఒక్క బ్యాక్ గ్రౌండ్ ఉంటేనే చాలదు. స్వశక్తితో ముందుకు ఎదగాలి. అయితే పైకి ఎదుగుతున్న ప్రతిసారి కింద పడవేయడానికి చాలా మంది రెడీ గా ఉంటారు. అయితే జయాపజయాలు తట్టుకుని నిలబడడం అంటే సర్వ సాధారణ విషయం కాదు. అయితే ఒకప్పుడు ఎంతో క్రెజ్ ఉన్న హీరో ఒక్కసారిగా అట్టడుగు స్థాయికి పడిపోయి, మళ్ళీ పైకి ఎదగడం అంటే మాటలు కాదు. అలాంటి కోవకు చెందిన హీరోనే సుమన్. ఆరడుగుల అందగాడుగా టాలీవుడ్ లో ఎంతో మంచి పేరు ఉంది. తన అందంతో, అభినయంతో ఎన్నో సినిమాల్లో నటించి, అందరిని మెప్పించి అమ్మాయిల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న హీరో సుమన్ అని అనడంలో అతిశయోక్తి లేదు. చాలామందికి సుమన్ అసలు పేరు తెలియదు. అందరికి సుమన్ గానే పరిచయం. కానీ, అయన అసలు పేరు సుమన్ తల్వార్. స్వతహాగా సుమన్ మాతృబాష తెలుగు కాకపోయినా గాని ఎంతో స్పష్టంగా, అచ్చమైన తెలుగులో మాట్లాడేవాడు. అందుకేనేమో తెలుగు ప్రజలు ఆయనను అక్కున చేర్చుకున్నారు.

సినీ ఇండస్ట్రీలోకి రాకముందు సినిమా అవకాశాల కోసం కష్టపడే సమయంలో హీరో బాను చందర్ తో మంచి సన్నిహిత సంబంధం ఏర్పడింది. దీనితో ఇద్దరు మంచి స్నేహితులుగా మారిపోయారు. అంతేకాకుండా వీరిద్దరికి మార్షల్ ఆర్ట్స్ పై పట్టు కూడా ఉంది. అయితే మొదట సినిమాల్లో నటించే అవకాశం బానుచందర్ కి వచ్చింది. తరువాత సుమన్ ను సినిమాల్లో రికమండ్ చేయడం జరిగింది. అప్పటినుండి వీళ్ళు ఇద్దరు అనేక సినిమాల్లో నటించారు. అలాగే వీరు నటించిన సినిమాల్లో మార్షల్ ఆర్ట్స్ ను విస్తృతంగా ఉపయోగించారు. ఫలితంగా మార్షల్ ఆర్ట్స్ గురించి అందరికి తెలిసేలా చేసారు. ఆ తరువాత తరంగిణి సినిమాతో పాటు, యువతను ఉద్దేశించిన నేటి బాలలు, దేశంలో దొంగలు పడ్డారు వంటి చిత్రాల్లో నటించి టాప్ రేంజ్ కి వెళ్ళాడు. ఒకానొక సందర్భంలో మెగాస్టార్ చిరంజీవితో పాటుగా పోటాపోటీగా సుమన్ సినిమాలు ఆడేవి. ఇలా మంచి ఉత్సహంతో ముందుకెళుతున్న సుమన్ కి ఒక కోలుకోలేని దెబ్బ తగిలింది.

నీలిచిత్రాల కేసులో సుమన్ పేరు తెరమీదకు రావడంతో అయన జైలుకి వెళ్ళాడు. ఒకానొక సందర్భంలో బెయిల్ కూడా దొరకక కొన్ని రోజుల పాటు జైలు జీవితం కూడా గడిపాడు. ఆయన జైలు జీవితం గడపడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. అలాగే సినీ పరిశ్రమ కూడా షాక్ కు గురయింది. అలాగే సుమన్ కూడా బాగా కృంగిపోయాడు. జైలు నుంచి మళ్ళీ తిరిగి బయటకు వచ్చాక సినిమా ఛాన్సులు రాక, పరువు, ప్రతిష్ట మంటకలిసిపోవడంతో తేరుకోలేని డిప్రెషన్ లో పడిపోయాడు. ఆ తరువాత పెళ్లి అనే బంధంతో శిరీష రూపంలో మళ్ళీ అదృష్టం తలుపుతట్టింది.

గుండమ్మ కధ, బడి పంతులు, రాముడు భీముడు, యమగోల, కారు దిద్దిన కాపురం వంటి ప్రముఖ చిత్రాలు రచించిన ప్రముఖ రచయిత డివి నరసరాజు తన మనుమరాలను హీరో సుమన్ కి ఇచ్చి పెళ్లి చేసాడు. అయితే ప్రముఖ రచయత, సుమన్ ను పిలిచి మరి మనవరాలిని ఇవ్వడంతో అప్పట్లో సినీ ఇండస్ట్రీ ఆశ్చర్యానికి గురి అయింది. అప్పుడే అందరిలో ఆలోచన మొదలయింది. సుమన్ చెడ్డవాడు అయితే రాజుగారు పిలిచి మరి పిల్లను ఎందుకు ఇస్తాడు అనే అనుమానం మొదలయింది అందరిలో. పెళ్లి తరువాత సుమన్ మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు.

పెద్దింటి అల్లుడు, బావ బావమరిది, అబ్బాయిగారి పెళ్లి వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మళ్ళీ పూర్వ వైభవాన్ని దక్కించుకున్నాడు. అలాగే ఆ తరువాత అన్నమయ్య సినిమాలో వేంకటేశ్వరుని పాత్రలో నటించే అవకాశం దక్కింది. ఈ సినిమాలో సుమన్ పాత్ర అమోఘం. ఈ సినిమా వల్లే సుమన్ కి మంచి పేరు ప్రతిష్టలు కూడా వచ్చాయి. ఆ తరువాత శ్రీరాముడు సినిమాలో రాముని పాత్ర దొరకడం సుమన్ కి మంచి ప్లస్ అయింది. ఆ తరువాత సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన శివాజీ సినిమాలో విలన్ పాత్రలో నటించి, తనలోని మరొక యాంగిల్ ను కూడా ప్రేక్షకులకు చూపించాడు. ఇలా సుమన్ కెరీర్ మలువు తిరిగి విజయానికి చేరువలో నడవడానికి కారణం అయన సతీమణి శిరీష. పెళ్లి అనే బంధం సుమన్ జీవితాన్ని మార్చేసింది. వీరికి ఒక్కగానొక్క కూతురు. ఆమె పేరు “అఖిలాజా ప్రత్యూష”. తన కూతురు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై ఎటువంటి అబ్యంతరం లేదని సుమన్ తేలిపారు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో యాక్టీవ్ గా ఉంటున్నారు సుమన్.

telugudesk

Recent Posts

“ఇరాన్ అణు కార్యక్రమంపై ఒత్తిడి పెంచుతాం.. అవసరమైతే పరిమిత దాడి: ట్రంప్ హెచ్చరిక”

ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…

4 hours ago

“ఒంటరిగా ఉన్నాననే కారణంగా టార్గెట్ చేస్తున్నారు.. కర్మ వదలదు: హీరోయిన్ మీనా భావోద్వేగ వ్యాఖ్యలు”

దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…

4 hours ago

“బట్టతలకు బై బై చెప్పే స్మార్ట్ క్యాప్!.. మందులు, సర్జరీ లేకుండానే జుట్టు పెరుగుదల?”

జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…

4 hours ago

“వీధి కుక్కల బెడద పెరుగుతోంది.. ఉమ్మడి మెదక్‌లో వరుస దాడులతో ప్రజల్లో భయం!”

ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…

4 hours ago

ఆపరేషన్ చేసి కడుపులో కత్తెర మరిచిపోయిన డాక్టర్లు ! ఐదేళ్లుగా నరకయాతన అనుభవిస్తున్న మహిళ !

ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…

5 hours ago

విశాఖ సాగరతీరంలో నావికాదళ శక్తి ప్రదర్శన.. బీటింగ్ సెర్మనీతో అబ్బురం!

విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…

5 hours ago