1985 సంవత్సరంలో రామానాయుడు, అక్కినేని నాగేశ్వరావు గారు తమ వారసులను తెలుగు సినిమా పరిశ్రమకు హీరోలుగా పరిచయం చేయబోతున్నట్టు గా ప్రకటించారు. ఆ సందర్భంలో హీరో వెంకటేష్ అమెరికాలో ఎంబీఏ చేస్తున్నాడు. అప్పటికే డి.రామానాయుడు రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన దేవత సినిమా సూపర్ హిట్ అయింది. మళ్ళీ అదే కాంబినేషన్ లో ఒక సినిమా చేద్దాం. అనుకున్నప్పుడు డి రామానాయుడు మా రెండవ అబ్బాయి వెంకటేష్ ను హీరోగా పెట్టి ఓ సినిమా చేద్దామని అడగగా దానికి రాఘవేంద్రరావుగారు ఒప్పుకున్నారు. అమెరికా నుండి వెంకటేష్ ను వెంటనే పిలిపించారు.

వెంకటేష్ ను హీరోగా తీసుకోగా మరి హీరోయిన్ గా ఎవరిని ఎంపిక చేద్దాం అనుకున్న సమయంలో హిందీ నటి కుష్బూను చిత్ర యూనిట్ సంప్రదించింది. కుష్బూ గారి నాన్నకు ఆమె తెలుగు సినిమాలు చేయడం ఇష్టం లేదు. కానీ శ్రీదేవి, జయప్రదలతో విజయవంతమైన సినిమాలు తీసిన దర్శకుడు రాఘవేంద్ర రావు. కావున ఎలాగైనా రాఘవేంద్ర రావు తీయబోయే కలియుగ పాండవులు సినిమా లో కుష్బూ చేయాలనుకున్నారు. అలా 1985 చివరి మాసంలో షూటింగ్లో పాల్గొన్నారు.

అన్ని ఎలిమెంట్స్ ఉన్న కథ రాసుకోవాలని అని ముందుగా రాఘవేంద్రరావు పరుచూరి బ్రదర్స్ సమాలోచన చేశారు. అలా మంచి కథ కుదరడంతో 1986లో సినిమా విడుదలై సూపర్ డూపర్ హిట్ అయింది.కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి వెంకటేష్ నటించిన మొదటి సినిమా కలియుగ పాండవులు కాదు దీని కంటే ముందే అక్కినేని నాగేశ్వరరావు నటించిన ప్రేమ్ నగర్ చిత్రం కోసం డి.రామానాయుడు అడగగా వెయ్యి రూపాయల రెమ్యూనరేషన్ ఇస్తానంటే వెంకటేష్ చేస్తానని ఒప్పుకోవడంతో ఆ సినిమాతో హీరో వెంకటేష్ బాల నటుడిగా కెమెరా ముందుకు రావడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here