క్వారంటైన్ లోకి బిందు మాధవి.. ఒకరికి కరోనా.. తన అపార్ట్ మెంట్ సీల్ వేసిన అధికారులు.

0
359

హీరొయిన్ బిందు మాధవి.. ఈ భామ అందరికి పరిచయమే.. తెలుగు, తమిళ భాషలలో పలు సినిమాలు చేసింది. తెలుగమ్మాయి అయిన బిందు మాధవి టాలీవుడ్ లో “ఆవకాయ బిర్యానీ” అనే సినిమా ద్వారా పరిచయమైంది. ఆ తరువాత హీరో రామ్ నటించిన “రామ రామ కృష కృష్ణ” చిత్రంలో హీరో రామ్ కు మరదలి పాత్రలో ఆదరగోట్టింది. అయినా తెలుగులో అంతగా అవకాశాలు రాకపోవడంతో తమిళ చిత్రాలపై ఫోకస్ పెట్టింది ఈ ముద్దుగుమ్మ. అయితే ప్రస్తుతం చెన్నై లో నివాసముంటుంది.

కాగా, కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపధ్యంలో ఈ ప్రభావం బిందు మాధవిని కూడా తాకింది. చెన్నై లో ఆమె నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ లోని ఓ ఇంట్లో ఒకరి వ్యక్తికీ కరోనా పాజిటివ్ ఆని నిర్ధారణ అయింది. ఈ నేపధ్యంలో అక్కడి అధికారులు రంగంలోకి దిగి ఆ అపార్ట్మెంట్ ని సీల్ చేశారు. ఆ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న వారందరిని క్వారంటైన్ లో ఉంచారు. మరోవైపు బిందు మాధవి కూడా సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్ళాల్సివచ్చింది.

ఈ విషయాన్ని స్వయంగా బింధుమాధవి తన ట్విట్టర్ ఖాతా ద్వారా తన అభిమానులకు తెలిపింది. మేము ఉంటున్న అపార్ట్మెంట్లో ఒక వ్యక్తికీ కరోనా సోకిందని, దీనితో మేము అందరం సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్ళాం. మరో 14 రోజుల పాటు తానూ క్వారంటైన్ లో ఉండనున్నట్టు హీరోయిన్ బిందు మాధవి తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here