టాలీవుడ్ ఇండస్ట్రీలో నటించింది తక్కువ సినిమాలే అయినా స్టార్ స్టేటస్ అందుకున్న హీరోయిన్లలో నివేదా థామస్ ఒకరు. చాలా సంవత్సరాల క్రితమే ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నివేదా కెరీర్ మొదట్లో మలయాళం, తమిళ సినిమాల్లో నటించింది. వెరుతు ఒరు భార్య అనే మలయాళం సినిమాకు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నివేదా థామస్ కు అవార్డ్ వచ్చింది. బాలనటిగా పదికి పైగా సినిమాల్లో నటించిన నివేదా జెంటిల్ మేన్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.  

హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో స్టార్ హీరోల సరసన కూడా నివేదాకు అవకాశాలు వచ్చాయి. నిన్ను కోరి, జై లవకుశ, 118 సినిమాలు నివేదాకు మంచిపేరు తెచ్చిపెట్టాయి. నివేదాథామస్ ముఖ్య పాత్రలో నటించిన వి సినిమా ఈ నెల 5న అమెజాన్ ప్రైమ్ లో విడుదలై యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో నివేదా చిన్నప్పటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ఈ ఫోటోలో నివేదా థామస్ చాలా క్యూట్ గా కనిపిస్తోంది. అందం, అభినయం ఉన్న ఈ నటి పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లోనే ఎక్కువగా నటిస్తోంది.

ప్రస్తుతం నివేదా థామస్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న విసినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తోంది. కరోనా మహమ్మారి విజృంభణ తగ్గి పరిస్థితులు మారితే 2021 సంక్రాంతి పండుగకు వకీల్ సాబ్ విడుదలయ్యే అవకాశం ఉంది.  సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న నివేదాకు వకీల్ సాబ్ సినిమా హిట్టైతే మాత్రం మరిన్ని సినిమా ఛాన్సులు వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాతో పాటు శ్వాస, సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న పేరు పెట్టని చిత్రంలో నివేదా థామస్ నటిస్తోంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here