శతాధిక దర్శకుడిగా పేరు ఉన్న సినిమా దర్శకుడు రాఘవేంద్రరావు యంగ్ జనరేషన్ తో కూడా పోటీ పడుతూ భారీ హిట్ సాంగ్స్ అందుకున్నారు. కొన్ని దశాబ్దాలుగా ఆయన ఇండస్ట్రీలో ముందుకు కొనసాగితున్నారు. అయితే చాలా రోజుల నుంచి ఆయన మెగా ఫోన్ పట్టట్లేదు. 2017 సంవత్సరంలో నాగార్జున, అనుష్క ప్రధాన పాత్రల్లో నటించిన భక్తిరస చిత్రం “ఓం నమో వెంకటేశా” ఆయన తీసిన చివరి సినిమా. ఇక ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయితే ఇంతకు ముందు ఆయన రస భరిత సినిమాలు తీస్తుండగా దానితో ఆయనపై అనేక విమర్శలు గుప్పించారు. దీనితో ఆయన సడన్ గా తన శైలిని పూర్తిగా మార్చేశారు. రసభరిత సన్నివేశాల నుంచి ఏకంగా భక్తిరస చిత్రాలను తెరకెక్కించడంలో మొదలుపెట్టారు.

నాగార్జునతో అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడి సాయి సినిమాలు…, బాలయ్యతో పాండురంగడు సినిమాలు భక్తి రక్తి కలయికతో ఈ సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇకపోతే గత సంవత్సరం రాఘవేంద్రరావు ఎన్టీఆర్ జయంతి నాడు ఒక క్రేజీ ప్రాజెక్టును ప్రకటించారు. అయితే ఆ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ముగ్గురు డైరెక్టర్స్ తో తీయబోతున్నారు అని. అయితే ఆ ముగ్గురు దర్శకులలో ఒకరిగా అలాగే సినిమాకి నిర్మాతగా ఉండాలని ఆయన ప్రకటన చేశారు. అయితే ఇప్పటి వరకు ఆ సినిమా సెట్స్ పైకి వెళ్ల లేదనుకోండి.

అయితే ఒకానొక సమయంలో త్రిశూలం సినిమాలో హీరోయిన్ గా జయసుధ గారు నటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాకు జయసుధ కంటే ముందుగా ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ స్మిత పాటిల్ సంప్రదించారట. ఆవిడ కథ విన్నాక అంతా నచ్చిందని నేను సినిమా చేస్తా అని ఒప్పుకున్నారు. అయితే ఆ సినిమాకి కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహిస్తున్నారని తెలియడంతో ఆవిడ ఆ సినిమాను వదులుకున్నారు. దీనికి కారణం ఆమెను అడిగితే దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సినిమాలో ఏదో చిన్న పాయింట్ ను తీసుకొని లాజిక్ లేకుండా సినిమాలు తీస్తారు అటువంటి వారితో నేను సినిమా చేయను అని ఘాటు వ్యాఖ్యలు ఆమె చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here