Featured

Heroine Amani : రిక్షావోడు సినిమా నుండి నన్ను తీసేసారు… సౌందర్య అపుడు ఏమి చేసిందంటే…: హీరోయిన్ ఆమని

Heroine Amani : సహజమైన తన అందంతో, నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుని సగటు ఇల్లాలి పాత్రలలో ఒదిగిపోయి నటించి ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన హీరోయిన్ ఆమని. హీరోయిన్ గా మంచి పాత్రలను చేసి తన నటనను నిరూపించుకున్న ఆమని ప్రస్తుతం సినిమాల్లో అడపాదడపా కనిపిస్తూ అటు బుల్లితెర మీద కూడా సందడి చేస్తోంది. ఇటీవలే ఎంసిఏ, చావు కబురు చల్లగా, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి సినిమాలలో నటించింది. ఇక బుల్లితెర మీద అటు రియాలిటీ షోకి అప్పుడప్పుడు జడ్జి గా వ్యవహారిస్తూ సీరియల్స్ కూడా నటిస్తూ అలరిస్తున్న ఆమని తన కెరీర్ అలాగే వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.

చిరంజీవితో నటించే అవకాశం పోయింది…

సినిమాల్లో నటిస్తే హీరోయిన్ గానే నటించాలి అని ఇండస్ట్రీకి వచ్చిన ఆమని మొదట్లో బాగా ఇబ్బందులు పడినా చివరకు సినిమాల్లో హీరోయిన్ గానే తన కెరీర్ మొదలు పెట్టింది. అలా ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ మెప్పించిన ఆమనికి మెగాస్టార్ చిరంజీవి గారంటే చాలా ఇష్టమట. తన డ్రీమ్ హీరో చిరునే అంటూ పలు ఇంటర్వ్యూల్లో చెప్పిన ఆమని ఆయనతో కలిసి నటించే అవకాశం రిక్షావోడు సినిమాలో రావడంతో హ్యాపీగా ఫీల్ అయిందట. అయితే సినిమా షూటింగ్ మొదలు పెట్టక ముందే డైరెక్టర్ మార్పు జరగడంతో ఆమని ప్లేసులో లో నగ్మా ను తీసుకున్నారట. దాంతో ఆమని గారు చిరుతో నటించే అవకాశం కోల్పోయారు. సౌందర్య, ఆమని ఇద్దరూ మంచి స్నేహితులు కాగా అప్పటికే ఇద్దరి కాంబినేషన్ లో సినిమాలను చేసారు. మరోసారి మన ఇద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తోంది అని సౌందర్య కాల్ చేసి మరీ చెప్పిందట.

కానీ ఆమని నటించడం లేదని తెలిసీ మళ్ళీ కాల్ చేసి నువ్వయ్యుంటే బాగుండేది కానీ మిస్ అయింది. మళ్ళీ ఇద్దరం కలిసి వేరే సినిమాలో కలిసి పనిచేయాలి అని చెప్పిందట. నువ్వు ఫీల్ అవ్వకు ఈ సినిమా మిస్ అయిందని అని చెప్పిందట సౌందర్య. ఇక చిరంజీవి అక్కగా స్టాలిన్ సినిమాలో నటించే అవకాశం వస్తే ఆమని చేయలేదట. చేస్తే చిరు పక్కన హీరోయిన్ గానే చేయాలని డిసైడ్ అయిన ఆమని అక్కగా చేయనని చెప్పారట. ఇప్పుడు హీరోయిన్ గా అవకాశాలు రాకపోయినా ఏజ్డ్ చిరు క్యారెక్టర్ కి భార్య పాత్ర అయిన సరే చేస్తానని చెప్తోంది. ఏది ఏమైనా చిరు పక్కన హీరోయిన్ గా లేదా భార్యగానే నటిస్తాను అంటూ క్లారిటీ ఇస్తోంది.

Bhargavi

Recent Posts

“ఇరాన్ అణు కార్యక్రమంపై ఒత్తిడి పెంచుతాం.. అవసరమైతే పరిమిత దాడి: ట్రంప్ హెచ్చరిక”

ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…

4 hours ago

“ఒంటరిగా ఉన్నాననే కారణంగా టార్గెట్ చేస్తున్నారు.. కర్మ వదలదు: హీరోయిన్ మీనా భావోద్వేగ వ్యాఖ్యలు”

దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…

4 hours ago

“బట్టతలకు బై బై చెప్పే స్మార్ట్ క్యాప్!.. మందులు, సర్జరీ లేకుండానే జుట్టు పెరుగుదల?”

జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…

4 hours ago

“వీధి కుక్కల బెడద పెరుగుతోంది.. ఉమ్మడి మెదక్‌లో వరుస దాడులతో ప్రజల్లో భయం!”

ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…

4 hours ago

ఆపరేషన్ చేసి కడుపులో కత్తెర మరిచిపోయిన డాక్టర్లు ! ఐదేళ్లుగా నరకయాతన అనుభవిస్తున్న మహిళ !

ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…

5 hours ago

విశాఖ సాగరతీరంలో నావికాదళ శక్తి ప్రదర్శన.. బీటింగ్ సెర్మనీతో అబ్బురం!

విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…

5 hours ago