Heroine Amani : సహజమైన తన అందంతో, నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుని సగటు ఇల్లాలి పాత్రలో ఒదిగిపోయి నటించి ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన హీరోయిన్ ఆమని. హీరోయిన్ గా మంచి పాత్రలను చేసి తన నటనను నిరూపించుకున్న ఆమని ప్రస్తుతం సినిమాల్లో అడపాదడపా కనిపిస్తూ, అటు బుల్లితెర మీద కూడా సందడి చేస్తోంది. ఇటీవలే ఎమ్సీఏ, చావు కబురు చల్లగా, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి సినిమాలలో నటించింది. ఇక బుల్లితెర మీద అటు రియాలిటీ షోకి అప్పుడప్పుడు జడ్జిగా వ్యవహారిస్తూ ఇటు సీరియల్స్ కూడా నటిస్తూ అలరిస్తున్న ఆమని తన కెరీర్ అలాగే వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.
నా తమ్ముడి ఫ్యామిలీ నా మీద కేసు వేశారు…
తండ్రి డిస్ట్రిబ్యూటర్ అవడం వల్ల చిన్నపటి నుండి సినిమా నేపథ్యం తెలిసిన ఆమనికి తెలియకుండానే సినిమా మీద ఇష్టం ఏర్పడింది. అయితే తండ్రి మొదట నిరాకరించినా చివరికి అందరినీ ఒప్పించి ఆమని సినిమాల్లోకి వచ్చారు. మొదట అవకాశాల కోసం బాగా కస్టపడినా మంచి కథలు ఎంపిక చేసుకుని హీరోయిన్ గా మంచి సినిమాలనే చేసిన ఆమని తండ్రి మరణం తరువాత కుటుంబం బాధ్యతను తాను తీసుకుని తన తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లను చదివించి సెటిల్ చేసారు. తమ్ముడు, తమ్ముడు భార్య చాలా బాగా నాతో ఉండేవారంటూ చెప్పిన అమని అనుకోని విధంగా తన మీద కేసు పడిందని ఆ విషయం గురించి వివరించారు.
తమ్ముడి భార్య తరుపున వాళ్ళు తన మీద వేధింపుల ఆరోపణలతో కేసు వేశారు. అయితే కేసులో తనమీద వేసిన నింద నిజం కాదంటూ చెప్పారు. తన తమ్ముడు భార్య కూడా చాలా మంచి అమ్మాయి అని ఇందులో తన తప్పు కూడా ఏమి లేదంటూ వివరించారు. ఆ అమ్మాయి తరుపున వాళ్లకు లాయర్ ఎవరైనా ఇంట్లో పాపులర్ సెలబ్రిటీ లాంటి వ్యక్తి కుటుంబంలో ఉన్నపుడు వారి మీద కేసు పెడితే కేసు స్ట్రాంగ్ గా ఉంటుంది అని సలహా చెప్పడంతో అలా నా పేరును కేసులో ఇరికించారు అంటూ చెప్పారు. నా తమ్ముడికి అతని భార్యకి వచ్చినవి చిన్న చిన్న గొడవలు అంతే ఇపుడు అవేవి లేవు. అందరం హ్యాపీగా ఉన్నాం. తను నాతో చాలా చక్కగా ఉంటుంది అంటూ వివరించారు ఆమని.
ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…
దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…
జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…
ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…
ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…
విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…