మనుషుల్లో మానవత్వం చచ్చిపోయింది.. పిల్లలకు నేర్పించే విలువలు ఇవేనా: రష్మీ

ప్రస్తుత కాలంలో పిల్లలు కేవలం చదువులో పోటీపడి ఒకరిని మించి ఒకరు చదువు కోసం తాపత్రయపడుతున్నారు. కానీ వారి జీవిత పాఠాలను నేర్చుకోవడంలో పూర్తిగా విఫలమవుతున్నారని ప్రముఖ యాంకర్ రష్మి గౌతమ్ ఓ సందర్భంలో తెలియజేశారు. సోషల్ మీడియాలో ఓ పోస్టు ద్వారా రష్మి ఈ విధంగా స్పందించారు. ప్రస్తుత కాలంలో ని పిల్లలకు తమ జీవితంలో ఏర్పడే ప్రజా సమస్యలను ఎదుర్కొనే విధంగా వారికి మనోధైర్యాన్ని ఇవ్వాలని, ఏది మంచి? ఏది చెడు? అని చిన్నప్పటి నుంచి వారికి అలవాటు చేయాలని ఈ సందర్భంగా తెలియజేసారు.

 

డిగ్రీలు సాధించి అందరి కంటే ముందు వరుసలో ఉండాలన్న తపనతో జీవిత పాఠాలను నేర్చుకోవడంలో విఫలమవుతున్నారని మన భవిష్యత్తు ఇలాగే ఉంటుందని… రష్మీ ట్వీట్ చేయడమే కాకుండా,మనుషుల్లో మానవత్వం చచ్చిపోయింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

తమిళనాడు ప్రాంతానికి చెందిన సెంథిల్ కుమార్ అనే యానిమల్ లవర్ తన ట్విట్టర్ వేదికగా ఒక వీడియోని పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో ఒక చిన్న పిల్లాడు ఒక కుక్క పిల్లను నీటితొట్టె దగ్గరకు తీసుకువెళ్లి దానిని అందులో పడేసి, దాని చావుకు కారణమయ్యాడు. ఈ సంఘటనపై యాంకర్ రష్మి తీవ్రంగా స్పందించి, ఈ ఘటనపై తన అభిప్రాయాన్ని ట్వీట్ చేశారు.

రష్మీ చేసిన ట్వీట్ కు స్పందించిన నెటిజన్లు ఆమెకు మద్దతు తెలిపారు. ఈ పోటీ ప్రపంచంలో పడి పిల్లలకు జీవిత పాఠాలు నేర్పించడంలో పూర్తిగా విఫలమయ్యామని సదరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అంతేకాకుండా పిల్లలకు మంచి, చెడు విషయాలను చిన్నతనంలోనే నేర్పించాలని కామెంట్లు చేస్తున్నారు. చిన్నతనం నుండి పిల్లలకు సేవ, మానవత్వం, జాలి వంటి విషయాలను గురించి నేర్పించాలని ఈ సందర్భంగా ఆమె ప్రతి ఒక్క తల్లిదండ్రులను వేడుకున్నారు.