Hyderabad : హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పై ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఫ్లైఓవర్ పైనుంచి కిందకి పడి వాహనదారుడు మృతి చెందాడు. ఆదివారం రాత్రి ఇద్దరు యువకులు కలిసి స్పోర్ట్స్ బై పై ప్రయాణిస్తూ డివైడర్‌ను ఢీకొన్నారు. దీంతో ఒక ఫ్లైఓవర్ నుంచి మరో ఫ్లైఓవర్ మీదకు ఎగిరి పడ్డారు. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడు తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పేరు చందర్ గా గుర్తించారు.

మృతుడు గచ్చిబౌలిలో నివాసం ఉంటున్న మధుగా గుర్తించారు పోలీసులు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాద సమయంలో వీరిద్దరూ దాదాపు 120 కిలోమీటర్ల స్పీడ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపధ్యంలో ఫ్లైఓవర్ నుంచి బైక్ వంద అడుగులపై నుంచి కిందికి పడిందని తెలుస్తుంది. కాగా, మృతుడు మధు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.