Featured

Actress Archana: ఆ చిన్న పాత్ర కోసం.. పెద్ద సినిమా మిస్ అయ్యాను.. ఇప్పటికీ ఆ సమస్య నన్ను వెంటాడుతుంది : అర్చన

Actress Archana: టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించి నటిగా గుర్తింపు పొందిన అర్చన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె పలు సినిమాలలో నటిగా, హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలలో నటించి మెప్పించారు. ఈ విధంగా పలు సినిమాలలో నటించిన అర్చన ఈమధ్య కాలంలో వెండితెరపై కనిపించలేదు. ఇకపోతే కార్యక్రమంలో పాల్గొన్న ఈమె తన కెరియర్ గురించి కెరియర్ లో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి వెల్లడించారు.

Actress Archana: ఆ చిన్న పాత్ర కోసం పెద్ద సినిమా మిస్ అయ్యాను.. ఇప్పటికీ ఆ సమస్య నన్ను వెంటాడుతుంది: అర్చన

సాధారణంగా ఒక సినిమాలో మన నటనని చూసి మనకు సినిమా అవకాశాలు వస్తాయని అలాగే అవకాశాలు కూడా పోతాయని అర్చన పేర్కొన్నారు. ఈ క్రమంలోనే త్రిష నటించిన సినిమా వల్ల తాను ఎంతో నష్టపోయానని ఈ సందర్భంగా ఈమె ఆవేదన వ్యక్తం చేశారు.త్రిష హీరోయిన్ గా నటించిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో తాను త్రిష ఫ్రెండ్ పాత్రలో నటించాను అయితే ఈ పాత్ర కోసం ఏకంగా తాను బాపు గారి సినిమాలో నటించే అవకాశాన్ని కోల్పోయానని అర్చన పేర్కొన్నారు.

Actress Archana: ఆ చిన్న పాత్ర కోసం పెద్ద సినిమా మిస్ అయ్యాను.. ఇప్పటికీ ఆ సమస్య నన్ను వెంటాడుతుంది: అర్చన

నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో హీరోయిన్ పాత్ర అనుకొని బాపు గారి సినిమాను పక్కనపెట్టి తప్పు చేశానని ఈమె ఎమోషనల్ అయ్యారు. ఇక శ్రీరామదాసు సినిమాలో సీత పాత్ర ద్వారా అర్చన సందడి చేశారు. ఆ సమయంలో రాఘవేంద్రరావు గారు నాగార్జున గారు తనని ఎంతో బాగా చూసుకున్నారని ఈమె వెల్లడించారు.

ఇప్పటికి చెవి సమస్యతో బాధపడుతూనే ఉన్నా…

ఇకపోతే సామాన్యుడు సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటన గురించి కూడా ఈ సందర్భంగా బయటపెట్టారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒక ఆర్టిస్ట్ సరదాగా ఆమె దగ్గరికి వచ్చి గన్ షూట్ చేశారు. ఆ శబ్దానికి తన చెవిలో గుయ్ మనే శబ్దం కొన్ని రోజుల పాటు తనని వేధించిందని ఆ ఘటనతో ఇప్పటికి తను చెవి సమస్యతో బాధపడుతున్నానని అర్చన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇకపోతే తనకు సరైన కథ ఉన్న పాత్రలు దొరికితే తప్పకుండా ఇస్తానని ఈ సందర్భంగా ఈమె పేర్కొన్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

“ఇరాన్ అణు కార్యక్రమంపై ఒత్తిడి పెంచుతాం.. అవసరమైతే పరిమిత దాడి: ట్రంప్ హెచ్చరిక”

ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…

6 hours ago

“ఒంటరిగా ఉన్నాననే కారణంగా టార్గెట్ చేస్తున్నారు.. కర్మ వదలదు: హీరోయిన్ మీనా భావోద్వేగ వ్యాఖ్యలు”

దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…

7 hours ago

“బట్టతలకు బై బై చెప్పే స్మార్ట్ క్యాప్!.. మందులు, సర్జరీ లేకుండానే జుట్టు పెరుగుదల?”

జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…

7 hours ago

“వీధి కుక్కల బెడద పెరుగుతోంది.. ఉమ్మడి మెదక్‌లో వరుస దాడులతో ప్రజల్లో భయం!”

ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…

7 hours ago

ఆపరేషన్ చేసి కడుపులో కత్తెర మరిచిపోయిన డాక్టర్లు ! ఐదేళ్లుగా నరకయాతన అనుభవిస్తున్న మహిళ !

ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…

7 hours ago

విశాఖ సాగరతీరంలో నావికాదళ శక్తి ప్రదర్శన.. బీటింగ్ సెర్మనీతో అబ్బురం!

విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…

7 hours ago