ఈ 5 ఉద్యోగాలు చేస్తే సులువుగా లక్షల్లో వేతనం మీ సొంతం..!


మనలో చాలామందికి ఆరంకెల జీతం తీసుకోవాలనే ఎంకల ఉంటుంది. అయితే మనం చదివిన చదువు, చేరే కంపెనీ, పని చేసే ప్రాంతం ఆధారంగానే వేతనాల చెల్లింపులు ఉంటాయి. రాండ్ స్టాడ్ కంపెనీ దేశవ్యాప్తంగా సర్వే చేసి ఎక్కువ వేతనం చెల్లించే ఉద్యోగాల జాబితాను విడుదల చేసింది. మన దేశంలో ఇతర నగరాలతో పోలిస్తే బెంగళూరు నగరంలో కంపెనీలు ఉద్యోగులకు ఎక్కువ మొత్తంలో వేతనాలను చెల్లిస్తున్నాయని ఈ సర్వేలో తేలింది.

బెంగళూరు తర్వాత ముంబై, హైదరాబాద్, ఢిల్లీ ఎన్‌సీఆర్, పూణె ఆ జాబితాలో ఉన్నాయి. ఉన్నత చదువులు చదివిన విద్యార్థులు 5 ఉద్యోగాలలో ఏదో ఒక దానిని ఎంచుకుంటే సంవత్సరానికి 40 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తం వేతనాన్ని పొందవచ్చు. దేశంలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ ఉద్యోగాలకు డిమాండ్ బాగా ఉంది. స్టాక్స్, సెక్యూరిటీస్ అంశాలపై అవగాహనతో పాటు కాన్సెప్ట్ ఆఫ్ ఇన్వెస్ట్ మెంట్స్ లాంటి ఫైనాన్స్ అసెట్స్ బాగా అర్థం చేసుకుంటే ఈ ఉద్యోగం మంచి కెరీర్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

మెడికల్ ప్రొఫెషనల్ ఉద్యోగాలకు కూడా ఎంతో డిమాండ్ ఉంది. కరోనా వైరస్ విజృంభణ తర్వాత ఈ ఉద్యోగాలకు డిమాండ్ మరింత పెరిగింది. ఎంబీబీఎస్ పూర్తి చేసిన వాళ్లు సెప్షలైజేషన్ చేసి ఈ ఉద్యోగలకు అర్హులు కావచ్చు. ప్రస్తుతం ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఉద్యోగాలలో ఛార్టెడ్ అకౌంటెంట్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. చార్టెడ్ అకౌంటెంట్లు ట్యాక్స్ మేనేజ్ మెంట్ వ్యవహారాలు, ఫైనాన్షియల్ అకౌంటింగ్ చేయాల్సి ఉంటుంది.

డేటా సైంటిస్ట్ ఉద్యోగాలకు కూడా భారీగా డిమాండ్ ఉంది. టెలికం, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, రిటైల్, ఐటీ రంగాల్లో కూడా డేటా సైంటిస్ట్ ఉద్యోగాలకు మంచి డిమాండ్ ఉంది. బ్లాక్ చెయిన్ డెవలపర్ల ఉద్యోగాలకు ఇప్పుడిప్పుడే దేశంలో డిమాండ్ పెరుగుతోంది. ఈ ఐదు ఉద్యోగాలలో ఏదో ఒక ఉద్యోగాన్ని కెరీర్ ఆప్షన్ గా ఎంచుకోవడం వల్ల సులభంగా ఉన్నత స్థానాలను అధిరోహించవచ్చు.