100 Years Old Restaurants: ఆహారం తింటే ఈ రెస్టారెంట్లలోనే తినాలి అంటారు..ఇలా 100 ఏళ్ల కాలం నాటి రెస్టారెంట్లు ఏవో చూద్దామా..!

100 Years Old Restaurants: ఆహారం తింటే ఈ రెస్టారెంట్లలోనే తినాలి అంటారు..ఇలా 100 ఏళ్ల కాలం నాటి రెస్టారెంట్లు ఏవో చూద్దామా..!

100 Years Old Restaurants: కొన్ని రెస్టారెంట్లకు ఒక్కసారి వెళ్లితే మళ్లీ మళ్లీ వెళ్లాలని అనిపిస్తుంటుంది. అలాంటి వాటిలో కొన్ని ఎన్నో సంవత్సరాల క్రితం నిర్మించి ఉంటారు. అలా 100 సంవత్సరాల నుంచి అదే రెస్టారెంట్ ను నడుపుతూ.. ఎంతో మంది కస్టమర్లకు సర్వీస్ చేసిన రెస్టారెంట్లు ఇండియాలో బాగానే ఉన్నాయి. ఇన్ని రోజులు అవి ఇలా సర్వీస్ చేసుకుంటూ ఉన్నాయంటే.. ఆ రెస్టారెంట్లలో ఎలాంటి సర్వీసు ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

100 Years Old Restaurants: ఆహారం తింటే ఈ రెస్టారెంట్లలోనే తినాలి అంటారు..ఇలా 100 ఏళ్ల కాలం నాటి రెస్టారెంట్లు ఏవో చూద్దామా..!
100 Years Old Restaurants: ఆహారం తింటే ఈ రెస్టారెంట్లలోనే తినాలి అంటారు..ఇలా 100 ఏళ్ల కాలం నాటి రెస్టారెంట్లు ఏవో చూద్దామా..!

ఇక.. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మన భారత ఉపఖండం రుచికరమైన వంటకాలకు ప్రసిద్ధి చెందింది. భారతదేశం సుగంధ ద్రవ్యాలు.. విభిన్న సంస్కృతికి చెందిన దేశం. భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వం.. వైవిధ్యం కారణంగా దేశంలో విస్తృత శ్రేణి వంటకాలు ఉన్నాయి. ఇలా ఏదేశస్తులు అయినా ఒక్కసారి రుచి చూశారంటే ఎప్పటికీ వదలరు. వాటిపై విసుగు అనేది రాదు. ఇక మంచి భోజనం ఎవరి మానసిక స్థితినైనా తేలికపరుస్తుందని ఎంతో మంది విదేశీయులు పేర్కొన్న సందర్భాలు ఉన్నాయి. ఇక 100 ఏళ్లు అంటే.. బ్రిటీష్ కాలంలో నిర్మించినవి అవేంటో చూద్దామా మరి..

100 Years Old Restaurants: ఆహారం తింటే ఈ రెస్టారెంట్లలోనే తినాలి అంటారు..ఇలా 100 ఏళ్ల కాలం నాటి రెస్టారెంట్లు ఏవో చూద్దామా..!

గ్లెనరీస్, డార్జిలింగ్…
డార్జిలింగ్ అంటే పర్యాటక ప్రదేశానికి పెట్టింది పేరు. అక్కడికి వచ్చిన పర్యాటకులకు గ్లెనరీస్ అనే రెస్టారెంట్.. ఎంతో అద్భుత అనుభవాన్ని కల్పిస్తుంది.గ్లెనరీ దాదాపు 130 సంవత్సరాల క్రితం నిర్మించారట. అయినా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంటుంది. దీనిలో రుచికరమైన అల్పాహారం నుంచి రుచికరమైన డెజర్ట్‌లు.. ప్రధాన ఆహార పదర్ధాలు ఉటాయి. మీరు ఎప్పుడైనా ఈ రెస్టారెంట్‌ని సందర్శించినట్లయితే.. అక్కడ ఏదో పదర్థాన్ని రుచి చూడండి.

100 Years Old Restaurants: ఆహారం తింటే ఈ రెస్టారెంట్లలోనే తినాలి అంటారు..ఇలా 100 ఏళ్ల కాలం నాటి రెస్టారెంట్లు ఏవో చూద్దామా..!

లియోపోల్డ్ కేఫ్, ముంబై
ఇది ముంబైలో 150ఏళ్ల కాలం నాటిది. అప్పుడు ఇది ఎంత అందంగా ఉందో ఇప్పటికీ అంతే అందంగా ఉంది. 2008 ముంబై దాడుల సమయంలో ఈ కేఫ్ ప్రభావితమైంది. ఇప్పటికీ ఆ బుల్లెట్ గుర్తులు ఆ రెస్టారెంట్ వద్ద గుర్తులు ఉంటాయి. ఈ ప్రదేశం ఒక పర్యాటక ప్రదేశంగా గుర్తించబడుతోంది.

100 Years Old Restaurants: ఆహారం తింటే ఈ రెస్టారెంట్లలోనే తినాలి అంటారు..ఇలా 100 ఏళ్ల కాలం నాటి రెస్టారెంట్లు ఏవో చూద్దామా..!

ఇండియన్ కాఫీ హౌస్, కోల్‌కతా..
ఇండియన్ కాఫీ హౌస్ లేదా ICH అని దీనిని పిలుస్తారు. ఇది ప్రతి భారతీయుడికి తెలిసిన ప్రసిద్ధ రెస్టారెంట్ చైన్. మొదటి ఇండియన్ కాఫీ హౌస్ 1876లో కోల్‌కతాలో ప్రారంభించబడింది. అయితే దీనిని మొదట ఆల్బర్ట్ హాల్ అని పిలిచేవారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1947 సంవత్సరంలో పేరు ఇండియన్ కాఫీ హౌస్‌గా మార్చబడింది. ఈ ప్రదేశం వద్ద లభించే కాఫీ స్వర్గాన్ని తలపిస్తుందని అంటుంటారు.

కరీమ్ న్యూ ఢిల్లీ..

ఇది జామా మసీదు నుంచి కొద్ది దూరం నడిస్తే అక్కడ ఉంటుంది. దీనిని 1913లో నిర్మించారు. హాజీ కరీముద్దీన్ చేత స్థాపించబడింది. అతను ఆహారం పట్ల ఎక్కువ మక్కువ కలిగి ఉండేవాడు. దీంతో ఢిల్లీలోని స్థానికులకు నవాబీ రాజ వంటకాలను తీసుకురావాలనుకున్నాడు. ఆ ఆలోచనతోనే విజయవంతంగా రూపొందించాడు. తర్వాత ఇది సెలబ్రిటీ చెఫ్ గా మారిపోయింది. ఇక్కడ అందించే ఆహారం.. 5 స్టార్ హోటల్ చెఫ్ అయినా అధిగమించలేరు.