భారతదేశంలో కొన్నాళ్ల నుంచి స్మార్ట్‌ఫోన్ లు పేలుతున్నాయి. Vivo, OnePlus స్మార్ట్ 5 జీ ఫోన్లు పేలిన సందర్భాలు చాలా ఉన్నాయి. తర్వాత ఇప్పడు ఆ జాబితా Poco పేరు కూడా చేరింది. మహేష్ అనే వినియోగదారుడు పోకో ఎం3 స్మార్ట్‌ఫోన్ 5జీ పేలిందని.. దానికి సంబంధించి బ్యాక్ ప్యానెల్ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
దీనిపై అతడి సోదరుడు స్పందిస్తూ.. తన తమ్ముడు ఫోన్ Poco M3 బ్లాస్ట్ అయిందని అతను ట్విట్టర్ లో రాశాడు. ఫోన్‌లో పేలడానికి గల కారణం ఏంటి అనేది మాత్రం స్పష్టంగా తెలపలేదు. దీనిని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మహేష్ ఈ ట్వీట్ చేశాడు.
అయితే ఈ ట్వీట్ చేసిన కొన్ని నిమిషాలకే అతడు తొలగించాడు. కానీ అప్పటికే అది ఎక్కువగా షేర్ చేయబడింది. దానికి సంబంధించి స్క్రీన్ షాట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. నవంబర్ 27 మధ్యాహ్నం 12:33 గంటలకు మహేష్ ఈ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ స్క్రీన్ షాట్ 91మొబైల్స్ ద్వారా షేర్ చేయబడింది. అయితే అప్పటికే పోకో ఫోన్ పేలింది అంటూ సౌరబ్ హతి అనే ట్విట్టర్ యూజర్ మహేష్ ట్వీట్‌ను షేర్ చేశారు.
సౌరబ్ హతి ట్వీట్‌పై పోకో ప్రతినిధులు స్పందించారు. భారతదేశంలో కస్టమర్ల భద్రత కంపెనీకి అత్యంత ముఖ్యమైన విషయం. ఇలాంటి విషయాలను సీరియస్‌గా తీసుకుంటాం. కారణాన్ని తెలుసుకోవడానికి మా బృందం దీనిని పరిశీలిస్తోందన్నారు. త్వరలోనే సమస్యకు పరిష్కారం చూపెడతామన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…
దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…
జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…
ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…
ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…
విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…