Pawan Kalyan: తెలుగు సినీ ప్రేక్షకులకు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా తన బాధ్యతలను నిర్వహిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నప్పటికీ, వాటిలో కొన్ని మాత్రమే ఇప్పటివరకు షూటింగ్ ని జరుపుకున్నాయి. ఇంకా కొన్ని సినిమాలు మొదలవ్వలేదు. ఓజి, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి సినిమాల షూటింగ్ ఇంకా పెండింగ్ లో ఉంది. ముందుగా పవన్ ఓజి చిత్రాన్ని ఫినిష్ చేయాలనే ఆలోచనతో ఉన్నారు.
Advertisement
దీనికి కారణం ఓజి షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయింది. ఇక కొద్దిరోజులు పవన్ డేట్లు ఇస్తే సరిపోతుంది. త్వరలోనే తనకు వీలు కుదిరినప్పుడు ఈ సినిమాలకు డేట్లు ఇస్తానని, ఆ సినిమాలను పూర్తి చేస్తానని తెలిపారు పవన్ కళ్యాణ్. ఇది ఇలా ఉంటే మామూలుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో నటించే అవకాశం వస్తే ఏ హీరోయిన్ కూడా వదులుకోరు. ఇటువంటి అవకాశాల కోసం ఎదురు చూసే వారు కూడా చాలామంది ఉన్నారు. అందులో నేను కూడా ఒకరు అని చెబుతోంది సీనియర్ నటి. తాజాగా ఒక సీనియర్ హీరోయిన్ పవన్ కళ్యాణ్ పై చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
పవన్ కళ్యాణ్ వయసులో ఆ హీరోయిన్ కంటే చిన్ననే అయినప్పటికీ తనతో నటించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ఆమె చెప్పుకొచ్చింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు ఇంద్రజ. ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ లాంటి షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యింది నటి ఇంద్రజ. ఒకప్పుడు ఎన్నో సినిమాలలో హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఇంద్రజ. ప్రస్తుతం అడపాదడపా సినిమాలలో నటిస్తూనే మరోవైపు బుల్లితెరపై ప్రసారమయ్యే పలుషోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. ఇకపోతే ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇంద్రజ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ క్రేజీ కామెంట్ చేసింది.
ఆయన అంటే నాకు చాలా ఇష్టం..
Advertisement
ప్రస్తుతం ఉన్న హీరోల్లో ఛాన్స్ వస్తే ఎవరి సరసన హీరోయిన్గా నటిస్తారు అని యాంకర్ ప్రశ్నించగా.. ఇంద్రజ ఏమాత్రం ఆలోచించకుండా తడుముకోకుండా పవన్ కళ్యాణ్ పేరు చెప్పేసింది. పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం అని, ఆయన పక్కన హీరోయిన్ గా ఛాన్స్ వస్తే పిచ్చ హ్యాపీ అంటూ ఇంద్రజ సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Nagavamshi: సినీ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన సినిమా టికెట్ల రేట్ల గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలు మారడంతో సినిమా టికెట్ల రేట్లు కూడా పెంచుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా సినిమా టికెట్ల రేట్లతో పాటు బెనిఫిట్ షోలకు కూడా అనుమతి తెలుపుతున్నారు.
Advertisement
ఈ క్రమంలోనే ఒక మధ్యతరగతి వ్యక్తి తన కుటుంబంతో సహా సినిమా చూసి రావడం అంటే పెరిగిన టికెట్ల రేట్లు కారణంగా ఎన్నో ఇబ్బందులు తలెత్తుతున్నాయి అయితే ఈ విషయంపై నాగ వంశీ మాట్లాడుతూ ఒక కుటుంబం సినిమా చూడటానికి వెళ్తే వారికి అయ్యే ఖర్చు రూ.1500 . నా దృష్టిలో ఇది చాలా తక్కువ ధర అని ఈయన తెలిపారు.
ఇలా 1500 వందలకే మూడు గంటల పాటు ఎంటర్టైన్మెంట్ అందించడం అంటే మామూలు విషయం కాదు ఇలాంటి ఎంటర్టైన్మెంట్ మరి ఎక్కడ దొరకదని ఈయన తెలిపారు. అయితే అదే కుటుంబం షాపింగ్ మాల్ వెళ్తే ఇంతకంటే కూడా మరింత ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇలా మూడు గంటల ఎంటర్టైన్మెంట్ కోసం 1500 ఖర్చు చేయడం చాలా తక్కువ అంటూ ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
థియేటర్ ఎక్స్పీరియన్స్.. ఇలా సినిమా టికెట్ల రేట్లు తక్కువే అంటూ నాగ వంశీ కామెంట్ చేయడంతో మరికొందరు ఈ వ్యాఖ్యలపై విభిన్న రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. సినిమా టికెట్ల కోసమే ఈ స్థాయిలో ఖర్చు చేస్తే అక్కడ దొరికే స్నాక్స్ రేట్లు కూడా ఆకాశాన్ని తాకుతూ ఉంటాయని, ఇవన్నీటిని లెక్కవేస్తే ఒక మధ్యతరగతి వ్యక్తి సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ కోల్పోతారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Gunturu Kaaram: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల చివరిగా నటించిన చిత్రం గుంటూరు కారం. ఈ సినిమా తర్వాత ఈయన రాజమౌళి సినిమాకు కమిట్ కావడంతో ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది నుంచి రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయని తెలుస్తుంది.
Advertisement
ఇక మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అనుకున్న స్థాయిలో మాత్రం ఈ సినిమాకు సక్సెస్ అందలేదని చెప్పాలి. ఇకపోతే తాజాగా గుంటూరు కారం సినిమా నిర్మాత నాగ వంశీ ఓ కార్యక్రమంలో భాగంగా ఈ సినిమా పట్ల చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
గుంటూరు కారం సినిమా కంటెంట్ పరంగా ఏమాత్రం తప్పులేదని కంటెంట్ వల్ల ఈ సినిమాకు డ్యామేజ్ అవ్వలేదని తెలిపారు. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాకు గుంటూరు కారం అనే మాస్ టైటిల్ పెట్టడమే పెద్ద డ్యామేజ్ అని తెలిపారు. ఈ సినిమాకు ఈ టైటిల్ కరెక్ట్ కాదని ఈయన ఓపెన్ అయ్యారు.
నైజాం ఏరియా… ఇక కలెక్షన్ల విషయానికి వస్తే కేవలం నైజాం ఏరియాలో మాత్రమే ఈ సినిమా కలెక్షన్ల విషయంలో డ్యామేజ్ జరిగిందని మిగిలిన అన్ని ఏరియాలలోనూ ఈ సినిమా సేఫ్ అయ్యిందని నిర్మాత తెలిపారు. ఇలా గుంటూరు కారం సినిమా మైనస్ ల గురించి ఈయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్నారు. ఇటీవల దేవర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్ త్వరలోనే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమా పనులలో బిజీ కాబోతున్నారు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Advertisement
ఎన్టీఆర్ త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులలో బిజీ కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా కోసం డైరెక్టర్ కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారని తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఈ విషయం గురించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమాలో ప్రశాంత్ నీల్ ఒక స్పెషల్ సాంగ్ ఉండేలా ప్లాన్ చేసినట్టు సమాచారం. అయితే ఈ స్పెషల్ సాంగ్ కోసం సమంతను సంప్రదించారంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇక సమంత ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఇప్పటికే నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నాయి.
సమంతనే ఫైనల్.. ఇకపోతే సమంత ఇటీవల పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు. ఈ పాట భారీ స్థాయిలో హిట్ అయింది. అందుకే మరోసారి ఎన్టీఆర్ సినిమాలో కూడా సమంతనే స్పెషల్ సాంగ్ కోసం తీసుకోవాలని ప్రశాంత్ నీల్ భావించినట్టు తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ సైతం సమంతనే ఫైనల్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.