సినిమా ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీలకు ఉండే ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాలలో నటించి తమ నటనతో ఎంతో మంది హృదయాల్లో స్థానం సంపాదించుకకున్నారు. కొంతమంది సినీ బ్యాక్ గ్రౌండ్ తో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వగా మరి కొంతమంది ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి స్వశక్తితో ఎదిగారు. అలాంటి వారిలో ఈ ప్రముఖ నటుడు కూడా ఒకరు. ఈ నటుడు ఒకప్పుడు వాచ్‌మెన్ గా కూడా పని చేశాడు. అలాగే కెమిస్ట్‌గా పని చేశాడు. కూరగాయలు కూడా అమ్మాడు. ఇలా ఎన్నో రకాల పనులు చేశాడు.
అదే సమయంలో సినిమా ఆడిషన్స్ కు హాజరయ్యాడు. అయితే మొదట్లో ఎక్కడికి వెళ్లినా కూడా అతన్ని అందరూ తిరస్కరించేవారట. కానీ పట్టు వదలకుండా అలాగే ప్రయత్నించి చిన్న చిన్న సినిమాలలో నటించే అవకాశం సొంతం చేసుకున్నాడు. అలా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ స్టార్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలా ప్రస్తుతం బాలీవుడ్ లో ఉన్న స్టార్ నటలలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అతను మరెవరో కాదు బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ. సినిమా ఇండస్ట్రీకి రాకముందు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న నవాజ్ సిద్ధిఖీ వరస సినిమాలు చేయడంతో పాటు అందుకు తగ్గట్టుగానే పారితోషికం కూడా అందుకుంటున్నారు.
పారితోషకం కోట్లలో అన్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ నటుడి ఆస్తి సుమారు రూ. 200 కోట్లకు పైమాటే. ఇక రాజభవనం లాంటి ఇల్ల, లగ్జరీ కార్లు ఇలా తన పడిన కష్టానికి ఇప్పుడు లగ్జరీ లైఫ్ ను ఆస్వాదిస్తున్నారు నవాజుద్దీన్ సిద్ధిఖీ. ప్రస్తుతం బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు. అయితే ఈ విషయాలన్నీ కూడా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు పంచుకున్నారు నవాజ్ సిద్ధిఖీ. ఒకప్పుడు కూరగాయలు అమ్మిన అతను నేడు కోట్లలో పారితోషం అందుకుంటూ కోట్లు సంపాదించిన అతనిపై ప్రశంసలు కురిపిస్తూ గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కర్నూలు జిల్లాలో ఓ చిన్నారి చేసిన భావోద్వేగ విజ్ఞప్తి ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. చదువుకోవాలన్న తపన…
దేశంలో ఇంధన రంగంలో మరో కీలక అడుగు పడింది. పర్యావరణహిత ఇంధన వినియోగాన్ని పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కొత్తరకం…
ముంబైలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో గది తీసుకున్న ఓ అతిథికి ఎదురైన అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు…
అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఒక సాధారణ మహిళ జీవితం, విదేశీ నేలపై అసాధారణమైన మానవ సంబంధాలకు ప్రతీకగా నిలిచింది.…
దేశంలో డ్రైవింగ్ లైసెన్స్ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులను పరిశీలిస్తున్నట్లు సమాచారం. కోట్లాది మంది వాహనదారులకు ఊరటనిచ్చేలా లైసెన్స్…
తెలుగు బిగ్‌బాస్ సీజన్-10 ప్రారంభానికి ఇంకా అధికారిక తేదీ ప్రకటించకపోయినా, కంటెస్టెంట్ల జాబితాపై మాత్రం సోషల్ మీడియాలో భారీ స్థాయిలో…