అక్కినేని నాగ చైతన్యకి ఒక అన్నయ్య ఉన్నాడని మీకు తెలుసా ? ఇదిగో ప్రూఫ్..!!

0
5154

అక్కినేని ఫ్యామిలీకి, దగ్గుబాటి ఫ్యామిలీ కి బాగా సంబంధం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకు కారణం దగ్గుబాటి ఫ్యామిలీకి చెందిన లక్ష్మి ని అక్కినేని నాగార్జున వివాహం చేసుకున్నారు. వీరిద్దరి వివాహం పెద్దలు కుదిర్చిన సంబంధమే. ఇక వీరిద్దరి వివాహం జరిగిన సమయంలో అక్కినేని నాగార్జున స్టార్ హీరోగా ఎదుగుతున్న సమయం. ఇక వీరిద్దరి వివాహం తర్వాత వీరిద్దరి సంసారానికి గుర్తుగా హీరో నాగచైతన్య జన్మించారు. ఇలా కొన్ని రోజుల తర్వాత అక్కినేని నాగార్జున, లక్ష్మీ ల మధ్య మనస్పర్థలు రావడంతో వారిద్దరు విడిపోయారు.

దీంతో అక్కినేని నాగార్జున తన సహనటి హీరోయిన్ అమల ను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అలాగే దగ్గుబాటి లక్ష్మి కూడా నాగార్జునతో వీడుకులు తీసుకోని వెళ్లిపోయాక అమెరికాకు వెళ్లిన తర్వాత అక్కడ ఓ పెద్ద బిజినెస్ మాగ్నెట్ ను వివాహం చేసుకున్నారు. ఆయన పేరు శరత్ విజయ రాఘవ. ఆయన మద్రాస్ నగరానికి చెందిన ఓ సాంప్రదాయ కుటుంబానికి చెందిన వ్యక్తి.

ఇకపోతే లక్ష్మీ వివాహం చేసుకున్న శరత్ కు ఇదివరకే పెళ్లి జరిగింది. ఆయన లక్ష్మి ని రెండవ వివాహం చేసుకున్నారు. అయితే హీరో నాగార్జున లక్ష్మికి జన్మించిన నాగచైతన్య కూడా తన తల్లి లక్ష్మి దగ్గరే పెరిగాడు. అలాగే ఇదివరకే వివాహం చేసుకున్న శరత్ కు కూడా ఒక కుమారుడు ఉన్నారు. దీంతో నాగచైతన్య తన సోదరుడితో కలిసి పెరిగాడు. దగ్గుబాటి లక్ష్మి నాగచైతన్య తో పాటు శరత్ మొదటి భార్య కుమారుడు కూడా ఇద్దరినీ సమానంగా పెంచి పెద్ద చేశారు.

ఇకపోతే నాగ చైతన్య హీరోయిన్ సమంత ను ప్రేమించి వివాహం చేసుకున్న సమయంలో కూడా తన తల్లి లక్ష్మి, ఆవిడ భర్త శరత్ కూడా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే అక్కినేని నాగ చైతన్య తో పాటు పెరిగిన సోదరుడు కూడా వివాహం జరిగిన సమయంలో వారి వివాహం కార్యక్రమానికి కూడా హాజరయ్యారు. అప్పుడే నాగచైతన్య సోదరుడు కూడా తన తండ్రి బాటలోనే ఒక పారిశ్రామిక వేత్తగా రానిస్తున్నారు. శరత్ కూడా ప్రముఖ పరిశ్రమలో సేల్స్ చీప్ ఎగ్జిక్యూటివ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. నాగచైతన్య తల్లి లక్ష్మి, ఆవిడ రెండో భర్త శరత్ ఇద్దరు రెండో వివాహం చేసుకున్నా కానీ వారిద్దరికీ మొదటి వివాహ జీవితంలో పుట్టిన కుమారులను పెంచుకుంటూ జీవితాన్ని ఆనందంగా గడిపేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here