బసవతారకం కోసం ఎన్టీఆర్ చేసిన ఆ ఒక్క సినిమా.. ఈ రోజు కొన్ని లక్షల మంది ప్రాణాలను నిలబెట్టింది..!!

0
240

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తన నటనతో కోట్లాదిమంది తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారు.. తెలుగు, తమిళం, హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాల్లో నటించారు. సినిమాల్లో నటించడమే కాకుండా పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. విశ్వ విఖ్యాత నట సార్వభౌముడిగా కీర్తి గడించారు. పౌరాణికం, జానపదం, సాంఘిక చిత్రాల్లో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి ప్రేక్షకుల మన్నన పొందారు. రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలలో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో దైవంగా నిలిచిపోయారు.

ఎన్‌టీఆర్ 13 చారిత్రకాలు, 55 జానపద, 186 సాంఘిక, 44 పౌరాణిక చిత్రాలలో నటించారు. ఆ తర్వాత 1982 మార్చి 29వ తేదీన తెలుగుదేశం పార్టీని స్థాపించి రాజకీయాల్లో రంగ ప్రవేశం చేశారు.ఎన్‌టీఆర్ కెరీర్‌లో ఎంతో ముఖ్యమైన సినిమా ‘మేజర్ చంద్రకాంత్’. ఈ సినిమాతో ప్రేక్షకుల ఆదరణతోపాటు మంచి పేరును పొందారు. మిగిలిన చిత్రాలలా మేజర్ చంద్రకాంత్ సినిమా తన సొంత లాభం కోసం పాటుపడలేదు. ఒక మంచి ఆశయాన్ని నిర్వర్తించడానికి ఈ సినిమాలో నటించాలని అనుకున్నారు. రాజకీయాల్లో రంగ ప్రవేశం చేసినప్పుడు సినిమాల్లో నటించడం తగ్గిస్తూ వచ్చారు. తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 7 ఏళ్లు కొనసాగినా.. కేవలం నాలుగు సినిమాల్లో మాత్రమే నటించారు. అప్పుడు వచ్చిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర, సామ్రాట్ అశోక్’ వంటి సినిమాలు ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయాయి..

ఇక అప్పుడే సీనియర్ ఎన్‌టీఆర్ నుంచి ఒక అనౌన్స్‌మెంట్ వచ్చింది. బసవతారకం పేరుతో ఒక క్యాన్సర్ ఆస్పత్రిని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమాతో వచ్చే డబ్బుతో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిని నిర్మిస్తానని, బయట బ్యానర్‌తో కలిసి సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. దీంతో స్టార్ హీరో, నిర్మాతగా కొనసాగుతున్న మోహన్ బాబుతో కలిసి సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. పరుచూరి బ్రదర్స్ అద్భుతమైన కథను సిద్ధం చేశారు. మేజర్ చంద్రకాంత్ సినిమా విడుదలైంది. సినిమా అంతా దేశభక్తి, ఎన్‌టీఆర్ తన దైన డైలాగులతో అదరగొట్టేసాడు.. దీంతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది ఈ సినిమా.. ఇక ఈ సినిమాకి వచ్చిన రెమ్యూనరేషన్ తోనే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని నిర్మించారు ఎన్టీఆర్..అలా అప్పట్లో నిర్మించిన ఈ హాస్పిటల్.. ఇప్పుడు ఎంతో మంది ప్రాణాలు కాపాడింది…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here