ఈయన సినిమా ప్రేమికుడు తను కూడా రెండు గుండెల్లో పుట్టే ప్రేమ వాటి మధ్యే ఉండాలని అది ఇతరులకు తెలిసేంతా బాహాటం అవసరం లేదని కోరుకునే అతి సాధారణ వ్యక్తి. అలా ఆయన రాసుకున్నటువంటి ఈ కథను రచయిత ఆత్రేయకు వినిపించారు. అప్పుడు ఇది రెండు హృదయాల మధ్య భావోద్వేగాలను తెలిపే అందమైన ప్రేమ కథ దీన్ని చాలా జాగ్రత్తగా తీయాలని నిర్మాత జి బాబు కి సలహా ఇవ్వడం జరిగింది.

జి.బాబు అలా కథ అనుకున్నాడో లేదో వెంటనే ఆ సినిమాకు సంబంధించిన పాటల కంపోజిషన్ కి ఇళయరాజాను ఎంపిక చేకున్నాడు. అనుకున్నదే తడవుగా ఆత్రేయ వారం రోజులలోనే మంచు కురిసే వేళలో పాట మినహా మిగతా అన్ని పాటలు రాశాడు. ‌‌జి.బాబు శ్రేయోభిలాషులు, సినీ ప్రముఖులు మేము డబ్బులు ఇచ్చినా అలా రాయడు నీకేమిటి అంత తొందరగా రాశాడని ఆశ్చర్యపోయారు. కథ నచ్చడంతో ఆత్రేయ మనసుపెట్టి ఆ పాటలను రాయడం అవి ప్రేక్షకుల హృదయాంతరాలలో కి వెళ్ళిపోయాయి. స్టోరీ స్లో అండ్ స్టడీగా వెళుతోంది తీయడం బాగుండాలని ఇళయరాజా సలహా ఇచ్చారు. ఇక జి.బాబు నిర్మాత మరియు సినిమాకి కథా రచయిత. ఆయన కథ మొత్తం సిద్ధం చేసుకున్నాడు. ఇక ఈ సినిమాకి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అయిన అశోక్ కుమార్ దర్శకుడిగా, సినిమాటోగ్రాఫర్ గా తన వంతు ప్రతిభను చూపాడు. ఆ కథకు సంబంధించి హీరో, హీరోయిన్లు ఎవరని ఆలోచనలో పడ్డారు. అలా ఈ సినిమాకి చిరంజీవి, శ్రీదేవి అయితే బాగుంటారని ఆలోచించారు.

మూడు, నాలుగు సినిమాలు చేస్తున్న శ్రీదేవి అభినందన సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. తరువాత చిరంజీవి పర్సనల్ మేనేజర్ ని కలవగా చూద్దాం అని చెప్పారు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ చిరంజీవి కోసం వెళ్లారు. కానీ చిరంజీవి మేనేజర్ ఓల్డ్ లవ్ స్టోరీ అది మీకు పనికి రాదని చిరంజీవితో చెప్పి.. డేట్స్ ఖాళీ లేవని అభినందన నిర్మాత జి.బాబుకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత చిరంజీవి అభినందన సినిమాను వదులుకున్నారని శ్రీదేవి కూడా ఆ సినిమా చేయడానికి ముందుకు రాలేదు.

అలా వారు ఒప్పుకోకపోవడంతో అన్వేషణ సినిమాలోని హీరో కార్తీక్, వాలుకనుల శోభనను హీరోయిన్ గా పెట్టి 1988లోఅభినందన సినిమా తీశారు. సినిమా చాలా సింపుల్ గా వచ్చి అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఒక విధంగా చెప్పాలి అంటే ఎవరు కూడా ఆ సినిమా అంతగా హిట్ అవుతుందని ఊహించలేకపోయారు. ఆ తరువాత అభినందన సినిమాలోని ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం అనే పాట ఆకాశవాణిలో ప్రతి ఆదివారం ప్రసారమై ఆంధ్ర దేశం అంతటా ఉర్రూతలూగించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here