1991 గ్యాంగ్ లీడర్, అసెంబ్లీ రౌడీ, రౌడీ అల్లుడు లాంటి కమర్షియల్ సినిమాలు వచ్చిన సంవత్సరంలో భారత్ బంద్ లాంటి ఓ వివాదాస్పదమైన చిత్రాన్ని కోడి రామకృష్ణ రూపొందించడం జరిగింది. వినోద్ కుమార్, అర్చన, రెహమాన్ కాస్ట్యూమ్ కృష్ణ ప్రధాన పాత్రలో దర్శకుడు ఈ సినిమాను రూపొందించడం జరిగింది.

‌ తన సినిమాలో విలన్స్ ని ప్రత్యేక శైలిలో చూపించే కోడిరామకృష్ణ ఈ సినిమాలో కాస్ట్యూమ్ కృష్ణ ను ఒళ్ళు గగుర్పొడిచే విలన్ పాత్రలో చూపించారు. అంకుశం లో రామ్ రెడ్డి తో బయటపెట్టిన కోడి రామకృష్ణ భారత్ బంద్ లో కాస్ట్యూమ్ కృష్ణ తో ప్రేక్షకులను భయభ్రాంతులకు గురిచేశారు. ఆనాటి సమకాలీన అంశాలను ప్రధాన అంశంగా తీసుకొని భారత్ బంద్ సినిమాను రూపొందించడం జరిగింది. కాస్ట్యూమ్ కృష్ణను పెళ్ళాం చెబితే వినాలి సినిమాలో దర్శకుడు కోడి రామకృష్ణ పరిచయం చేయడం జరిగింది.

పెళ్ళాం చెబితే వినాలి చిత్రంలో మామూలు సాధారణ పాత్రలో కనిపించిన కాస్టూమ్స్ కృష్ణ తర్వాత భారత్ బంద్ లో కనిపించిన కాస్ట్యూమ్ కృష్ణ కి చాలా తేడాను మనం గమనించవచ్చు. కిళ్ళీకొట్టు నడుపుకుంటూ నేరాలు చేసే సామాన్యుడిని ఎమ్మెల్యే తర్వాత ఏకంగా ముఖ్యమంత్రి కావడం ప్రేక్షకులను అబ్బుర పరుస్తుంది. కాలేజీ లెక్చరర్ గా అర్చన తనదైన నటనను కనబరిచారు. విలన్ తన అనుచరులు సామాన్య ప్రజల్ని ఏవిధంగా మోసం చేస్తున్నారో తెలిసి వాటిని ఖండిస్తుంది.

అయితే ప్రారంభంలో చార్మినార్, అసెంబ్లీ దాని పరిసర ప్రాంతాలు మరియు కర్ఫ్యూ సమయాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకోవడం ఉద్రిక్త వాతావరణానికి దారి తీస్తుందని.. ఆ సమయంలో షూటింగ్ వాయిదా వేసుకోవడం లాంటి ఇబ్బందులు ఎదురవుతాయని అప్పుడు నిర్మాతకు దర్శకుడికి మధ్య మనస్పర్ధలు వస్తాయని కోడి రామకృష్ణ భారత్ బంద్ సినిమాకి తానే నిర్మాతగా వ్యవహరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here