1980 దశకంలో యాక్షన్ సినిమాలు నడుస్తున్న తరుణంలో ఇద్దరు హాస్య హీరోలు తెలుగు ప్రేక్షకులను తమ చిత్ర, విచిత్ర పాత్రలతో కడుపుబ్బ నవ్వించే వారు. అందులో ఒకరు రాజేంద్రప్రసాద్ అయితే మరొకరు సీనియర్ నరేష్. జంధ్యాల రేలంగి నరసింహారావు వంటీ దర్శకుల చిత్రాలలో ఈ హాస్య నాయకులు కనిపించేవారు.

సీనియర్ నరేష్ 1970 లో రెండు కుటుంబాల కథ, 1972లో పండంటి కాపురం అనే చిత్రాల్లో బాలనటుడిగా తెలుగు తెరపై కనిపించారు.ఆ తర్వాత తన తల్లి గారైన విజయనిర్మల దర్శకత్వంలో 1982లో ప్రేమ సంకెళ్లు అనే చిత్రంలో హీరోగా నటించారు. ఆ తర్వాత నాలుగు స్తంభాలాట,రెండు జెళ్ళ సీత, శ్రీవారికి ప్రేమలేఖ, చూపులు కలిసిన శుభవేళ, హై హై నాయక, జస్టిస్ రుద్రమదేవి, కోకిల వంటి సినిమాలు తీస్తున్న తరుణంలో రామచంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన చిత్రం భళారే విచిత్రం సినిమా నరేష్ కెరీర్ కి మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత 1993 లో ఇవివి.సత్యనారాయణ దర్శకత్వంలో జంబలకిడిపంబ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది.

అయితే నరేష్ వ్యక్తిగత విషయానికి వస్తే ఆయన మొదటగా సీనియర్ కెమెరామెన్ శ్రీనివాస్ కుమార్తె ను పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికీ నవీన్ అనే కుమారుడు జన్మించాడు. కొన్ని మనస్పర్థల వలన వీరిద్దరు విడిపోయారు. తర్వాత రెండో పెళ్లి చేసుకున్న కూడా అది కాస్త విడాకుల వరకు వెళ్ళింది. తర్వాత నరేష్ 50 ఏళ్ల వయసులో సీనియర్ రాజకీయ నాయకుడైన రఘువీరారెడ్డి తమ్ముడి కుమార్తె అయిన రమ్య ను 2010లో హిందూపురంలో పెళ్లి చేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here