Connect with us

Featured

అవును మూడు పెళ్లిళ్లు చేసుకున్నాను.. కానీ అందులో నేను అనుభవించిన బాధ మీ ఎవరికి తెలియదు !!

Published

on

సినీ జీవితంలో ఒక స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నటి రాధిక.. తన సినీ రంగ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న నటి రాధిక. అయితే రాధిక పెళ్లిళ్ల విషయం అందరికి తెలిసిందే. అలా పెళ్లిళ్లు చేసుకున్న రాధికను అందరూ వేలెత్తి చూపే ముందు ఒకసారి తను ఏ పరిస్థితుల్లో అలా పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చింది అనే విషయాన్ని తెలుసుకోవాలి. అయితే ఆ పెళ్లిళ్లే తన జీవితాన్ని ఎన్నో చేదు అనుభవాలను మిగిల్చాయి. ఎంతటి బాధను రాధికా అనుభవించిందో చాలామందికి తెలియదు. రాధిక పెద్ద స్టార్ హీరోయిన్. కానీ తనలో ఉన్న లోపం ఏంటంటే తన గురించి తాను పట్టించుకోకపోవడం. పెళ్లి విషయంలోను అదే తొందరపాటు నిర్ణయం తీసుకుంది.

1984 లో నటుడు, క్రెయేటర్, దర్శక, నిర్మాత అయిన ప్రతాప్ పోతాన్ తో రాధికకు పెళ్లి జరిగింది. అలాగే ఆయన బాగా డబ్బున్న వాడు, ఒక క్రియేటివ్ అలాగే చాలా మంచివాడు అనుకుని పెళ్లి చేసుకుంది. కానీ, అతడు ఒక మనసు లేని వ్యక్తి అని రాధికకు తెలియటానికి ఎన్నో రోజుల సమయం పట్టలేదు. పెళ్లి జరిగిన రెండు సంవత్సరాలకే అతని వ్యక్తిత్వం గురించి తెలుసుకుని, అతనితో ఇమడలేక ఇద్దరూ విడిపోవడం జరిగింది.

అయితే విడాకుల తర్వాత ప్రతాప్ పోతన్ రాధిక వ్యక్తిత్వం గురించి ప్రెస్ మీట్ పెట్టి మరీ రాధిక అలాంటిది.. ఇలాంటిది.. అని మీడియా ముందు రాధికా గురించి చెడుగా చెప్పటానికి ట్రై చేశాడు. కానీ, తన గురించి తన భర్త ఇంత చెడుగా చెబుతున్నా కానీ ఒక్క మాట కూడా తన భర్త గురించి చెడుగా చెప్పలేదు అంటే రాధిక వ్యక్తిత్వం ఏంటో అర్ధం అవుతుంది. 1986 లో వీరు ఇద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు. కానీ ఆ ప్రభావం వృత్తి మీద పడనీయకుండా సినిమాల్లో నటిస్తునే వచ్చింది. అలాగే ఆ సమయానికి తాను ఒక స్థాయిలో ఉంది కూడా. నిజానికి ఒక వైఫల్యం నుంచి మనం ఒక పాఠం నేర్చుకోవాలి. లేదంటే ఆ వైఫల్యమే మరొక వైఫల్యానికి కారణం అవుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. కానీ రాధిక వైఫల్యాన్ని పాఠం లాగా నేర్చుకోలేదు.

మళ్ళీ ఒక బ్రిటన్ దేశస్థుడు అయిన రిచర్డ్ హార్డ్ ను పెళ్లి చేసుకుంది. అయితే ఈ బంధం కూడా ఎన్నో రోజులు నిలవలేదు. అయితే ఆ పెళ్లి జీవితంలో చేసిన అతి పెద్ద తప్పుగా రాధిక ఇప్పటికీ చెబుతూనే ఉంటుంది. ఒక బాధను ఎలా అర్థం చేసుకోవాలి అన్న విషయం అతనికి తెలియదు. ఆ విషయం తెలుసుకునే సమయానికి రాధిక ఆస్తి సగభాగం వరకూ కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. కొద్దికాలం తర్వాత మళ్ళీ ఆ బంధం తెగిపోయింది. సినీ ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్నో సంవత్సరాలు అయింది రాధికకు. అయితే వాళ్ళిద్దరి ప్రేమకు అనుబంధంగా ఒక కూతురు పుట్టింది. ఆమె పేరు రేయాన్. అయితే ఆ కూతురే తన జీవితం, సర్వస్వంగా అనుకుంది. తెలుగు, హిందీ, కర్ణాటక, మలయాళం ఇలా అన్ని భాషల సినిమాల్లో నటించేసింది రాధిక. దాదాపు అందరి స్టార్ హీరోలతో నటించేసింది. అయితే ఒకానొక సమయంలో క్రమంగా వెండితెర మీద రాధిక నల్లపూస అయిపోయింది. అసలు సినిమాలు చేయడమే ఒకానొక సందర్భంలో మాని వేసింది. ఆస్తి మొత్తం కరిగిపోయింది. ఎక్కడా లేని అప్పులు అప్పుడు గానీ తనకు తెలిసి రాలేదు. రాధిక తన గురించి తాను తెలుసుకునే సమయానికి కోటిన్నర రూపాయల అప్పు మిగిలింది. సంపాదించినది అంతా పోయింది. తన భవిష్యత్తు, కూతురు భవిష్యత్తును తలచుకుని కన్నీరు మున్నీరు అయింది. తన ఆస్థి అంతా పోగా ఒక్క ఇల్లు మాత్రమే మిగిలింది. అప్పుడుగాని తనకు అర్ధం అయింది మనుషుల గురించి.. డబ్బు ఉన్నపుడు చుట్టూ తియ్యని మాటలతో చేరతారు.. అదే డబ్బు పోయాక కనుమరుగవుతారు అని.

అయితే రాధిక కు ఆత్మాభిమాని ఎక్కువే అని చెప్పాలి. డబ్బులు పోయిన, అప్పులు కళ్ల ముందు మెదులుతున్న గాని దేహి అని ఎవరిని అడగలేదు. బ్యాంకు బ్యాలన్స్ లేదు, చేతిలో చిల్లి గవ్వ లేదు.. ఏమి చేయాలో తోచని పరిస్థితులలో ఇల్లు ఒక్కటి కనిపించింది. అందుకనే 1993 -94 మధ్య కాలంలో మిగిలిన ఆ ఒక్క ఇంటిని తాకట్టు పెట్టి అప్పులు తీర్చాలి అనుకుంది. ఆ రోజు ఆదివారం.. ఇల్లు కొనుగోలు చేసుకోవడానికి బయ్యర్లు వచ్చి పోతున్నారు. అదే సమయంలో తనకి సన్నిహితుడు అయిన నంద కుమార్ తన ఇంటికి వచ్చాడు. అయితే ఆయన స్వతహాగా నటుడు, జ్యోతిష్యుడు.. అయితే ఆయన రాధికను ఇల్లు అమ్మవద్దు.. నీకు రాబోయే కాలంలో మంచి భవిష్యత్తు ఉంది అని చెప్పాడు. కానీ రాధిక ఆ మాటలు నమ్మలేదు. ఇల్లు అమ్మకపోతే అప్పులు ఎలా తీర్చాలి అని నంద కుమార్ ను అడిగింది. అప్పుడు రాధిక దృష్టి బుల్లితెరపై పడింది. కష్టం వచ్చింది కదా అని ఇల్లు అమ్మడమా.. లేక కష్టాలను దాటి ముందుకువెళ్ళే ప్రయత్నం చేయాలా అని ముందుకు అడుగులు వేసింది. అలా ఒక సీరియల్ స్క్రిప్ట్ తో ముందుకు సాగింది. ఒకవేళ ఆ ప్రయత్నం కూడా విఫలం అయితే ఉన్న ఆ ఒక్క ఇల్లు కూడా పోయి నడి రోడ్డున పడ్డ ప్రమాదం ఉంది అని సన్నిహితులు హెచ్చరించిన గాని తన మీద తనకు ఉన్న నమ్మకంతో ముందుకు అడుగువేసినది. అలా తన తండ్రి రాధా నాయుడు, కూతురు రేయాన్ పేరుతో కలిపి “రాడాన్” అనే ఒక టెలివిజన్ సంస్థను స్థాపించి సీరియల్స్ తో ముందుకు సాగింది. ఇంకా బుల్లితెరపై రాధిక హవా మొదలైపోయింది. బుల్లితెరపై విజయం సాధించింది. ఇంకా సీరియల్స్ మీద సీరియల్స్ చేస్తూ బాగా బిజీ అయిపోయింది. కేవలం ఒక్క భాషలోనే కాకుండా చాలా భాషల్లో సీరియల్స్ తీస్తుంది. అలాగే పెద్ద పెద్ద నిర్మాతలు సైతం రాధికను చూసి నివ్వెరపోయారు.

అలానే ఏక్తాకపూర్ వంటి నిర్మాతలు కూడా రాధిక టెలివిజన్ రంగం పై దృష్టి పెట్టారు. అయితే అందరికన్నా విజయాన్ని ముందు చూసిన ఘనత ఒక్క రాధిక కి మాత్రమే సొంతం అయింది. దక్షిణాది భాషలన్నీ అయిపోగా, గుజరాతీ భాషల్లో కూడా సీరియల్స్ నిర్మిస్తోంది రాడాన్ సంస్థ. తెలుగులో రెండు సినిమాలు తమిళంలో ఆరు సినిమాలు కూడా తీశారు. త్వరలోనే హిందీలో కూడా అడుగుపెట్టబోతోంది. అలాగే ఇతర దేశాలైన శ్రీలంక, అమెరికా వంటి దేశాల్లో కూడా పలు భాషల్లో అలరించబోతోంది రాడాన్ సంస్థ. ఈ సంస్థ స్థాపించిన నాలుగేళ్లలోనే ఒక కార్పొరేట్ సంస్థగా మారిపోయింది అంటే 1999 లోనే ఒక కార్పొరేట్ సంస్థ గా వ్యవహరిస్తోంది. ఇప్పుడు రాడాన్ సంస్థ 300 కోట్ల ఆదాయాన్ని రాబడుతుంది. అంటే అందులో రాధిక కష్టం ఎంత ఉందో అన్న విషయం అర్థమైపోతుంది. రెండు పెళ్ళిళ్ళతో పూర్తిగా అప్పులపాలై పోయి మళ్లీ విజయాన్ని అందుకున్న ఏకైక నటి రాధిక అని చెప్పడంలో అతిశయోక్తి లేదు,

1995 సంవత్సరంలో ప్రేమకథా చిత్రం సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో శరత్ కుమార్, రాధికను నన్ను పెళ్లి చేసుకుంటావా అని ప్రపోజ్ చేయగా అందుకు నిరాకరించింది. మొదట తాను తీసుకున్న రెండు పెళ్ళిళ్ళ విషయంలో తాను తీసుకున్న తప్పుడు నిర్ణయం గుర్తొచ్చింది. ఈసారి ఏదైనా కానీ తన తల్లి నిర్ణయానికే వదిలేస్తున్నాను అని శరత్ కుమార్ తో చెప్పింది. అలా శరత్ కుమార్ రాధిక తల్లిని ఒప్పించి రాధిక ని పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికీ ఒక బాబు కూడా ఉన్నాడు ఇవన్నీ చూసిన తర్వాత రాధిక మూడు పెళ్లిళ్ల విషయంలో ఎంత కష్టం ఉంది అన్న విషయం ఎవరికైనా అర్థం అవుతుంది. అందుకని పొరపాటున కూడా ఒకరి విషయంలో తొందరపడి ఏలాంటి అభిప్రాయాలకు రాకూడదని రాధిక జీవితమే ఒక సాక్ష్యం. అయితే రాధిక ఇప్పుడు సీరియల్స్ తో పాటుగా, కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటిస్తుంది.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Teenmar Mallanna: సమంత నాగచైతన్య విడాకులకు ఫోన్ ట్యాపింగ్ కారణం: తీన్మార్ మల్లన్న

Published

on

Teenmar Mallanna: తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతుంది. ఈ వ్యవహారంలో భాగంగా సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న ఓ వీడియో ద్వారా ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్ అయినటువంటి సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..నటి ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారని, ఆమెతో భేరసారాలు చేశారని, అది వర్కౌట్‌ కాకపోవడంతో హీరో ఫ్యామిలీకి ఈ వీడియో ఇచ్చేశారని ఆయన వెల్లడించారు. సమంత, చైతూ విడిపోవడంలో ఓ పెద్ద పొలిటికల్‌ లీడర్‌ ప్రమేయం ఉందని వెల్లడించారు.

ఈయన రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా మందుల వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఇలా ఈమె ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వీడియోలను అక్కినేని ఫ్యామిలీకి పంపించడంతోనే అక్కినేని కుటుంబంలో విభేదాలు రావడం నాగచైతన్య తనకు విడాకులు ఇవ్వడం జరిగింది అంటూ తీన్మార్ మల్లన్న తెలిపారు.

Advertisement

పొలిటికల్ లీడర్..
ఈ విధంగా సమంత నాగచైతన్య విడిపోవడం వెనక ఉన్నటువంటి కారణం ఇదే అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక సమంత నాగచైతన్య విషయానికొస్తే వీళ్లిద్దరు విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.

Advertisement
Continue Reading

Featured

Anasuya: పవన్ కళ్యాణ్ గొప్ప లీడర్.. పిలిస్తే జనసేన ప్రచారానికి వెళ్తా: అనసూయ

Published

on

Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేస్తున్నటువంటి పొలిటికల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

sut

ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ నాకు రాజకీయాలంటే అసలు ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ మా నాన్న రాజకీయాలలోకి వెళ్లేవారని నాకు ఇష్టం లేకపోవడంతోనే తనని మాన్పించానని ఈమె తెలిపారు. అయితే నేను కూడా ఈ సొసైటీలో ఉన్నాను కనుక సొసైటీ కి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని ఈమె తెలిపారు.

ఇక మీరు అడిగారు కాబట్టే నేను చెబుతున్నాను ఇలా మాట్లాడితే వివాదం జరుగుతుందని కూడా నాకు తెలుసు కానీ మనం ఓటు వేసేటప్పుడు పార్టీలను చూడకూడదని, నాయకులను మాత్రమే చూడాలని తెలిపారు. ఆ నాయకుడు సమర్థవంతుడా కాదా అనే విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఈమె తెలిపారు. ఇక నా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఒక గొప్ప లీడర్ అని తెలిపారు.

Advertisement

పార్టీని కాదు, నాయకుడిని చూడాలి..
పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే తప్పకుండా నేను జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలకు కూడా వెళ్తాను అంటూ ఈ సందర్భంగా అనసూయ వెల్లడించారు అయితే ఇది నా అభిప్రాయం మాత్రమేనని, ఎవరి అభిప్రాయాలు ఏజెండాలు వారికి ఉంటాయని ఈ సందర్భంగా అనసూయ ఈ సందర్భంగా జనసేన పార్టీకి మద్దతుగా చేసినటువంటి ఈ పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Ananya Nagalla: ఆ హీరో లాంటి భర్త కావాలంటున్న పవన్ హీరోయిన్.. అమ్మడి ఆశలు మామూలుగా లేవు?

Published

on

Ananya Nagalla: అనన్య నాగళ్ళ పరిచయం అవసరం లేని పేరు. ఈమె ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈమెకు తదుపరి పలు సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి. ఇలా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ఈ సినిమా తర్వాత ఈమె వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. ఇటీవల అనన్య నటించిన తంత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా మార్చి 15వ తేదీ విడుదల అయ్యి మంచి సక్సెస్ కావడంతో ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఇలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు. తనకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అనన్య సమాధానం చెబుతూ నాకు కాబోయే భర్త ఎలా ఉండాలి అంటే హాయ్ నాన్న సినిమాలో హీరో నాని క్యారెక్టర్ ఉంది కదా అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అబ్బాయి భర్తగా రావాలని కోరారు.

Advertisement

హీరో నాని..
గ్రీన్ ఫ్లాగ్ అయ్యి ఉండాలి… రిలేషన్షిప్స్ అంటే ఎప్పుడు హ్యాపీగా ఫ్రెండ్స్ లా ఉండాలనీ కోరుకునే అబ్బాయి భర్తగా రావాలి అంటూ ఈమె తనకు కాబోయే భర్తలో ఉన్న క్వాలిటీస్ గురించి ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి. ఇది చూసినటువంటి నెటిజన్ లు అమ్మడికి కోరికలు మామూలుగా లేవుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!