తెలుగు, తమిళ సినిమాలలో తన అభినయంతో ఎంతగానో ఆకట్టుకున్న వ్యక్తి అభినయ. అభినయ పుట్టుకతోనే చెవిటి మరియు మూగ. వారి తల్లిదండ్రులు ఆవిడను ఎలాగైనా మాట్లాడించాలి అనే తపనతో వారి బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర కలిపి ఏకంగా 11 లక్షల వరకు ఆవిడ కోసం అప్పు తీసుకువచ్చి మరి తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నుండి హైదరాబాద్ కు తీసుకువచ్చారు. అక్కడ అభినయ కు స్పీచ్ థెరపీ క్లాసులు కూడా ఇప్పించారు. కానీ అంత డబ్బు ఖర్చు పెట్టిన కానీ అభినయ కు ఎలాంటి ఫలితం లభించలేదు. అభినయ పేరుకు తగ్గట్టుగానే తన నటనలో అభినయం ఏ మాత్రం తగ్గించేది కాదు. అభినయ తన ఏడవ తరగతి లోనే ఓ తమిళ సినిమాలో ఓ చైల్డ్ యాక్టర్ గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది.

అయితే ఆ తర్వాత ఆవిడకి ఎలాంటి సినిమాల్లో నటించడానికి అవకాశం దొరకలేదు. దానికి కారణం ఆవిడ వినలేకపోవడం, మాట్లాడలేకపోవడం. అయితే అభినయ కు నటన పట్ల ఉన్న ఇష్టం కారణంగా అది గ్రహించిన తన తండ్రి అభినయ ను యాడ్స్ లో అయినా నటింపచేయాలని ప్రయత్నాలు చేశాడు. యాడ్స్ లో అయితే మాట్లాడాల్సిన అవసరం ఉండదు కాబట్టి అక్కడ ఆవిడను నటించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఆలా ఆవిడ అనేక యాడ్స్ లో నటించింది. అయితే తన తండ్రికి కూడా నటన పట్ల ఇష్టం ఉండడంతో ఆయన కూడా సినిమాలలో నటించేందుకు ఆర్టిస్ట్ గా ట్రై చేసేవారు. అలా ఆయన వెళ్లిన ప్రతిచోట కూడా తనతో పాటు తన కూతురు ఫోటోలు కూడా వారికి ఇచ్చేవారు. ఫోటోలు ఆమె నువ్వు చూసిన వారు ఈ అమ్మాయి భలే ఉంది అన్న వారు ఆమెకు మాటలు రావు అని తెలిసి ఎంతోమంది ముఖం చిట్లించారు.

ఇదిలా ఉండగా నాదోదిగ‌ల్ అనే సినిమా కోసం ఓ ముంబై యాక్టర్ ను సెలెక్ట్ చేసుకున్నారు. ఆవిడకు తమిళ్ మాట్లాడడం కష్టం కావడంతో ఆ సినిమా నేను చేయను అని వెళ్ళిపోయింది. దీంతో ఆ సినిమా డైరెక్టర్ కోప్పడి ఎలాగైనా సరే అసలు కమ్యూనికేషన్ తెలియని హీరోయిన్ ను తీసుకొచ్చి సినిమాలో నటింపజేయాలని అనుకున్నారు. దీంతో అప్పటికప్పుడు సినిమాల్లోకి అభినయను తీసుకువచ్చి వెండి తెరకు పరిచయం చేశాడు. ఆ సినిమా భారీ హిట్ సాధించింది. ఆ ఒక్క సినిమాకు ఏకంగా 13 అవార్డ్స్ లభించాయి. ఇదే సినిమాను తెలుగులో శంభో శివ శంభో గా తెరకెక్కించారు. ఈ సినిమాలో కూడా హీరో రవితేజ చెల్లెలిగా నటించింది కూడా అభినయనే. ఆ తర్వాత కూడా ఈ సినిమాను కన్నడలో కూడా తెరకెక్కించారు.

ఇకపోతే అభినయ మూగ, చెవిటి కావడంతో ఆవిడ ఇలా నటించే గలిగింది అని మీకు అనుమానం రావచ్చు ఇందుకు గాను ఆవిడ చెప్పాల్సిన డైలాగ్ డైరెక్టర్స్ ముందుగా అభినయ తల్లిదండ్రులకు చెప్పగా వారు తన కుతూరు అభినయకి సైగల ద్వారా వాటిని చేసి చూపిస్తారు. దీంతో సింగిల్ టేక్ లో అభినయ తన డైలాగ్ కు తగిన ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ నటించేది. కేవలం సింగిల్ టేకులు అభినయ తన డైలాగ్ కు తగ్గ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి ఆ పాత్రలో ఒదిగిపోయింది. ఆవిడ నటించిన మొదటి సినిమాకే అటు తమిళ ఇటు తెలుగు లో కలిపి ఆవిడకు రెండు ఫిలిం ఫేర్ అవార్డులను దక్కించుకుంది. అభినయ శంభో శివ శంభో చిత్రం తర్వాత దమ్ము, డమరుకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లో కూడా నటించి తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here