కృష్ణాజిల్లా మచిలీపట్నానికి దగ్గర బందరు గ్రామంలో కోటయ్య, గంగమ్మల తొమ్మిదవ సంతానంగా నిర్మలమ్మ జన్మించారు. ఆమెకు చిన్నప్పటి నుంచి నాటకాలు వేయడం అంటే చాలా ఇష్టం. పదో తరగతి వరకు చదువుకుంటూ నాటకాలు వేస్తూ ఉండేది. నాటకాలు వేయడం కోసం మగరాయుడిలా తిరుగుతున్నావని ఆమె తల్లిదండ్రులు తరచూ అనేవారు. కానీ నిర్మలమ్మ నాటకాలపై ఇష్టంతో అది ఏమీ పట్టించుకునేది కాదు. ఆమె పెదనాన్న నాటకాలు వేయడం వలన అప్పుడప్పుడు అతని సపోర్ట్ కూడా ఆమెకు దొరికేది.

యవ్వన దశ వచ్చేసరికి అందగత్తెగా ఉండగా ఆమె మంచి నటిగా ఎదగాలి అనుకున్నారు. రామాయణం, మహాభారతం, పురాణాలు ఎప్పుడూ చదువుతుండేది, పద్యాలు చదవడం, రాయడం వచ్చాక ఇక చదవడం అనవసరమని పదవ తరగతి పూర్తి చేశారు. నాటకాలు వేస్తున్న సమయంలో సినిమాల్లోకి వెళ్లి హీరోయిన్ గా నటించాలని ఉండేది. కానీ మద్రాస్ వెళ్లి సినిమా ప్రయత్నాలు ఎలా చేయాలో అర్థం కాలేదు. అప్పట్లో నాటకాలు చూసి దర్శకులు తమ సినిమాకి నటీ నటులను ఎంపిక చేసుకునే వారు. అలా గరుడ గర్వభంగం సినిమా తీస్తున్న బలరామయ్య నూతన నటీనటుల కోసం బెజవాడ రావడంతో అక్కడ నిర్మలమ్మ వేస్తున్న నాటకం చూసారు.

అలా తన సినిమాలో చెలికత్తె పాత్రకు నిర్మలమ్మను ఎంపిక చేసుకున్నారు. నిర్మలమ్మ తన పదహారవ యేట నటించిన గరుడ గర్వభంగం 1943లో విడుదలయింది. ఆ తరువాత 1944లో పాదుకా పట్టాభిషేకం సినిమా లో నటించారు. ఎంతో ఆసక్తితో నిర్మలమ్మ సొంతూరు నుంచి బెజవాడ వెళ్లి ఆ సినిమా చూశారు. కానీ నిర్మలమ్మ పాత్రను ఎడిటింగ్ లో తీసివేయడంతో ఆమె చాలా బాధ పడ్డారు. ఇక సినిమాల్లో నటించకూడదని నాటకాల పై దృష్టి సారించాలి అనుకున్నారు. ఆ తర్వాత కరువు రోజులు అనే నాటకాన్ని చూసిన అలనాటి బాలీవుడ్ నటుడు పృథ్వీరాజ్ కపూర్ నువ్వు ఎప్పటికైనా గొప్ప నటివి అవుతావని మెచ్చుకున్నారు.

1954లో ఆదుర్తి సుబ్బారావు అక్కినేని నాగేశ్వరరావుతో ఆడపెత్తనం సినిమా తీయడం కోసం హీరోయిన్ గా నిర్మలమ్మను అడిగారు. కానీ నిర్మలమ్మ చేదు అనుభవాలతో నేను నటించనని చెప్పారు. అయితే నాగేశ్వరరావు జోడిగా ఆ సినిమాలో అంజలి దేవి ని తీసుకున్నారు. ఆడపెత్తనం సినిమా ఘన విజయాన్ని సాధించింది. అంజలీదేవికి ఆ సినిమా మంచి పేరు తీసుకువచ్చింది. ఆ తర్వాత విజయవాడ వచ్చే సినీ నటీనటుల కోసం ప్రజలు తండోపతండాలుగా రావడం చూసి తాను మళ్లీ సినిమాల్లో నటించాలని నిర్మలమ్మ అనుకున్నారు. అలా వెళ్లి ప్రయత్నం చేస్తే అక్క, వదిన, చెల్లి, తల్లి వంటి పాత్రలు వచ్చాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here