ముప్పలనేని శివ మంచి సాంప్రదాయమైన మరియు ప్రేమకథా చిత్రాలను తెలుగు తెరకు అందించిన దర్శకుడు. కోదండరామిరెడ్డి, ముత్యాల సుబ్బయ్య వంటి దర్శకుల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా ముప్పలనేని శివ దాదాపు ఇరవై చిత్రాలకుపైగా పనిచేసారు. అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, చిరంజీవి లాంటి సీనియర్ హీరోలను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు అబ్జర్వ్ చేసేవాడు. ఆ క్రమంలో ఆయన అనేక సినిమాలు చేస్తూ దర్శకత్వ అవకాశం కోసం చూస్తున్న తరుణంలో ముప్పలనేని శివ 1994లో కృష్ణ, మాలాశ్రీ హీరో, హీరోయిన్లుగా ఘరానా అల్లుడు చిత్రాన్ని రూపొందించారు.

తర్వాత మంచి ఉద్విగ్న భరితమైన ప్రేమ కథ రాసుకొని దానిని పెద్ద బ్యానర్లో తీద్దామని అనుకున్నారు. ఆ క్రమంలో లో వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీదత్ కి ఆ కథ వివరించడం జరిగింది. కథ విన్న అశ్వినీ దత్ గారికి నచ్చిన.. తాను పెద్ద హీరోలతో చేస్తున్నానని ఈ కథ అప్ కమింగ్ హీరోస్ కి పనికి వస్తుందని చెప్పారు. వీలుంటే మంచి బ్యానర్ లో చేయమని సలహా ఇచ్చాడు. ప్రేమ్ నగర్ తీసిన సురేష్ ప్రొడక్షన్స్ మించిన బ్యానర్ ఏముంటుందని డి.రామానాయుడు గారిని ముప్పలనేని శివ కలిశారు. ఆ క్రమంలో ఆ స్టోరీ విన్న రామానాయుడు చాలా ఉత్సాహాన్ని చూపారు.

అప్పుడు వెంటనే హీరో వెంకటేష్ కి ఫోన్ చేసి ఈ కథ గురించి చెప్పగా అది అప్ కమింగ్ హీరోస్ కి బాగా సూట్ అవుతుందని.. కావున కొత్తవాళ్లతో తీయమని డి. రామానాయుడు కు చెప్పారు. తాను ఇది వరకే ప్రేమ ఖైదీ చిత్రాన్ని హరీష్ తో చేయడం వలన ఈ కొత్త లవ్ స్టోరీ కి హరీష్ బాగుంటాడని డి. రామానాయుడు, ముప్పలనేని శివ కు సలహా ఇచ్చారు. కానీ అంతకుముందే హీరో హరీష్ కొండపల్లి రత్తయ్య చిత్రంలో నటించిన ఆ సినిమా పెద్దగా ఆడలేదు. కావున శ్రీకాంత్ అయితే బాగుంటుందని ముప్పలనేని శివ నిర్మాత రామానాయుడుకు చెప్పారు. అప్పుడే ఇండస్ట్రీకి శ్రీకాంత్ కొత్త కావడంతో ఆయనను ఒకసారి తీసుకు రమ్మని చెప్పగా తీవ్రమైన టైఫాయిడ్ జ్వరంతో ఉన్న శ్రీకాంత్ ఇంటి నుంచి కార్ లో రామానాయుడు స్టూడియో కి తీసుకువెళ్లారు. శ్రీకాంత్ ను చూసిన రామానాయుడు మన సినిమాకు సరిపోతాడని ఆయనకు జ్వరం తగ్గిన తర్వాత సినిమా మొదలు పెడదామని చెప్పారు.

అలా అప్పటి వరకు ఎలాంటి బ్రేకుల్లేని శ్రీకాంత్ కి తాజ్ మహల్ 1995 మేలో విడుదలై ఘన విజయాన్ని సాధించడంతో… వైజయంతి మూవీస్, గీతాఆర్ట్స్ కలయికలో 1996లో పెళ్లి సందడి సినిమా విడుదలై ఏకంగా బ్లాక్ బస్టర్ సాధించింది. ఆ తర్వాత గిల్లికజ్జాలు, వినోదం, ప్రేయసి రావే, ఖడ్గం, ఆపరేషన్ దుర్యోధన లాంటి హిట్ చిత్రాలతో శ్రీకాంత్ దూసుకు వెళ్లడానికి కేవలం తాజ్ మహల్ సినిమానే పునాదిగా పేర్కొనవచ్చు. ఒకవేళ ఈ తాజ్ మహల్ సినిమా హరీష్ చేసి ఉంటే ఆయన భవిష్యత్ ఎలా ఉండేదని ఒక విశ్లేషణ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here