పరుచూరి బ్రదర్స్ రాసిన కథతో వచ్చిన ప్రతిధ్వని బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. ఊర్వశి శారద ప్రధాన పాత్రలో, యాక్షన్ కింగ్ అర్జున్ సపోర్టింగ్ రోల్ లో ప్రతిధ్వని సినిమాను ప్రేక్షకులు ఆదరించడంతో.. అప్పటికే సూర్య మూవీస్ అధినేత ఎ.ఏం.రత్నం విజయశాంతికి పర్సనల్ మేకప్ మేన్ గా పనిచేస్తుండేవాడు. ఆ క్రమంలో పరుచూరి బ్రదర్స్ కనబడినప్పుడు మా మేడం విజయశాంతి కూడా అలాంటి లేడీ ఓరియెంటెడ్ పాత్రతో కూడిన ఒక భిన్నమైన కథని రాయవలసిందిగా ఆయన కోరడం జరిగింది. అలా నాలుగు సంవత్సరాల తర్వాత పరుచూరి బ్రదర్స్ ను ఏ.ఎమ్.రత్నం మరొకసారి కలిసినప్పుడు మా మేడం కథ ఏమైందని అడగగా సరే ఒక కథ రాస్తామని ఎ.ఎం రత్నంతో చెప్పడం జరిగింది.

అప్పుడు ఎ.ఏం రత్నం తన స్నేహితుడైన మోహన్ గాంధీ కి విషయం చెప్పగా ఆయన పరుచూరి బ్రదర్స్ రాసిన కథతో సినిమా తీస్తానని చెప్పడం జరిగింది. సినీ ప్రముఖులు శ్రేయోభిలాషులు లేడి ఓరియెంటెడ్ కథతో సినిమా తీస్తే ఆడుతుందా అని సందేహించారు. అయినా కూడా ఎ.ఎం రత్నం ఎవరి మాటలు లెక్కచేయకుండా విజయశాంతి మీద ఉన్న నమ్మకంతో పరుచూరి బ్రదర్స్ రాసిన కథను ఆమెకు వినిపించారు. మరి కొంతమంది సినీ ప్రముఖులు కథ బాగుంది విజయ శాంతి కాకుండా ఒక స్టార్ హీరోని పెట్టుకొని కర్తవ్యం సినిమా తీయమని సలహా ఇచ్చారు. అయినా ఏ.ఎం రత్నం పట్టు వదలని విక్రమార్కుడిలా విజయశాంతిని ప్రధాన పాత్రలో పెట్టి సినిమా తీయడానికి ముందుకు వచ్చారు. అలా1989 చివరి మాసంలో మద్రాసులో ముహూర్తపు షాట్ ను తీశారు. దీనికి అప్పటి ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ క్లాప్ కొట్టారు.

అలా దర్శకుడు మోహన్ గాంధీ దాదాపు యాభై రెండు రోజుల్లో సినిమాను పూర్తి చేయడం జరిగింది. కర్తవ్యం సినిమా లో విజయశాంతితో పాటు ఒక సపోర్టింగ్ రోల్ లో ఒక హీరో ని పెట్టాలనుకున్నారు. కానీ ఇప్పుడున్న హీరోల్లో సపోర్టింగ్ రోల్ అంటే ఎవరు ముందుకు రాలేదు. ఆ క్రమంలో కొన్ని చిత్రాల్లో హీరోగా చేస్తున్న వినోద్ కుమార్ కర్తవ్యం సినిమాలో సపోర్టింగ్ రోల్ చేయడానికి ఒప్పుకోవడం జరిగింది. అయితే కర్తవ్యం విడుదలయ్యే సమయానికి మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి హీరోహీరోయిన్లుగా వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా విడుదలై 50 రోజులు పూర్తి చేసుకుంది. ఆ క్రమంలో కర్తవ్యం సినిమాను కొనడానికి బయ్యర్లు అంతగా ఆసక్తి చూపలేదు.

అలా మెల్లిగా కథ బాగుండడంతో ప్రేక్షకులతో సినిమా థియేటర్లు నిండిపోయాయి. విజయశాంతి రెమ్యూనరేషన్ కాకుండా దాదాపు 50 లక్షలతో కర్తవ్యం సినిమా పూర్తి చేశారు. ఆ తర్వాత సినిమాకి మూడు కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. కర్తవ్యం సినిమా 100 రోజుల ఫంక్షన్ ని మద్రాసులోని విజయ మహల్ లో నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేడీ,బాలక్రిష్ణ లాంటి వారు హాజరయ్యారు.చిరంజీవితో గ్యాంగ్ లీడర్ లోని “భద్రాచలం కొండ సీతమ్మ వారి అండ..అనే పాట షూటింగ్ జరుగుతున్నప్పుడు.. కర్తవ్యం సినిమాలో విజయశాంతి ఉత్తమ నటనకు జాతీయ అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.ఈ సినిమా తర్వాత విజయశాంతికి ఇండియన్ లేడీ సూపర్ స్టార్,లేడీ అమితాబ్ అనే బిరుదులు రావడం జరిగింది.ఈ సినిమా చూసిన ఆడవాళ్ళు ఎంతోమంది పోలీస్ ఆఫీసర్లు కావాలని నిర్ణయించుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here