తెలుగు సినీ పరిశ్రమలో చాలామందికి నటించే టాలెంట్ ఉన్న కానీ, వారికి అవకాశాల్లేక మరుగున పడిపోయిన వారు ఎందరో. ఇలా టాలెంట్ కలిగి ఉండి, కేవలం సపోర్టింగ్ రోల్స్ కు మాత్రమే నటించిన వారిలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రసాద్ బాబు కూడా ఒకరు. ఈయన ఎన్నో సినిమాల్లో విలన్ గా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు.

అంతేకాదు కొన్ని బుల్లితెర అ సీరియల్స్ లో కూడా నటించాడు. ఈయన టాలీవుడ్ పరిశ్రమలో మొట్టమొదటిసారిగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో పాటు ఈయనకు కూడా పునాది రాళ్లు మొదటి సినిమా. ప్రసాద్ బాబు చిరంజీవి మంచి మిత్రులు కూడా. అయితే ప్రసాద్ బాబు కేవలం మంచి క్యారెక్టర్ ఉన్న సినిమాల్లో మాత్రమే నటించే వారు. అంతే కాదు చిరంజీవి నటించిన చాలా చిత్రాలకు లో ప్రసాద్ నటించారు. చిరంజీవితో పాటు యముడికి మొగుడు, రుద్రవీణ, జేబుదొంగ వంటి సినిమాలలో సపోర్టింగ్ క్యారెక్టర్ లను ఆయన నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు.

ఇక ఈయన పర్సనల్ జీవితం విషయానికొస్తే.. ఈయన మార్చి 29, 1950 లో ఒంగోలు లో జన్మించారు. ఈయన తెలుగు, తమిళ సినిమాల్లో అనేక సహాయ పాత్రల్లో నటించారు. ఏకంగా 700లకు పైగా సినిమాల్లో నటించాడంటే అసలు నమ్మలేము. ఈయన ఎన్నో నాటకాలు వేసిన తరువాత అందరిలాగే సినిమా రంగం వైపు ఉన్న మక్కువ తో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ముందుగా ఆయన సినీ ఇండస్ట్రీలో చిన్న చిన్న క్యారెక్టర్ రోల్స్ చేస్తూ… ఆ తర్వాత విలన్ క్యారెక్టర్ చేసే స్థాయికి చేరుకున్నారు. ఈయన నటించిన సినిమాలలో యముడికి మొగుడు, జేబుదొంగ, త్రినేత్రుడు, అంతులేని కథ, కృష్ణావతారం, నేటి గాంధీ, రుద్రవీణ, ఘటోత్కచుడు, మురారి ఇలా అనేక తెలుగు సినిమాల్లో తన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఈయన మురారి సినిమాలో మహేష్ బాబు కి అన్న పాత్రలో నటించి మంచి గుర్తింపును పొందారు. ఈయన కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా బుల్లితెరపై కూడా నటన చేశారు. చిన్న కోడలు, రాములమ్మ, జయం లాంటి సీరియల్స్ ఈయన బుల్లి తెరపై నటించారు.

ఈయన కుటుంబంలో కొడుకు, కోడలు కూడా స్టార్ నటులే. ప్రసాద్ బాబు కు ఓ కొడుకు, ఓ కూతురు ఉన్నారు. కొడుకు పేరు శ్రీకర్. ఈయన తమిళ్, తెలుగు సీరియల్స్ లో నటించారు. అంతేకాదు తమిళంలో అనేక సినిమాల్లో కూడా హీరోగా నటించి మంచి పేరు పొందాడు.

ఇకపోతే శ్రీకర్ భార్య కూడా హీరోయిన్. ఆమె పేరు సంతోషి. ఈమె టాలీవుడ్ లో మొదటగా తేజ డైరెక్షన్లో వచ్చిన ‘ జై ‘ సినిమా లో నవదీప్ సరసన హీరోయిన్ గా నటించారు. ఆ తర్వాత నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఒక్కడే, బంగారం, ఢీ సినిమాలలో ఈవిడ నటించారు. అంతేకాదు ఈవిడ తెలుగు బుల్లితెరపై ప్రసారమైన నెంబర్ 23 మహాలక్ష్మి నివాసం సీరియల్ లో కూడా ప్రధాన పాత్రలో నటించింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా అనేక సీరియల్స్ లో నటించి అక్కడి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. వీరిద్దరికీ ఒక పాప కూడా ఉంది. వీరిద్దరు దంపతులు ఇప్పటికి కూడా కొన్ని సీరియల్స్ లో నటిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here