గుమ్మడికాయంత కష్టపడ్డా కూడా.. కనీసం ఆవగింజంత అదృష్టం ఉండాలన్నారు. నిజంగా ఇది సినీరంగంలో నటీనటులకు వర్తిస్తుందేమో అనిపిస్తుంది. కాళ్లకున్న చెప్పులరిగేలా తిరిగినా సినిమా అవకాశాలు దొరకని నటీనటులు ఎంతో మంది ఉన్నా.. కడుపులో చల్ల కదలకుండా అవకాశాలు దక్కించుకున్న వారు కూడా ఉన్నారు. అలాంటి కోవలోకే అలనాటి నటుడు జి.వి.నారాయణ రావు వస్తారు. సినిమాల్లో పుట్టి సినిమాల్లో పెరిగిన జీ.వి.నారాయణ రావు తండ్రి విజయవాడలో నవయుగ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థను 1947లో ఏర్పాటు చేయడం జరిగింది. అలా దాదాపు కొన్ని వందల సంఖ్యలో తెలుగు సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశారు. అక్కినేని నాగేశ్వరరావు చిత్రాలు దాదాపు 90 శాతం నవయుగ సంస్థ వారే డిస్ట్రిబ్యూట్ చేయడం గమనార్హం.

అలా జి.వి. నారాయణరావు కుటుంబం 1964 ప్రాంతంలో హైదరాబాద్ వచ్చి అక్కడ అమీర్ పేటలో సారథి స్టూడియోను నిర్మించారు. అక్కడే నారాయణ రావు తన కాలేజీ విద్యను మెహబూబా కాలేజీలో పూర్తి చేశారు. అలా చదువుకుంటున్న సమయంలోనే నారాయణరావు రవీంద్రభారతిలో నాటకాలు వేస్తూండేవాడు. అలా నటనలో శిక్షణ కోసం మద్రాసులో స్థాపించిన మద్రాస్ ఫిల్మ్ ఛాంబర్ లో యాక్టింగ్ కోర్సును రజినీకాంత్, ప్రదీప్ శక్తి, హేమా చౌదరి, నాజర్ లతో పూర్తి చేశారు. అయితే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో శిక్షణ తీసుకుంటున్న సమయంలోనే దర్శకుడు కె.బాలచందర్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ కి వెళ్లి తాను తీయబోయే తెలుగు సినిమాకి రజినీకాంత్, జీ.వి.నారాయణ రావులను ఎంపిక చేసుకోవడం జరిగింది.

అలా కె.బాలచందర్ దర్శకత్వంలో 1976లో విడుదలైన అంతులేని కథ అనే చిత్రంలో రజనీకాంత్ జి.వి.నారాయణరావు జయప్రద హీరో, హీరోయిన్లుగా నటించారు. ఇది ఎన్టీ రామారావు, వాణిశ్రీ లు హీరోహీరోయిన్లుగా నటించిన ఆరాధన చిత్రానికి పోటీగా విడుదల అయ్యింది. అయిన ఇది కథ కాదు సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయింది.

‌‌ఈ సినిమాలో నటించినందుకు జీ.వి నారాయణరావుకు ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది. ఆ తర్వాత ఈరంకి శర్మ దర్శకత్వంలో చిలకమ్మ చెప్పింది అనే సినిమాలో మళ్లీ రజనీకాంత్, నారాయణరావు కలిసి నటించారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమాకు ఏకంగా 7 ఉత్తమ అవార్డులు వచ్చాయి. అయితే అంతులేని కథ సినిమాలో “తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల” పాటకి నారాయణ రావు నటించడం జరిగింది. ఇప్పటికీ పెళ్లి వేడుకల్లో మిమిక్రీ కళాకారులు సైతం ఈ పాటనే మిమిక్రీ చేయడం జరుగుతుంది.

అయితే అంతులేని కథకు రజినీకాంత్ 1000 రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటే, నారాయణరావు 1500 రెమ్యూనరేషన్ తీసుకోవడం గమనార్హం. ఆ తర్వాత నారాయణరావు కొన్ని సినిమాల్లో హీరోగా నటించిన అప్పటికీ అవి నారాయణరావును ఒక మాస్ హీరోగా నిలబెట్టలేకపోయాయి. ఆ తరువాత స్టార్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ.. 1997లో విడుదలైన హిట్లర్ సినిమాలో ఓ చిన్న క్యారెక్టర్ వేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో నారాయణరావు బుల్లితెరపై కొన్ని సీరియల్స్ లో కనిపిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here