సినీ పరిశ్రమలో ఎవరి స్టార్ ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం. రాత్రికి రాత్రే ఓవర్ నైట్ స్టార్స్ అయిన వాళ్ళు ఉన్నారు.. ఎన్ని సినిమాలు నటించినా గుర్తింపు రాని వాళ్ళు ఉన్నారు. అతి తక్కువ సినిమాలతో కూడా క్రేజ్ సంపాదించిన వాళ్ళు ఉన్నారు. దశాబ్దాల కాలంగా సినిమా పరిశ్రమను ఏలిన వాళ్ళు ఉన్నారు. అంతేకాదు కుటుంబ సభ్యుల కారణంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ మానసిక వేదన అనుభవించిన వారు ఉన్నారు.. అందుకే సినిమా పరిశ్రమలో ఎవరి పరిస్థితి ఎలా ఉంటుంది అనేది చెప్పలేం. ఇక్కడ సీనియర్ నటి మనోరమ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

డబ్బింగ్ సినిమాలతో మనోరమ తెలుగు వారికి సుపరిచితమే.. తెలుగులో అతి తక్కువ సినిమాల్లో నటించింది. ఇక తమిళంలో అయితే ఏకంగా నలుగురు సీఎంలతో కలిసి పనిచేసిన ఏకైక నటీ మనోరమ. తెలుగులో అరుంధతి సినిమా మంచి గుర్తింపు తెచ్చింది.. అరుంధతి సినిమాలో డైరెక్టర్ కోడి రామకృష్ణ వద్దని చెప్పినా ప్రొడ్యూసర్ శ్యాంప్రసాద్ రెడ్డి పట్టుపట్టి మరీ ఆమెతో క్యారెక్టర్ చేపించారు. ఆ సినిమాలో ఆమె క్యారెక్టర్ ఎంత కేలకమో మనందరికీ తెలిసిందే.

నటి మనోరమ తెలుగులో నటించింది కొన్ని సినిమాలే అయినా తమిళంలో మాత్రం చాలా సినిమాల్లో నటించింది. సూపర్ స్టార్ రజనీకాంత్ ఆమెను అమ్మా అని ఏంతో గౌరవంతో సంభోదిస్తారు. అయతే వయస్సు మీదపడంతో అనారోగ్యం పాలైన మరోనరమ 2015 వ సంవత్సరంలో మరణిచారు. ఆమె సినీ ప్రస్థానంలో వివాదరహితురాలుగా మంచి పేరు సంపాదించుకున్న మనోరమను ఆస్థి కోసం సొంత మనవరాలే కోర్టుకు ఈడ్చింది. అలా మనోరమ చివరి దశలో కోర్టు చుట్టూ తిరుగుతూ అనారోగ్యంతో మరణిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here