టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదివరకు కఠినమైన అత్తగా ఎన్నో మరుపురాని పాత్రలు పోషించిన వ్యక్తిగా సూర్యకాంతం ఎలాంటి పాత్రలు పోషించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే అలాంటి క్యారెక్టర్స్ బాలీవుడ్ లో పోషించిన వ్యక్తి లలితా పవర్. భారతదేశ టెలివిజన్ చరిత్రలో ఎన్నో మరపురాని ఘట్టాలను నమోదు చేసిన రామాయణం సీరియల్ లో మందార పాత్రను ఆవిడ అద్భుతంగా పోషించారు. అది ఎంతలా అంటే రాముడిని అడవులకు పంపించిన నేపథ్యంలో ఆ సీరియల్ చూస్తున్న ప్రేక్షకులు అందరూ ఆవిడ పై కక్ష పెంచుకునేలా ఆవిడ నటనను ప్రదర్శించింది అంటే ఆవిడ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం విలన్ పాత్రలను మాత్రమే కాకుండా అమ్మ, అలాగే ఇంట్లోనే ఉన్న వ్యక్తిగా ఇలా ఏ పాత్ర వేసినా పూర్తిగా అందులో ఒదిగిపోయి క్యారెక్టర్ చేసే వ్యక్తిగా ఆవిడ పేరు తెచ్చుకున్నారు.
ఈవిడ అసలు పేరు అంబిక. ఈవిడ సొంత ఊరు ఇండోర్. ఇక ఈ వీడియో చిన్న వయసులోనే వారి కుటుంబం పూణే నగరానికి చేరుకున్నారు. తన ఏడు సంవత్సరాలు ఉన్న సమయంలో పూణే నగరంలో ఉన్నప్పుడు వారు ఉన్న ఏరియాలో సినిమా షూటింగ్ జరుగుతున్న సమాచారం అందుకున్న ఆవిడ వెంటనే పరుగు తీసి ఆ షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి పోయింది. అక్కడికి వెళ్లి షూటింగ్ చేస్తున్న సమయంలో ఆ సినిమా దర్శకుడి కంట ఆ చిన్న అమ్మాయి పడింది. దీంతో ఆవిడ ఆ సినిమాలో ఓ చిన్న పాత్రను పోషించింది. అయితే అది కేవలం మూకీ సినిమా మాత్రమే. దీంతో ఆవిడ సినీ ప్రస్థానం మొదలైంది. 1928 సంవత్సరంలో ఉమెన్ అనే మూకీ సినిమాతో తన సినీ ప్రస్థానం మొదలు పెట్టింది. ఇక అక్కడి నుంచి ఆమె వెనక్కి తిరిగి చూడకుండా టాకీ మొదలైనప్పుడు కూడా అనేక సినిమాలను చేసింది. అయితే సినిమాల్లోకి వచ్చాక అంబిక అనే పేరును లలిత గా మార్చుకుంది. ఒకానొక సమయంలో బాలీవుడ్ లో లలిత సినిమా లో ఉంటే భారీ హిట్ సాధిస్తుందని హీరోలు అలాగే దర్శక నిర్మాతలు భావించారు.
అయితే హీరోయిన్ గా ఆవిడ టాప్ హీరోయిన్ గా సమయంలో ఆవిడకు ఓ దారుణ సంఘటన ఎదురైంది. దీంతో ఆవిడ జీవితం పూర్తిగా మారిపోయింది. 1942 లో భగవాన్ అనే కొత్త యాక్టర్ తో కలిసి నటిస్తున్న సమయంలో సినిమా షూటింగ్ లో నేపథ్యంలో హీరో హీరోయిన్ ని ఓ చెంపదెబ్బ కొట్టాలి. అయితే హీరో కొత్త వ్యక్తి కావడంతో దెబ్బలు ఎలా కొట్టాలో తెలియకపోవడంతో నిజంగానే అతడు చెంప దెబ్బను చాలా గట్టిగా కొట్టాడు. దీంతో లలితా పవర్ సినిమా సెట్టింగ్ లోనే కళ్లు తిరిగి పడిపోయింది. ఆ దెబ్బకు ఆవిడకు కంట్లోని నరం చిట్లింది. అలాగే ముఖానికి పాక్షికంగా పక్షవాతం కూడా వచ్చింది. ఆవిడ పరిస్థితుల నుంచి కూడా మూడు సంవత్సరాల సమయం పట్టింది. అలా మూడు సంవత్సరాల తర్వాత చూస్తే ఆవిడ ఎడమ కన్ను పూర్తిగా ఓ మెల్లకన్ను లాగా మారిపోయింది. దీంతో ఆవిడకి హీరోయిన్ ఛాన్సులు పూర్తిగా తగ్గిపోయాయి. దాంతో లలిత హీరోయిన్ పాత్రలకు పనికిరాకుండా పోయారు. అయితే పరిస్థితులు బాగా ఉన్న సమయంలో సినీ నిర్మాత గణపతి రావు పవర్ ను పెళ్లి చేసుకుంది. అయితే కొద్దీ కాలానికే తన భర్త చెల్లితో సంబంధం కొనసాగించడంతో ఆవిడ ఆయనతో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత మరో నిర్మాత రాజ్ కుమార్ గుప్తా రెండో వివాహం చేసుకున్నారు. వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదుడుకులు, హీరోయిన్ స్థాయి పోవడంతో ఆవిడ దిగులు చెందకుండా 1960 దశకంలో వచ్చిన సినిమాలలో ఆవిడ ఎన్నో మరుపురాని పాత్రలు పోషించింది.
కొన్ని సినిమాలలో క్రూరమైన అత్తగా నటించి ప్రేక్షకుల ఆదరణ పొందింది. అలా 1960 దశకం నుండి 1990 దశకం వరకు ఆవిడ వివిధ సినిమాలలో క్యారెక్టర్ రోల్స్ వేస్తూ తన జీవితం కొనసాగింది. 1990లో వచ్చిన భాయ్ అనే సినిమా ఆవిడ కు చివరి సినిమా. 1942 లో జరిగిన కంటి సంఘటన తన నట జీవితానికి దాదాపు 50 సంవత్సరాలపాటు వేదనకు గురి చేసింది. కంటి లోపల నరాలు చిట్లి పోవడంతో కంటి చూపు చాలా వరకు తగ్గి, అలాగే భయంకరమైన నొప్పి కూడా ఆమె అనుభవించేది. దీంట్లో ఒకానొక సమయంలో ఆవిడకు షూటింగ్ లో వేసి లైటింగ్ ఎఫెక్ట్స్ వల్ల ఆవిడ ఇబ్బందులు ఎదుర్కోలేక సినిమాలు చేయలేక అనేక సమస్యలను ఎదుర్కొనేవి. దీంతో ఆవిడ సినిమా దర్శకుల నుంచి ఆఫర్స్ అందుకున్న కానీ వారికి నో చెప్పడానికి కష్టంగా ఉండటంతో చివరకు ఆవిడ బొంబాయి నగరం నుండి వదిలి పూణే నగరానికి చేరుకుంది. అప్పటికే ఆవిడకు 77 సంవత్సరాలు వచ్చాయి. దీంతో ఆవిడ కెరియర్ పూర్తిగా ముగిసిందని చెప్పవచ్చు. పూణే నగరానికి చేరుకున్న తర్వాత ఆవిడను ఎవరు పట్టించుకునే వారు కూడా కాదు. ఆ కుటుంబంలో భర్త, కొడుకు కోడలితో ఒక అందమైన జీవితాన్ని మొదలు పెట్టింది. ముంబై నగరం వదిలి రావడంతో ఆమె కు పూర్తిగా పలకరించేవారు కూడా కరువయ్యారు. అయితే ఆ వయసులో కూడా తన భర్తకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే మాత్రమే ముంబై నగరానికి ఆవిడ వచ్చేది.
చివరికి ఆవిడ చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారి తన భర్త ముంబై నగరానికి వచ్చి చికిత్స కోసం నాలుగైదు రోజులు ఉండాల్సిన పరిస్థితి కూడా ఉండేది. ఆ సమయంలో ఒంటరిగా ఆవిడ పూణే నగరంలో ఇంట్లో జీవనం కొనసాగించింది. ఆ సమయంలో ఆవిడ తలుపు తీసి బయటకు కూడా వచ్చే వ్యక్తి కాదు. అలా తన భర్త ఒక సారి తన చికిత్స కోసం ముంబై నగరానికి వెళ్లి రెండు రోజుల తర్వాత వచ్చి చూడడంతో ఇంట్లో విగత జీవిగా పడి ఉండటం ఆయన గమనించారు. దీంతో ఆవిడను పరీక్షించడానికి వచ్చిన వైద్యులు ఆవిడను పరీక్షించి ఆమె చనిపోయిన దాదాపు రెండు రోజులు అయి ఉంటుందని వారు తేల్చారు. నీ జీవితంలో తన ఒంటరి ప్రయాణం కు అలవాటు పడిన ఆవిడ ఎవరికీ సమాచారం ఇవ్వకపోవడంతో చివరికి తన ఇంట్లోనే ఎవరు లేని సమయంలో ఎన్ని ఇబ్బందులు నడుమ ఆవిడ కన్నుమూసింది.
ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…
దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…
జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…
ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…
ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…
విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…