టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది ఎన్నో సినిమాల్లో నటించిన కానీ, చివరికి సంపాదన మాత్రం లేకుండా ఎంతో మంది ఇబ్బందులు పడిన వారిని మనం చాలా మందినే చూశాం. అయితే కేవలం తెలుగులోనే మాత్రం కాకుండా మిగతా భాషల్లో కూడా వివిధ సినిమాల్లో వివిధ క్యారెక్టర్లు వేస్తూ పేరు అంతగా లేకపోయినా సంపాదన గడించిన వారు ఎందరో ఉన్నారు కూడా. ఇక అసలు విషయంలోకి వెళితే.. మెగాస్టార్ స్నేహితుడు కమెడియన్ సుధాకర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కమెడియన్ సుధాకర్ తమిళ భాషలో ఒకానొక సమయంలో స్టార్ హీరోగా చేసిన వ్యక్తి. ఒకవైపు తమిళంలో హీరోగా నటిస్తూనే మరోవైపు తెలుగులో స్టార్ కమెడియన్ గా ఎదిగారు.

ఇక ఈయన ఫిబ్రవరి 1,1956 సంవత్సరంలో జన్మించారు. ఈయన స్వస్థలం ప్రకాశం జిల్లాలోని మార్కాపురం. సుధాకర్ తండ్రిగారు రత్నం. ఈయన ఓ డిప్యూటీ కలెక్టర్. తల్లి పేరు కటాక్షమ్మ. ఈ ఇరువురి దంపతులకు మొత్తం ఏడు మంది మగ సంతానం. ఇందులో సుధాకర్ చివరి వ్యక్తి. తండ్రి ఉద్యోగంలో విధులు నిర్వర్తించడానికి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహించడం కారణంగా ఆయన తన కుటుంబాన్ని తీసుకోని వెళ్లి అక్కడ వివిధ ప్రాంతాలలో విధులు నిర్వహించారు. ఇందులో భాగంగానే కర్నూలు జిల్లా కోవెలకుంట్ల లో సుధాకర్ జన్మించారు. ఆయన బాల్యం మొత్తం కోవెలకుంట్ల, ఆదోని, కోడుమూరు, కర్నూల్, బోధన్, కాకినాడ మొదలగు ప్రాంతాలలో గడిచింది. ఆయన విద్యాభ్యాసం ఎక్కువగా ఏలూరు, గుంటూరు లో జరిగింది. ఇక తను సినిమా మొదటి రోజుల్లో చిరంజీవి, హరి ప్రసాద్, నారాయణరావు లతో కలిసి ఒకే గదిలో నివసించేవారు. అలా మొదట్లో సినిమాల కోసం వేటలో ఉన్న సుధాకర్ కు ఆ సమయంలో దర్శకుడిగా ఉన్న భారతీరాజాను కలవడం తో ఆయనకు కిళుక్కెమ్ పోంగెమ్ రెయిల్ అనే సినిమాలో నటించాడు. ఈ అప్పట్లో భారీ సినిమా విజయం సాధించింది.

తమిళంలో స్టార్ హీరో గా కొనసాగిన సుధాకర్ జూన్ 29, 2010 న అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరి కోమాలోకి వెళ్లిపోయారు. ఈయన తెలుగులో సృష్టి రహస్యలు అనే సినిమా ద్వారా తెలుగు చిత్ర సీమకు పరిచయం అయ్యారు. సుధాకర్ తెలుగులో ఒక కమెడియన్ గా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక సేవలను టాలీవుడ్ కి అందించారు. ఈయన తెలుగులో కొన్ని సినిమాలలో నటనకు ఆయన చాలా మంచి పేరు సంపాదించుకున్నారు. ఈయన చిరంజీవి కంటే ముందుగా హీరోగా తమిళంలో సినిమా చేశారు. ఇక ఈయనతో తమిళంలో హీరోయిన్ అయిన రాధిక తో కలిసి 18 సినిమాల్లో నటించారు. అంతే కాకుండా తమిళంలో మొత్తం 45 సినిమాల వరకు ఈయన నటించారు. వీరి స్నేహితులైన చిరంజీవి, హరి ప్రసాద్ ల కంటే ఈయన చాలా ముందు ఉండేవారు. అయితే తమిళ ఇండస్ట్రీ, రాజకీయాల్లో వచ్చిన మార్పుల కారణాల వల్ల ఆయన తమిళంలో సినిమాలు చేయడం మానేశారు. ఆ తర్వాత కేవలం టాలీవుడ్ సినిమాలకే పరిమితం అయ్యారు. ఇక టాలీవుడ్ లో ఆయన విలన్ క్యారెక్టర్స్, అలాగే కమెడియన్ గా స్థిరపడిపోయారు. అంతే కాదు ఆయన కొన్ని చిత్రాలను కూడా నిర్మించాడు.

అందులో మొదటగా చిరంజీవితో కలిసి యముడికి మొగుడు సినిమా ను కూడా నిర్మించాడు. సుధాకర్ తో పాటు వారి స్నేహితులు కూడా కలిసి ఆ సినిమాను నిర్మించారు. వీటితోపాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో మరికొన్ని సినిమాలను కూడా ఆయన నిర్మించాడు. ఇక పెద్దరికం లాంటి కొన్ని సినిమాలలో సుధాకర్ నటన ను బయటకు తీసుకువచ్చాయి. శుభాకాంక్షలు,స్నేహితులు వంటి సినిమాలకు ఆయనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి నంది అవార్డులు గెలుచుకున్నారు. అయితే 2010 సంవత్సరంలో అనారోగ్యం కారణంగా కోమాలోకి వెళ్లిన ఆయన 2015 సంవత్సరంలో తిరిగి కోలుకున్నారు. అయితే ఆ తర్వాత కూడా తాను సినిమాల్లో నిర్మించబోతున్నట్లు తెలియజేశాడు. అయితే తాను నటన జీవితంలో హీరోగా, విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇలా వివిధ రూల్స్ పోషించిన ఆయన ఆస్తులను అప్పట్లో బాగానే కూడబెట్టారని టాలీవుడ్ టాక్. ఆయన ఆస్తులు కొన్ని కోట్ల రూపాయలు ఉంటాయని చాలామంది చెప్పేవారు. ఆయన మిత్రుడు నారాయణ రావు కూడా ఈ విషయాన్ని చెప్పకనే చెప్పారు. సుధాకర్ కోమలో ఉన్నప్పుడు ఆయన కుటుంబానికి అన్ని విధాల తన స్నేహితులు నారాయణరావు, చిరంజీవి లు సహాయం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here