తండ్రి కొడుకులు నటించిన ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్టా.! ఫట్టా.!!

0
96

ఒక దశలో సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన స్టార్స్ ఆ తరువాత వయసు మీద పడటంతో తమ కొడుకుల సినిమాల్లో నటించడం అప్పటి ఎన్టీఆర్ నుంచి ఈ సాంప్రదాయం తెలుగు సినీ రంగంలో కొనసాగుతూనే ఉంది. అడవి రాముడు, వేటగాడు, రౌడీ రాముడు కొంటె కృష్ణుడు సినిమాల తర్వాత డి.యోగానంద్ దర్శకత్వంలో ‘సింహం నవ్వింది’ సినిమా విడుదలయింది. ఇందులో బాలకృష్ణ తో పాటుగా ఎన్టీరామారావు కూడా నటించారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

1990 ప్రారంభ దశలో ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరావు, నాగార్జున తమ సొంత బ్యానర్ లో వచ్చిన చిత్రం ఇద్దరు ఇద్దరే. 1990 సంవత్సరం నాగార్జున కెరీర్లో బాడ్ ఇయర్ గా చెప్పుకోవచ్చు. ప్రేమ యుద్ధం, ఇద్దరు ఇద్దరే, నేటి సిద్ధార్థ లాంటి చిత్రాల ఫ్లాపులతో నాగార్జున బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డారు.

వయసు పైబడటం తో 1990 దశకం వచ్చేసరికి సూపర్ స్టార్ కృష్ణ మెల్లిమెల్లిగా సినిమాలను తగ్గించుకున్నారు. 1991లో రుష్యేందర్ రెడ్డి దర్శకత్వంలో రమేష్ బాబు, దివ్యభారతి హీరో, హీరోయిన్లుగా నటించిన ‘నా ఇల్లే నా స్వర్గం’ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ కూడా తన కుమారుడితో పాటుగా నటించారు. మంచి ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఆ తర్వాత మురళీ మోహన్ రావు దర్శకత్వంలో రమేష్ బాబు, వాణి విశ్వనాథ్ హీరో, హీరోయిన్లుగా నటించిన ‘ఆయుధం’ చిత్రంలో కృష్ణ కూడా నటించారు. కానీ సినిమా ఒక డిజాస్టర్ గా మిగిలిపోయింది.

2006 సంవత్సరంలో మోహన్ బాబు తన స్వీయ నిర్మాణ సారథ్యంలో రామ్ ప్రసాద్ దర్శకత్వంలో మంచు విష్ణు, పార్వతి మెల్టన్ నటించిన ‘గేమ్’ అనే చిత్రంలో మోహన్ బాబు, శోభన కలిసి జంటగా నటించారు. అత్యంత భారీ పరాజయాన్ని ఈ సినిమా మూటకట్టుకుంది. అలాగే 2014లో మోహన్ బాబు తన ఇద్దరు కుమారులు అయినా విష్ణు, మనోజ్ లతో కలిసి కోన వెంకట్, గోపీమోహన్ కథ అందించిన ‘పాండవులు పాండవులు తుమ్మెద’ అనే చిత్రంలో నటించారు. ఈ సినిమాకి శ్రీవాసు దర్శకత్వం వహించారు. మంచి అంచనాలతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది.

2015లో శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘బ్రూస్ లీ’ చిత్రంలో రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా నటించారు. శ్రీను వైట్ల డైరెక్షన్, రామ్ చరణ్ ఇమేజ్ సినిమాకి ఏ మాత్రం ఉపయోగపడలేదు. అలాగే ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి ఓ గెస్ట్ రోల్ చేయడం జరిగింది. అయినా సినిమా భారీ పరాజయాన్ని చవిచూసింది. ఇలా తమ కొడుకులతో కలిసి నటించిన చిత్రాలు బాక్స్ ఆఫీసు వద్ద పరాజయాన్ని చవిచూశాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here