గట్టు వీరయ్య.. ఈ పేరు వింటే చాలామందికి ఎవరంటే తెలియదు. అదే పొట్టి వీరయ్య అని చెప్తే ఇట్టే గుర్తు పట్టేస్తారు. పొట్టి వీరయ్య ఇదివరకు తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్ని సినిమాల్లో నటించారు. అయితే ఈయన మరుగుజ్జు. ఆయన ఏకంగా 400 చిత్రాలలో నటించి శభాష్ అనిపించుకున్నారు. ఈయన తండ్రి పేరు సింహాద్రి, తల్లి పేరు నరసమ్మ. వీరిది సూర్యాపేట జిల్లా ఫణిగిరి గ్రామం. ఈయన ఫణిగిరి గ్రామంలో నాలుగో తరగతి వరకు చదువుకొని ఆ తర్వాత సూర్యాపేటలో పదవ తరగతి వరకు చదువుకున్నారు. ఇక ఈయన పదో తరగతిలో ఉత్తీర్ణులు కాకపోయే సరికి ఆయన ఏదో ఒక ఉద్యోగం చేయాలన్న సంకల్పంతో ఆయన 1967లో మద్రాసుకు వెళ్లిపోయారు.

ఇలా శోభన్ బాబు గారు కనపడగానే ఆయన దగ్గరికి వెళ్లి తాను వీరయ్య.. అని తాను పదో తరగతి వరకు చదువుకున్న అని తనకు బయట ఎవరు ఉద్యోగాలు ఇవ్వలేదని నాకు సినిమాలలో నటించే అవకాశం ఇవ్వడానికి సాయపడండి అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఈ మాటలు విన్న శోభన్ బాబు వీరయ్య కు ఓ మంచి సలహా ఇచ్చారు. అదేమిటంటే.. నీలా ఉన్న వ్యక్తులకి ఇక్కడ అవకాశాలు ఉండవని, మీలాంటి వారికి తగిన వేషాలు ఇవ్వడానికి బావ నారాయణ గారు, లేకపోతే విఠలాచార్య సినిమాలలో అవకాశాలు లభిస్తాయని వీలైతే వారిని వెళ్లి సలహా ఇచ్చాడు. దీంతో పొట్టి వీరయ్య ఒకానొక సమయంలో విఠలాచార్యల గారిని కలిసారు. అయితే విఠలాచార్య గారితో జరిగిన సంభాషణల తర్వాత వీరయ్య కు సినిమా అవకాశం ఇచ్చారు. ఇందుకు సంబంధించి వెంటనే ఆయనకు 500 రూపాయలు అడ్వాన్స్ గా కూడా ఇచ్చాడు.

అయితే ఆయన చెన్నై నగరానికి చేరుకున్న తరువాత అక్కడ అ తమిళ బాష రాకపోవడంతో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. కాకపోతే, వీరి ఊరికి సంబంధించిన మంగళ గోపాల్ అనే వ్యక్తి చెన్నైలో ఉండడంతో అక్కడ ఆయన దగ్గర అ ఉండేవాడు. ఇక మనం మంగళ గోపాల్ పెళ్లిళ్లకు, సినిమాలకు ఫ్లవర్ డెకరేషన్ చేసే పని చేసేవారు. ఇకపోతే ఆ పూల అంగడి లో వీరయ్య నెలకు కేవలం 90 పైసలతో ఉద్యోగం చేసేవాడు. అయితే ఈ అంగడి గోల్డెన్ స్టూడియో కి చాలా దగ్గరగా ఉండేది. అలా గోల్డెన్ స్టూడియో కి దగ్గరగా ఉండడంతో పూలు అవసరమైనప్పుడు ఎలా అయినా సరే తాను స్టూడియోస్ లోకి వెళ్లి తన నటన ప్రావీణ్యాన్ని ప్రదర్శించడానికి ఎవర్నో ఒకర్ని ఛాన్స్ అడగాలన్నా సమయంలో ఒక రోజున ఆయనకు శోభన్ బాబు గారు కనిపించారు.

అయితే ఆ తర్వాత అగ్గి వీరుడు అనే సినిమా తో వీరయ్య కు అవకాశాన్ని కల్పించారు. ఇక అప్పటి నుంచి వీరయ్య ఏకంగా 400 చిత్రాలలో నటించడం పూర్తి చేశారు. ఇలా ఆయన మొత్తం తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో సినిమాలలో నటించాడు. అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారకరామారావు, శివాజీ గణేషన్, ఎంజీఆర్ లాంటి పెద్ద పెద్ద స్టార్స్ తో కలిసి సినిమాలలో నటించారు. ఇక ఈయనకు మల్లిక అనే ఆవిడతో వివాహం జరిగింది. వీరిది ప్రేమ వివాహం. వీరిద్దరికి మొత్తం ముగ్గురు పిల్లలు. 2008లో ఆయన భార్య కన్నుమూశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here